మూవీ రివ్యూ : ఇంద్రసేన – బ్రదర్ సెంటిమెంట్

విడుదల తేదీ : నవంబర్ 30, 2017

సినిమిర్చి.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : జి. శ్రీనివాసన్

నిర్మాత : రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనీ

సంగీతం : విజయ్ ఆంటోని

నటీనటులు : విజయ్ ఆంటోని, డయానా చంపిక

తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘అన్నాదురై’ తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో ఈరోజే విడుదలైంది. విడుదలకు ముందే ఆడియో వేడుకలో 10 నిముషాలు ప్రదర్శితమై ఆసక్తిని నెలకొల్పిన చిత్రం

సినిమా కథ :

ఇంద్రసేన (విజయ్ ఆంటోని), రుద్రసేన (విజయ్ ఆంటోని) ఇద్దరూ ఒకేలా ఉండే అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇంద్రసేన ప్రేమ విఫలమై తాగుడుకు బానిసై బాధపడుతుంటాడు. అతని తమ్ముడు రుద్రసేన మాత్రం మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతుంటాడు. చేయని తప్పులకు కష్టాలపాలైన ఇంద్రసేన, రుద్రసేనలు ఎలా తయారయ్యారు, చివరికి వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

న్యాచురల్ యాక్టింగ్ అందరు
ఇంటర్వెల్ ట్విస్ట్
మ్యూజిక్
ఫైట్స్
కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
ఎడిటింగ్

సాంకేతిక విభాగం :

దర్శకుడు శ్రీనివాసన్ కేవలం ఒకే పాయింట్ మీద కథను రాసుకుని ఉంటే కనీసం సినిమా పర్వాలేదని స్థాయిలో అయినా ఉండేది. కానీ అలా చేయకుండా అనవసరంగా స్వేచ్ఛను వాడేసుకుని అనేకమైన ఉప కథల్ని సినిమాలోకి బలవంతంగా జొప్పించడంతో చిత్రం బోర్ కొట్టేసింది. ఇక విజయ్ అంటోనీ సంగీతం కూడా ఏంటా గొప్పగా లేదు.

యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని బాగున్నాయి. ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్లోని కొన్ని అనవసరమైన ప్లాట్స్ ను తొలగించి ఉండాల్సింది. దిల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

సినిమా తీర్పు :

మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం బాగుంది