నేను కిడ్నప్ అయ్యాను మూవీ రివ్యూ

తారాగణం: పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, పృథ్వీ, తాగుబోతు రమేష్, కార్టూనిస్ట్ మల్లిక్, రఘుబాబు, సత్య, కోట శంకర రావు, సత్యానంద్, శ్రీకాంత్, ధీరేంద్ర, హర్ష కృష్ణ మూర్తి, విశాల్ , సౌమిత్రి, మహిమ కొఠారి, అదితి సింగ్, దీక్షిత పార్వతి, తేజు రెడ్డి, బిందు బార్బీ, సప్నా తదితరులు
సంగీతం: శ్రీకాంత్
నిర్మాత: మాధవి
స్క్రీన్ ప్లే: దివాకర్ బాబు
కథ-దర్శకత్వం: శ్రీకరా బాబు

కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మూవీస్ కి మంచి ఆదరణ వుంది. వాటికి తగిన కామెడీ జోడిస్తే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. గతంలో ఈ జోనర్లో అనేక సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. తాజగా మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి ఈ జోనర్లో ‘నేను కిడ్నాప్ అయ్యాను’ అనే చిత్రాన్ని నిర్మించారు. పోసాని లీడ్ పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ చిత్రంలో పోసాని ప్రేక్షకుల్ని ఏమాత్రం నవ్వించాడో చూద్దాం పదండి.

సినిమా కథ: సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే ఛాలెంజ్ తో కూడుకున్నది. నిత్యం ఏదో ఒక కొత్త ఇన్వెన్షన్ తో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని సాఫ్ట్ వేర్ టెకీస్ భావిస్తుంటారు. అందోలో భాగంగానే ఓ యువ సాఫ్ట్ వేర్ బృందం ఓ మంచి సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ ను రూపొందిస్తారు. అయితే దాన్ని సాఫ్ట్ వేర్ టైకూన్ గా పేరొందిన దూబే(పోసాని కృష్ణ మురళి) దొంగలించేసి.. యంగ్ సాఫ్ట్ వేర్ నిపుణులను మోసగిస్తాడు. దాంతో వారు ఎంతో నిరాశకు గురవుతారు. ఎలాగైనా దూబేకు బుద్ధి చెప్పి తమ సత్తా చాటాలనుకుంటారు. దాంతో అతన్ని కిడ్నాప్ చేసినట్టు భ్రమలో పెట్టి.. అతనిలో వణుకు పుట్టేలా చేస్తారు. మరి దూబే ఈ కిడ్నాప్ డ్రామాలో ఎలా రియాక్ట్ అయ్యాడు? చివరకు అతను కిడ్నాప్ అయ్యాననే భ్రమ నుంచి భయటపడ్డాడా? తను దొంగలించిన సాఫ్టవేర్ ప్రాజెక్ట్ ను తిరిగి యువ సాఫ్ట్ వేర్ నిపుణులకు ఇచ్చేశాడా? చివరకు అతను తెలుసుకున్న నీతి ఏంటనేదే మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో పండించే హాస్యం ప్రేక్షకులు హాయిగా రెండు గంటలపాటు నవ్వుకోవడానికి బాగా పనికొస్తుంది. దర్శకుడు ఈ ప్లాట్ తోనే సినిమాను తెరకెక్కించడం బాగుంది. నిత్యం మనం ఏదో ఒక చోట.. లేదా మన చుట్టూ వున్న మిత్ర బృందాలతోనూ ఇలాంటి స్టోరీలు వింటుంటాం. అలాంటి కథను ఇప్పుడు వెండితెరమీద దర్శకుడు హస్యభరితంగా ఆవిష్కరించడం బాగుంది. ఇందులో ముఖ్య పాత్రను పోసానితో చేయించడం వల్ల ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీలవ్వరు. తనకున్న కామెడీ టైమింగ్ తో పోసాని ఆద్యంతం నవ్వులు పూయించాడు. సాఫ్ట్ వేర్ టైకూన్ పాత్రలో అతని నటన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. విలనిజం షేడ్ తోనే నవ్వులు పండించాడు పోసాని. అతనికి తోడుగా కామెడీ కింగ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా తోడు కావడంతో హాస్యం మరింత బాగా పండించాడు. చాలా కాలం తరువాత ‘హస్య బ్రహ్మ’ బ్రహ్మానందం తెరపై కనిపించి మెప్పించాడు. ఇక గిరిబాబు, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్ తదితరులంతా మధ్య మధ్యలో బాగా నవ్వించారు. అక్కడక్కడ వచ్చే కొన్ని ట్విస్టులతో హస్యం పండిస్తూ.. మూవీ పై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాడు. కార్టూనిస్ట్ మల్లిక్ పోలీస్ ఆఫీసర్ గా కొత్తగా కనిపించారు. సత్య, కోట శంకర రావు, సత్యానంద్, శ్రీకాంత్, ధీరేంద్ర, హర్ష కృష్ణ మూర్తి, విశాల్, సౌమిత్రి , మహిమ కొఠారి, అదితి సింగ్, దీక్షిత పార్వతి, తేజు రెడ్డి, బిందు బార్బీ, సప్నా తదితరులంతా తమకు ఇచ్చిన పాత్రల్లో మెప్పించి న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ

పోసాని

డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :

అక్కడ అక్కడ స్లో బోర్ సీన్స్

రి-రికార్డింగ్

సాంకేతిక నిపుణుల  విషయములో  దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. అలాగే దివాకర్ బాబు అందించిన స్క్రీన్ ప్లే కథను ముందుకు నడిపించడానికి బాగా తోడ్పడింది. కచ్చితంగా ఈచిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో సందేహం లేదు. ఈ వారంలో విడుదలయ్యే సినిమాల్లో ఇంత భారీదనంతో కూడిన కామెడీ కింగ్ లు లేరు. కాబట్టి.. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ వారం ఈ సినిమానే బెస్ట్ ఛాయిస్. అలాగే సంగీత దర్శకుడు శ్రీకాంత్ అందించిన పాటలు బాగున్నాయి. కిడ్నాప్ డ్రామకు నేపథ్య సంగీతం కూడా ఇంపార్టెంట్ కాబట్టి.. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్టోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దాంతో ఇది చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బాగా రిచ్ గా వుంది. కమెడియన్స్ అందరినీ బాగా చూయించారు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా వుంది. ఎక్కడా బోరింగ్ అనేది లేకుండా ఎడిట్ చేశారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి. నిర్మాత మాధవి అద్దంకి ఖర్చుకు వెనకడాలేదు. దివాకర్ బాబు స్క్రీన్ ప్లే కూడా ప్లస్ అయ్యింది. మల్లిక్ డైలాగ్స్ బాగున్నాయి. కామెడీతో కూడుకున్న కిడ్నాప్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం బెస్ట్ ఛాయిస్ అవుతుంది.