ప్రీ లుక్‌తో మెగాస్టార్‌కి బర్త్‌డే విషెస్‌ ప్రీ లుక్‌తో మెగాస్టార్‌కి బర్త్‌డే విషెస్‌
యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్‌.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  తన కొత్త సినిమా ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. అ! ఫేమ్ ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రీ లుక్‌ ఆసక్తికరంగా రూపొందించారు.... ప్రీ లుక్‌తో మెగాస్టార్‌కి బర్త్‌డే విషెస్‌

యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్‌.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  తన కొత్త సినిమా ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. అ! ఫేమ్ ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రీ లుక్‌ ఆసక్తికరంగా రూపొందించారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ ఫిలిం ఇది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో సినిమా తెర‌కెక్కనుంది.

రాజ‌శేఖ‌ర్ సినిమా ప్రీ లుక్‌లో 1983లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ పోస్టర్‌తో చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే ఏడాది ఇండియా క్రికెట్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను కూడా ఈ పోస్టర్‌లో చూపించారు.

అ! లాంటి డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకున్న ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో రాజ‌శేఖ‌ర్ సినిమా చేస్తుండ‌టంతో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఆగ‌స్ట్ 26న రాఖీ పౌర్ణమి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్లడించ‌నున్నారు.

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *