ఇ ఈ మూవీ రివ్యూ

సినిమిర్చి. కామ్ రేటింగ్ :3/5

ఇ ఈ. అమ్మాయి, అబ్బాయి మధ్య ఈగోలు.. ఇష్టాల మధ్య సాగే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నీరజ్‌ శ్యామ్‌, నైరా షా జంటగా నటించారు.

సినిమా కథ :

సిద్ధు (నీరజ్ షా) ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని బాస్ ఎన్.కె.(సుధాకర్) కి అత్యంత విధేయుడు. ఇదిలా ఉంటే… అమ్మాయిలకు మాత్రం బాగా దూరం. వారంటే అస్సలు పడదు. తన జీవితంలోకి ఎలాంటి అమ్మాయి రాకూడదని దేవుళ్లకు మొక్కుతుంటాడు. ఓరోజు అనుకోని పరిస్థితుల్లో ఉన్నత కుటుంబానికి చెందిన హాసిని (నైరా షా) గొడవతో పరిచయం అవుతుంది. ఆమెనే అతనికి బాస్ అవుతుంది. అంటే ఎన్.కె కూతురు. హాసినికి, సిద్ధూకు తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలో భాగంగా తపస్సు చేస్తున్న స్వామి ఎదురౌతాడు. అమ్మాయిలు మనసులో మాట్లాడుకునే మాటలు సిద్ధుకు వినపడేలా శపిస్తాడు. కొంతకాలం ఈ శాపాన్ని తనకు పాజిటివ్ గా మలుచుకుంటాడు సిద్ధు. అలా హాసినితో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమలో ఉంటారు. అయితే ఈ మనసులోని మాటలే తనకు సమస్యల్ని తెచ్చిపెడతాయి. మళ్లీ సాధువు దగ్గరికి వెళ్తాడు. సిధ్దు సోల్ ని హాసిని లోకి… హాసిని సోల్ ను సిద్ధులోకి పంపించి మాయమౌతాడు. అలా ఇద్దరి సోల్స్ మారిన తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి. ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. మళ్లీ తమ సోల్స్ యాథాస్థితికి వచ్చేందుకు ఏం చేశారు. సాధువు మళ్లీ కనిపించాడా… తనను లోబర్చుకునేందుకు ట్రై చేస్తున్న అమ్మాయి నుంచి సిద్ధు ఎలా తప్పించుకున్నాడనేది అసలు కథ.

నటీనటుల పెర్ పార్మెన్స్.

హీరో నీరజ్ షా… కన్నడలో సినిమాలు చేయడంతో… అతనికి నటన ఈజీనే అయ్యి ఉంటుంది. తెర మీద మధ్యతరగతి కుర్రాడి పాత్రకు సరిగ్గా సరిపోయాడు. అమ్మాయిలంటే ఇష్టంలేని మధ్య తరగతి కుర్రాడిగా సహజంగా నటించాడు. ప్రథమార్థంలో గెటప్ కు ద్వితాయర్థంలో గెటప్ కు సంబంధం ఉండదు. కానీ పాత్రల్ని బట్టి తనను తాను మార్చుకున్న తీరు బాగుంది. ఓ దశలో అమ్మాయి మ్యానరిజమ్స్ కూడా చూపించాలి. వాటిని బాగా ప్రదర్శించగలిగాడు. ఇక ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ హీరోయిన్ నైరా షా. జెనీలియా, హెభా పటేల్ లోని ఎనర్జీని చూపించింది. ప్రతీ సీన్ లో హీరోని డామినేట్ చేసేందుకు ట్రై చేసింది. అటు అందం, ఇటు గ్లామర్, అభినయంలో పూర్తి మార్కులు కొట్టేసింది. నైరా షా ఈ సినిమాతో అందరికీ నచ్చేస్తుంది. డబ్బింగ్ తానే చెప్పిందా అన్నట్టుగా పెర్ ఫార్మ్ చేసింది. ఈ సినిమా తర్వాత నైరా షాకు మంచి పేరొస్తుంది. సుధాకర్ చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు. దర్శకుడు మంచి హుందాతనం ఉన్న పాత్ర రాశారు. ఆ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు. కామెడీ పరంగా అభయ్ కామెడీ నవ్వులు పండిస్తుంది. నీటిగా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారో దర్శకుడు రామ్ గణపతి బాగా రాసుకున్నారు. టాయిలెట్ కి వెళ్లి కడుక్కోకపోవడం.. జామకాయ్ సీన్ హిలేరియస్ గా ఉంది. ఇక హీరో పెళ్లి చూపుల కోసం వెళ్లినప్పుడు గజలక్ష్మి తో సీన్స్ బాగా పండాయి. కథ ఎమోషనల్ గా సాగుతున్న సమయంలో గజలక్ష్మి కామెడీ హైలైట్ గా నిలిచింది. సమీర్ మరో కీలక పాత్రలో నటించాడు. తాగుబోతు రమేష్ మరోసారి తాగుబోతుగా నటించి మెప్పించాడు. రెండో హీరోయిన్ గా నటించిన సాషా ఎక్స్ పోజింగ్ తో పిచ్చెక్కించింది. ఈమెకు మంచి ప్లస్ అయ్యే సినిమా. అన్నపూర్ణ టైం దొరికినప్పుడల్లా నేటి జనరేషన్ మీద పంచులేసింది. హీరోయిన్ పనిమనిషి బాబూ… అంటూ వేసిన డైలాగ్స్ కి అందరూ నవ్వుతారు.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్షన్
కెమెరా వర్క్
కామెడి
హీరో -హీరోయిన్స్
ఎడిటింగ్
రి రికార్డింగ్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

సినిమా చివరి మాట :
సోల్స్ మారడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. అందరికి తప్పకుండా నచ్చుతుంది