ఇదీ బోయపాటి కమర్షియల్ స్టామినా ఇదీ బోయపాటి కమర్షియల్ స్టామినా
స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్టామినా ఎంతో మరోసారి ప్రూవ్ అయ్యింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందించిన వినయ విధేయ రామ చిత్రం విడుదల ముందు ఏ... ఇదీ బోయపాటి కమర్షియల్ స్టామినా

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్టామినా ఎంతో మరోసారి ప్రూవ్ అయ్యింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందించిన వినయ విధేయ రామ చిత్రం విడుదల ముందు ఏ అంచనాలనైతే క్రియేట్ చేసిందో ఆ అంచనాల్ని రీచ్ అవ్వనుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బి, సి సెంటర్లలో కుమ్మేస్తోంది. పండగ వాతావరణం చల్లబడినప్పటికీ… ఈ సినిమా కలెక్షన్ల వేడి మాత్రం తగ్గలేదు. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రతో పాటు ఓవర్సీస్ మార్కెట్లోనూ బోయపాటి… ఘానాపాటి అనిపించాడు. విడుదలకు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ చూశారు. ఇక ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్ జోన్ లోకి వెళ్లనున్నారు. నిర్మాతలకు ముందుగానే లాభాల్ని తెచ్చిపెట్టి తన కమర్షియల్ స్టామినా రుచి చూపించాడు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ సైతం లాభాల బాటలోకి పయనిస్తుండడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ కలెక్షన్స్ సునామీతో బోయపాటి స్టామినా ఏంటో మరోసారి రుజువైందని చెప్పొచ్చు.

రాంచరణ్, కైరా జంటగా నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీగా నిర్మించారు. ఈ సినిమాలోని యాక్షన్ ప్యాక్ డ్ ఎమోషనల్ సీన్స్ కి జనాలు నిరాజనాలు పట్టారు. బోయపాటి స్టామినాకు తగ్గట్టుగా రాంచరణ్ పెర్ ఫార్మెన్స్ తోడవ్వడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి రేసులో ముందంజలో దూసుకెళ్తూ…. బోయపాటి సినిమా అంటే అటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు ఖాయమని వినయ విధేయ రామ మరోసారి రుజువు చేసింది.

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *