హలో మూవీ రివ్యూ

రివ్యూ : హలో మూవీ రివ్యూ

విడుదల తేదీ : డిసెంబర్ 22, 2017

సినిమిర్చి.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : అఖిల్‌ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్‌

దర్శకత్వం : విక్రమ్‌ కె. కుమార్‌

నిర్మాత : అక్కినేని నాగార్జున

సంగీతం : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫర్ : పి. ఎస్‌. వినోద్‌

ఎడిటర్ : ప్రవీణ్‌ పూడి

ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

సినిమా కథ :

అనాథైన శీను (అఖిల్) తన చిన్నప్పటి స్నేహితురాలు జున్ను (కళ్యాణి ప్రియదర్శిన్) ను ఎంతో అభిమానిస్తాడు. జున్ను కూడా శీను అంటే ఎంతో అభిమానం చూపిస్తుంది. అలా వాళ్ళిద్దరి స్నేహం కొనసాగుతుండగా జున్ను ఢిల్లీ వెళ్లిపోతూ అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటుంది.

కానీ ఆ నెంబర్ ను పోగొట్టుకున్న శీను జున్ను ఎప్పటికైనా తిరిగొస్తుందని 13 ఏళ్ల నుండి ఎదురుచూస్తూనే ఉంటాడు. అలా ఎదురుచూపుల్లో ఉన్న శీనును జున్ను ఎలా కలిసింది ? ఆమెను చేరుకోవడానికి శీను ఎలాంటి సాహసాలు చేశాడు ? విధి వాళ్ళిద్దర్నీ ఎలా కలిపింది ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్
రమ్యకృష్ణ
జగపతిబాబు
అఖిల్
డైరెక్షన్
కెమెరా వర్క్
రి రికార్డింగ్

మైనస్ పాయింట్స్ :

కామెడీ మిస్ అవ్వటం

సాంకేతిక విభాగం :

దర్శకుడు విక్రమ్ కుమార్ కొంత నార్మల్ కథనే తీసుకున్నా దానికి యాక్షన్ ను జోడించి సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు. హీరో హీరోయిన్ల చిన్నప్పటి కథలో మనసుకు హత్తుకునే ఎమోషన్ ను చూపెట్టినా పెద్దయ్యాక వారు కలుసుకున్నాక వారి మధ్యన అంతటి భావోద్వేగం పండలేదు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ బాబ్ బ్రౌన్ రూపొందించిన యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి.

అనూప్ రూబెన్స్ పాటలు సంగీతం, నైపథ్య సంగీతం అన్నీ సినిమాకు బాగా హెల్ప్ అవుతాయి. అన్నీ వినడానికి చాలా బాగున్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగానే ఉంది. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాతగా నాగార్జునగారు సినిమాను గొప్ప స్థాయిలో నిలబెట్టారు.

తీర్పు :

మొత్తం మీద ఈ ‘హలో’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగల చిత్రం.