సూర్యాస్తమయం లో ఏమి అవుతుంది సూర్యాస్తమయం లో ఏమి అవుతుంది
బండి సరోజ్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సూర్యాస్తమయం’. త్రిశూల్‌ మరో కథా నాయకుడు. హిమాన్సి నాయిక. రఘు పిల్లుట్ల, రవికుమార్‌ సుదర్శి నిర్మాతలు. బుధవారం హైదరాబాద్‌లో నిర్మాత డి.సురేష్‌బాబు... సూర్యాస్తమయం లో ఏమి అవుతుంది

బండి సరోజ్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సూర్యాస్తమయం’. త్రిశూల్‌ మరో కథా నాయకుడు. హిమాన్సి నాయిక. రఘు పిల్లుట్ల, రవికుమార్‌ సుదర్శి నిర్మాతలు. బుధవారం హైదరాబాద్‌లో నిర్మాత డి.సురేష్‌బాబు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రం బాగుంది. సరోజ్‌ గతంలో నాకొక కథని వినిపించారు. దాన్ని తమిళంలో తీసి విజయాన్ని సాధించారు. ఇప్పుడు తెలుగులోనూ విజయాన్ని దక్కించుకోవాల’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘చెగువెరా స్ఫూర్తితో ఈ కథని రాసుకున్నా. ‘సూర్యాస్తమయం’ పేరు ఎందుకు పెట్టామనేది సస్పెన్స్. కథ, మాటలు, పాటలు, సంగీతం, ఫొటోగ్రఫీలే కాకుండా మరో ఐదు శాఖల బాధ్యతల్ని నేనే నిర్వర్తించాన’’న్నారు.

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *