అక్కడ సాధిస్తున్నాడు మనవాడు తెలుగు వాడు అక్కడ సాధిస్తున్నాడు మనవాడు తెలుగు వాడు
దర్శకుడు కావాలనేది ఎంతోమంది కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తుంటారు. కథల్ని అద్భుతంగా మలిచేందుకు కడుపు మాడ్చుకుంటున్న ఎంతో మంది వ్యథల్ని వింటుంటాం….. ఆకలి అన్నీ నేర్పిస్తుందంటారు. దర్శకుడిగా... అక్కడ సాధిస్తున్నాడు మనవాడు తెలుగు వాడు

దర్శకుడు కావాలనేది ఎంతోమంది కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తుంటారు. కథల్ని అద్భుతంగా మలిచేందుకు కడుపు మాడ్చుకుంటున్న ఎంతో మంది వ్యథల్ని వింటుంటాం….. ఆకలి అన్నీ నేర్పిస్తుందంటారు. దర్శకుడిగా టైటిల్స్ లో చూసుకోవాలనుకున్న రవికి కూడా ఆకలే అన్నీ నేర్పించింది. తన బతుకు చిత్రంలో ఎన్నో రోజులు ఆకలికి అలమటించాడు. డైరెక్టర్ కావాలని ఊరొదిలి హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. డైరెక్టర్ గా పేరు పడేవరకు ఊర్లో అడుగుపెట్టనని శపథం చేసి మరీ వచ్చాడు. తన ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, ఛీదరింపులు.. అయినా పట్టు విడువలేదు… అవకాశాల కోసం ఎంతో ట్రై చేశాడు. ఎందరికో కథలు చెప్పాడు. కాళ్లు బొబ్బలెక్కేలా తిరిగాడు… అవకాశం ఎక్కడా రాలేదు… అదృష్టం తనని చూసి వెటకారంగా నవ్వింది. అయినా తన ప్రయత్నం మానలేదు. స్నేహితుల సహకారంతో… పూట గడిపేవాడు. సినిమాకు భాష సమస్య కానే కాదనే సత్యం తెలుసుకున్నాడు. ఇంట గెలవకపోయినా సిగ్గు పడలేదు. రచ్చ గెలిచి చూపించేందుకు కన్నడనాట అడుగు పెట్టాడు. అక్కడ అడుగు పెట్టగానే ఘనస్వాగతం లభిస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందని అతనికి బాగా క్లారిటీ ఉంది. ప్రయత్నాలు మొదలు పెట్టాడు.. చివరికి సాధించాడు… ప్రముఖ నటుడు కన్నడ ప్రభాకర్ తనయుడు వినోద్ కుమార్ ని తన కథతో మెప్పించాడు. తెలుగు కమర్షియల్ సినిమాల మాదిరిగా…కన్నడ అభిమానుల అభిరుచులకు అనుగుణంగా షాడో అనే కథను తయారు చేశాడు. సినిమా కూడా పూర్తి చేశాడు. ఇటీవలే కన్నడ స్టార్ ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత కన్నడ మీడియా రవిని ఆకాశానికెత్తేశాయి… తెలుగు నిర్మాతలు గుర్తించని రవి లోని టాలెంట్ ని కన్నడ నిర్మాతలు గుర్తించారంటూ… తెలుగోడిని ప్రశంసల్లో ముంచెత్తారు…. తన గురువు పూరీ జగన్నాథ్ ప్రేరణతోనే ముందుకు వెళ్తున్నానంటున్నాడు దర్శకుడు రవి గౌడ.

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *