సర్వస్వము టీజర్ లాంచ్ సర్వస్వము టీజర్ లాంచ్
సర్వం ప్రొడక్షన్ బ్యానర్ పై విమల్‌వామ్ దేవ్ సమర్పణలో… శ్రేయాస్ కబాడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్వస్వము’. కన్నడలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.... సర్వస్వము టీజర్ లాంచ్

సర్వం ప్రొడక్షన్ బ్యానర్ పై విమల్‌వామ్ దేవ్ సమర్పణలో… శ్రేయాస్ కబాడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్వస్వము’. కన్నడలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ఆడియోను విడుదల కార్యక్రమం ఫిలింఛాంబర్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో
దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ…. “టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు. కన్నడలో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించి మాకు ఇక్కడ స్థానం కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ చిత్రం లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్. కన్నడలో మూడు అవార్డులు వచ్చాయి.
హీరోయిన్ ధనూషా మాట్లాడుతూ… ఈ చిత్రంలో నేను బ్లైండ్ క్యారెక్టర్‌ చేస్తున్నాను. అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. అని అన్నారు.

సాత్విక మాట్లాడుతూ…. “నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. కన్నడలో ఇది నా రెండో చిత్రం. తెలుగులో మొదటి చిత్రం. మా సినిమాను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో తిలక్‌శేఖర్, చేతన్‌వర్ధన్, సాత్విక, దనూషా, సూరజ్, దర్శకుడు శ్రేయాస్ కబడీ తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు
తిలక్ శేఖర్, చేతన్ వర్థన్, సాత్విక, రనూషా, కార్తీక్

సాంకేతిక వర్గం
కెమెరా – భూపేందర్ పాల్ సింగ్
మ్యూజిక్ – వి.శ్రీధర్ సభ్రం
ఎడిటింగ్ – సురేష్ అరుముగన్
ఫైట్స్ – థ్రిల్లర్ మంజు
పీఆర్వో – లక్ష్మీ నివాస్
పాటలు – రాజు, శివగణేష్, సుహాన్
సింగర్స్ – శక్తి శ్రీ గోపాలన్, హరిచరణ్, రాజేష్
అసోసియేట్ డైరెక్టర్స్ – యశ్వంత్ కుమార్, కిరణ్ గౌడ్
నిర్మాత – విమల్ వాసుదేవ్
దర్శకత్వం – శ్రేయాస్ కబాడి

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *