గాయత్రీ సినిమా రివ్యూ

సినిమిర్చి రేటింగ్ 3/5
సినిమా కథ:
దాసరి శివాజీ(మోహన్ బాబు) రంగస్థల నటుడు. తన వాళ్లందరినీ కోల్పోయిన శివాజీ.. ఓ అనాధాశ్రమాన్ని నడిపిస్తుంటాడు. ఆశ్రమాన్ని నడిపించడానికి కావాల్సిన డబ్బుని సంపాదించడం కోసం వ్యాపారస్తులకు, రాజకీయనాయకులకు కోర్టులో పడే శిక్షలను వారి మారువేషంలో వెళ్లి శివాజీ అనుభవిస్తుంటాడు. తద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో గాయత్రి పటేల్(మోహన్‌బాబు) అనే నేరస్థుడి స్థానంలో జైలుకి వెళ్తాడు శివాజీ. అతడికి ఉరిశిక్ష పడిందని తెలియక జైలుకి వెళ్లిన శివాజీ అనుకోకుండా ఇరుక్కుపోతాడు. మరి ఈ కేసు నుండి శివాజీ ఎలా తప్పించుకున్నాడు..? అసలు గాయత్రి పటేల్ ఎవరు..? అతడికి ఉరిశిక్ష పడడానికి గల కారణాలు ఏంటి..? అనేధీ సినిమా కథ .

సినిమా విశ్లేషణ:
దర్శకుడు మదన్ ఓ కొత్త కథను ఎంపిక చేసుకున్నాడు. తండ్రీకూతుళ్ల నేపథ్యంలో సాగే ఈ కథలో కాస్త సెంటిమెంట్ ఎక్కువైందని అనిపిస్తుంది. అయితే కమర్షియల్ అంశాలు ఉండడంతో ప్రేక్షకులకు వినోదానికి లోటుండదు. కథ పరంగా తీసుకున్న జాగ్రత్తలు దర్శకుడు కథనం విషయంలో కూడా తీసుకొని ఉంటే బాగుండేది. సినిమా మొదటి భాగం మొత్తం సాదాసీదాగా నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భావోద్వేగాలతో కూడుకున్నది. ప్రీక్లైమాక్స్ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి. కొన్ని పొలిటికల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

గాయత్రి పటేల్ అనే పాత్ర కథలోకి ప్రవేశించిన దగ్గర నుంచి సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయి. మోహన్‌బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. శివాజీ పాత్ర సాధారణంగానే ఉన్నా.. గాయత్రి పటేల్ పాత్ర మాత్రం సినిమాకు ప్లస్ అయింది. ఆ పాత్రలో మోహన్ బాబు జీవించేసారు.

యంగ్ మోహన్‌బాబు పాత్రలో విష్ణు కనిపించడం అభిమానులకు నచ్చుతుంది. శ్రియ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంది. అనసూయ జర్నలిస్ట్ పాత్రలో మెప్పించింది. నిఖిలా విమల్ బాగా నటించింది. అలీతో చేయించిన కామెడీ బాగుంది .

సినిమాక ప్లస్ పాయింట్ :

గ్రాఫిక్స్ వర్క్.
‘ఒక నువ్వు ఒక నేను’ పాట
ఫస్ట్ హాఫ్

సినిమా మైనస్ పాయింట్స్:
స్క్రీన్ప్లే

చివరి మాట :

సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో లాజిక్స్ లేని సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే పరంగా కొన్ని తప్పులు దొర్లినప్పటికీ సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్‌గా ఉండటంతో ఆడియన్స్ వాటిని పెద్దగా పట్టించుకోరు. కుటుంబంతో పాటు చూడగలిగే చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘గాయత్రి’ .