ఓయ్ నిన్నే – అందరికి నచ్చే ప్రేమ కథ

విడుదల తేదీ : అక్టోబర్ 6, 2017

దర్శకత్వం : సత్యం చల్లకొటి

నిర్మాత : సి.హెచ్. వంశి కృష్ణ శ్రీనివాస్

సంగీతం : శేఖర్ చంద్ర

నటీనటులు : భరత్ మార్గని, సృష్టి డాంగే

సినిమిర్చి.కాం రేటింగ్ 3/5

సినిమా కథ :

ఇది ఓ ప్రేమ జంట మధ్య సాగె కథ. విషు(భరత్), అమ్ములు(సృష్టి డాంగే ) లు చిన్ననాటి నుంచే స్నేహితులు. కలసి పెరిగిన వీరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. కానీ అమ్ములుకు మరొకరితో పెళ్లి నిశ్చయం అవుతుంది. వీరి ప్రేమ విడిపోవడానికి కారణం ఏంటి ? విషు ఏం చేశాడు ? ప్రేమ జంట తిరిగి కలుస్తారా ? లేక అమ్ములు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా ? అనే అంశాలతో కూడుకున్నదే ఈ సినిమా కథ.

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. ప్రేమ నేపథ్యంలో సాగె సన్నివేశాల్ని పల్లెటూరి వాతావరణంలో కెమెరామెన్ బాగా చూపించారు. సంగీతం బావుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది. మరి కొన్ని నిమిషాల చిత్రాన్ని తగ్గించి ఉంటె బావుండేది.

సినిమా కి ప్లస్ పాయింట్స్ :
కొత్త అనిపించే సన్నివేశాలు
దర్శకుడు
హీరో భరత్
ఫస్ట్ హాఫ్ కామెడీ
సత్య
కెమెరా

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ కామెడీ లేకపోవటం
కొన్ని బోరింగ్ సీన్స్

సినిమా కి చివరి మాట :

విలేజ్ నేపథ్యంలోని ప్రేమకథలు ఇష్టపడే వారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చే అవకాశం ఉంది.