2018 నూతన సంవత్సరం వేడుకలు

1. చిలకలూరి పేట, యానాధి కాలనీ లో ఇ. శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్స్ సొసైటీ నూతన సంవత్సర సందర్బంగా 150 మంది పేద వృద్దులకు S.I. శ్రీ రామ్ కోటయ్య, శ్రీ ఉమా మహేశ్వర రావు చేతుల మీదుగా దుప్పట్లు పంపిణి చేసారు . అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమాలని చేయటం అభినందించదగినదన్నారు. ఈ కార్యక్రమం లో సంగి శెట్టి హనుమంత రావు , బిటా నాగాంజనేయులు , షేక్ అజారుద్దీన్ , షేక్ సవాబ్ ఖాన్ , షేక్ నాసర్ వాలి , షేక్ రఫీ , కావూరి రాంబాబు, నాసరుద్దీన్ తదితర అభిమానులు పాల్గొన్నారు

2. 2018 నూతన సంవత్సరం సందర్బంగా అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ , వికాస్ రెడ్డి , జయశ్రీ , శ్రీకాంత్, జహీర్ తదితర అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల దంపతులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు

3. 2018 నూతన సంవత్సరం సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల దంపతులను నల్గొండ జిల్లా చండూరు ప్రిన్స్ నరసింహ ఆద్వర్యం లో మిరియాలగూడా యన్. రవి – క్యాలెండరు, చిత్ర పటాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమం లో యన్ . మని , యన్ . సతీష్ , డి . భరత్ , కె . శివ శంకర్ , డి . సాయి ,యల్ . నరేష్ , యస్ . కె . షఫీ , ఎ . గోపి కృష్ణ , పి . నాగేంద్ర, యస్ . కె . సూరజ్ , పి . నాగరాజు తదితర అభిమానులు పాల్గొన్నారు

4. ఏలూరు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానులు సైమన్ గురజాల ఆద్వర్యం లో రూపొందించిన క్యాలెండరు ను నరేష్, నవీన్ విజయ కృష్ణలు మరియు హీరో సుధీర్ బాబు లు విడుదల జేశారు . ఈ కార్యక్రమం లో సాయి అవినాష్ , సుధాకర్ , నాని తదితర అభిమానులు పాల్గొన్నారు
press note