సినిమా రివ్యూ  : సప్తగిరి ఎల్ఎల్ బి

విడుదల తేదీ : డిసెంబర్ 07, 2017

సినిమిర్చి.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : చరణ్ లక్కాకుల

నిర్మాత : డా. కె.రవి కిరానే

సంగీతం : బుల్గేనిన్

నటీనటులు : సప్తగిరి, కాశిష్ వోహ్రా

గతేడాది ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నటుడు సప్తగిరి చేసిన రెండో ప్రయత్నమే ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’. ఈరోజే విడుదలైన సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

సినిమా కథ :

చిత్తూరులో ఉంటూ ఎల్.ఎల్.బి పూర్తిచేసిన సప్తగిరి లాయర్ గా ఎదిగి మంచి పేరు, డబ్బు సంపాదించి తన మరదల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ సిటీకి వచ్చి సెషన్స్ కోర్టులో ప్రాక్టీస్ పెట్టి కేసుల కోసం ఎదురుచూస్తుంటాడు.అలాంటి తరుణంలోనే అతను ప్రముఖ లాయర్ రాజ్ పాల్ (సాయి కుమార్) వాదించి, తీర్పు రాబట్టుకున్న ఒక హిట్ అండ్ రన్ కేసుపై పిల్ వేసి దాన్ని రీ ఓపెన్ చేయిస్తాడు. అసలు సప్తగిరి ఆ కేసుని ఎందుకు రీ ఓపెన్ చేయిస్తాడు, ఆ కేసు కథేంటి, పేరు మోసిన లాయర్ రాజ్ పాల్ ను సప్తగిరిని ఎలా ఢీ కొట్టాడు, చివరికి కేసు గెలిచాడా, లేదా అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

కేస్ వాదన
సీనిమా ఫోటోగ్రఫీ
జనరల్ పాయింట్ పబ్లిక్
ఇంటర్వెల్ ట్విస్ట్
సప్తగిరి డాన్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడ అక్కడ లాజిక్ లేకపోవటం
ప్రీ క్లైమాక్స్
కామెడీ లేకపోవటం

సాంకేతిక విభాగం :

దర్శకుడు చరణ్ లక్కాకుల సినిమా కోసం ఎంచుకున్న న్యాయం కోసం పోరాడే లాయర్ అనే పాయింట్ బాగానే ఉన్నా ఆకట్టుకునే కథనాన్ని రాయలేదు. ముఖ్యమైన క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప మిగతా వీటి మీదా పెద్దగా పనితనం చూపలేదు. దీంతో చిత్ర ఏదో ఉంది అన్నట్టు మిగిలింది తప్ప స్టాంప్ వేయగలిగిన చిత్రంగా నిలవలేకపోయింది.

సన్నివేశాల టేకింగ్ కూడా ప్రభావవంతంగా లేదు. బుల్గేనిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటల సంగీతం మెప్పించలేదు. సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది, గౌతమ్ రాజు ఎడిటింగ్ పర్వాలేదు. సప్తగిరి వేసిన డ్యాన్సులు బాగున్నాయి. డా. కె.రవి కిరానే పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

సినిమా కి చివరి తీర్పు :

హీరో సప్తగిరి చేసిన ఈ రెండవ సినిమా ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ అనుకున్నంత గా బాగానే ఉంది