టచ్ చేసి చూడు డైరెక్టర్ ఇంటర్వ్యూ

సినిమాలో రవితేజ ఏసీపీ కార్తికేయగా నటిస్తున్నారు. ఇది అతని జీవితంలో రెండు వేర్వేరు కాలాల నేపథ్యంలో సాగే కుటుంబ కథ. కథానాయిక రాశీఖన్నా డ్యాన్స్‌ టీచర్‌. వీరి రొమాంటిక్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల రవితేజ పాత్ర కన్నా, రాశి పాత్రే మిన్నగా అనిపిస్తుంది. ఇది నచ్చే రవితేజ ఒప్పుకున్నారు. అలాగే సీరత్‌కపూర్‌ కార్తికేయకి బాల్యమిత్రురాలు. ఈ సినిమా రవితేజ పోలీస్‌ కథాచిత్రాల్లోనే కొత్తకోణంలో సాగుతుంది. విధినిర్వహణలో కార్తికేయ అత్యంతాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని కొత్త తీరులో చూపించాం.>ఈ కథ వక్కంతం వంశీది. నల్లమలుపు బుజ్జి ఈ కథ గురించి చెప్పి డైరెక్ట్‌ చేయమన్నారు. ఆ కథని ప్రేమ, కుటుంబపరమైన భావోద్వేగాలను మిళితంచేసి నా ఆలోచనలకి తగ్గట్టు మలిచి చిత్రించాం. ఇటీవల విడుదలైన పాటకి మంచి స్పందన లభిస్తోంది. ఇది దర్శకుడిగా నా తొలి చిత్రం. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ తర్వాత సినిమాలపై ఆసక్తితో వీవీ వినాయక్‌ వద్ద చేరా. ఆయన ‘ఠాగూర్‌’, ‘సాంబ’, ‘బన్ని’ చిత్రాలకి పనిచేశా. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘రేసుగుర్రం’ మరికొన్ని చిత్రాలకి స్క్రీన్‌ప్లే రచయితగా చేశా. ఈ సినిమా విజయమే నా భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది.