నలుగురు అమ్మాయిల గ్లామరస్ మూవీ నలుగురు అమ్మాయిల గ్లామరస్ మూవీ
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తొలి ప్రొడక్షన్ గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. హిమబిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో బాలు ద‌ర్శక‌త్వంలో సినిమా తెర‌కెక్కనుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు బాలు... నలుగురు అమ్మాయిల గ్లామరస్ మూవీ

బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తొలి ప్రొడక్షన్ గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. హిమబిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో బాలు ద‌ర్శక‌త్వంలో సినిమా తెర‌కెక్కనుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు బాలు మాట్లాడుతూ – “ మ‌హాన‌గ‌రంలో నివ‌సిస్తూ స్వతంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థే ఈ చిత్రం. త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్రసాద్ నలుగురు అమ్మాయిలుగా న‌టిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో క‌థానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటాయి“ అన్నారు.

నిర్మాత హిమబిందు వెల‌గ‌పూడి మాట్లాడుతూ – “హైద‌రాబాద్‌లో నేటి నుండి తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రిలో గోవాలో సెకండ్ షెడ్యూల్‌ను చిత్రీక‌రిస్తాం. అన్నీ కార్యక్రమాల‌ను పూర్తిచేసి మే నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

ఇదిలావుంటే ఈ సినిమా కాస్త రొమాంటిక్ ప్లస్ గ్లామర్ టచ్ తో వుంటుందని, నలుగురు హీరోయిన్లు వీలయినంత యథేచ్ఛగా అందాలు ఆరబోస్తారని, బికినీ సీన్లు కనువిందు చేసేలా ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఈ అందాల ఆరబోత చుట్టూ అల్లిన కథతో సినిమాను తయారుచేస్తున్నట్లు కనిపిస్తోంది.

త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్రసాద్ ప్రధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ర‌ఘుకుంచె, నిర్మాత‌లు: రాధికా శ్రీనివాస్ వెత్షా, ఉమా కూచిపూడి, నిర్మాత‌: హిమ బిందు వెల‌గపూడి, ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: బాలు.

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *