వినోదభరితమైన కుటుంబ కధా చిత్రం వినోదభరితమైన కుటుంబ కధా చిత్రం
నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తమ తొలి చిత్రాన్ని నేడు ప్రారంభించింది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ నాయికగా... వినోదభరితమైన కుటుంబ కధా చిత్రం

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తమ తొలి చిత్రాన్ని నేడు ప్రారంభించింది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయింది.

రామా నాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభమైన ఈ చిత్రం వేడుకకు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్, జెమిని కిరణ్,శరత్ మరార్, ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్ధ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి) తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ రచయిత భూపతిరాజా ఈ చిత్రానికి కథ నందించారు.

 

గిఫ్టన్ ఇలియాస్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కధా చిత్రమని దర్శకుడు ఎన్ వి.నిర్మల్ కుమార్ తెలిపారు. ఈ చిత్రం ఈ నెల మరియు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే వివిధ షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, మాటలు: రాజేంద్రకుమార్, మధు; నిర్మాతలు:జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్, దర్శకత్వం: ఎన్ వి. నిర్మల్ కుమార్.

 

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *