సినిమా రివ్యూ  : జవాన్ – దేశం కోసం పోరాడే ఒక యువకుడి కథ

విడుదల తేదీ : డిసెంబర్ 01, 2017

సినిమిర్చి.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : బి.వి.ఎస్‌. ర‌వి

నిర్మాత : కృష్ణ‌

సంగీతం : థమన్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్, ప్రసన్న

సినిమా కథ :

జై (ధరమ్ తేజ్) చిన్నప్పటి నుండి దేశమంటే భక్తితో పెరిగి పెద్దై డిఆర్డీవోలో ఉద్యోగంలో చేరాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలోనే డిఆర్డీవో శాస్త్రవేత్తలు ఆక్టోపస్ అనే ఒక పవర్ ఫుల్ మిస్సైల్ సిస్టంను కనిపెడతారు.దాన్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఆ డీల్ ను ప్రసన్నకు అప్పగిస్తారు. ప్రసన్న దాన్ని దొంగిలించడానికి ఒక ప్లాన్ రెడీ చేస్తాడు. కానీ ఆ ప్లాన్ ను జై అడ్డుపడతాడు. దాంతో ప్రసన్న జై కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అలా ఒకవైపు దేశం, మరోవైపు కుటుంబాన్ని కాపాడాల్సిన విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న జై ఏ నిర్ణయం తీసుకున్నాడు, ఆక్టోపస్ ను క్రిమినల్స్ చేతిలోకి వెళ్లకుండా ఎలా కాపాడాడు అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సాయిధరమ్ తేజ
డైరెక్షన్
సెకండ్ హాఫ్
ప్రసన్న
డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

సినిమా కొత్తదనం లేకపోవటం
బోర్ సన్నీవేశాలు

సినిమా కి సాంకేతిక విభాగం :

రచయిత, దర్శకుడు బివిఎస్.రవి నార్మల్, ఎన్నో సినిమాల్లో చూసిన కథాంశాన్నే ఈ సినిమా కోసం కూడా ఎంచుకున్నారు. కానీ దాన్ని ప్రేక్షకులు కోరుకునే, వాళ్ళను ఆకట్టుకునే ఉత్కంఠమైన సన్నివేశాలతో కూడిన కథనంతో నింపలేకపోయారు. దాంతో సినిమా చాలా వరకు రొటీన్ గా, నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలిగింది. సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటల సంగీతం పర్వాలేదనిపించింది. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ బాగానే ఉంది. కెవి. గుహన్ సినిమాటోగ్రఫీ బాగుంది కానీ నెట్ ఎఫెక్ట్ లో తీసే ఒక కీలకమైన ఫైట్లో మాత్రం క్లారిటీ కొరవడింది. పాటల్లోని నృత్యాలు అలరించాయి.

సినిమాకి చివరి తీర్పు :

రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమా ఫ్యాన్స్ కి నచ్చుతుంది.