ఇది నా లవ్ స్టోరీ మూవీ రివ్యూ

హీరో వ్యక్తిగతంగా సినిమాను తరుణ్ బాగా ప్రమోట్ చేశాడు. రమేష్ గోపి ఈ చిత్రానికి దర్శకులు… మరి ఈ సినిమా తరుణ్ కు కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందా లేదా అన్నది చూద్దాం.

సినిమా కథేంటంటే :

యాడ్ ఫిలిమ్స్ డైరెక్టర్ గా పనిచేస్తుంటాడు అభి (తరుణ్). ఓసారి షూటింగ్ కోసం అరకు వెళ్తాడు. చెల్లెలు చేసుకోబోయే వ్యక్తిని కలిసేందుకు దాంతో పాటు శృతి అనే అమ్మాయిని కలిసేందుకు వెళ్తాడు. అక్కడ శృతి అనుకొని అభి (ఓవియా)ని కలుస్తాడు. ప్రేమిస్తాడు. కానీ తాను శృతి కాదని తెలుసుకుంటాడు. అసలుతానేవెరో చెబుతుంది. నిజం తెలిసిన తర్వాత పరిచయం మెల్లగా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ఒకరి ప్రేమను మరొకరు అంగీకరిస్తారు. కానీ ఇంతలోనే అనుకోని ట్విస్ట్ వస్తుంది. అభి, అభిరామ్ (తరుణ్) మీద రేప్ కేసు పెడుుతంది. ఇంతకూ అభి నిజంగానే రేప్ చేశాడా. వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు వచ్చాయి. అన్నది తెరమీదే చూడాలి.

సినిమా సమీక్ష :

సినిమాకి ప్రధాన బలం లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న తరుణ్. తన పెర్ ఫార్మెన్స్ విషయంలో వేలు పెట్టలేం. సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. చాలా రకాల వేరియేషన్స్ ని బాగా చూపించాడు. ఓసారి గడ్డం లేకుండా మరోసారి గడ్డంతో రగ్ డ్ లుక్ తో కనిపించాడు. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. హీరోయిన్ ఓవియా సైతం తన పాత్రకు న్యాయం చేసింది. సినిమా అంతా వీరిద్దరి మీదే నడుస్తుంది. వేరే క్యారక్టర్లు చాలా చాలా తక్కువ. సో కథనంతా ఇద్దరూ కలిసి మోశారు. వారిద్దరి మధ్యన నడిచే రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. దర్శకుడు తాను అనుకున్న కథకు పూర్తి న్యాయం చేసినట్టే అనిపిస్తుంది. ప్రేమ కథలు ఎన్నో వచ్చినా.. చెప్పే విధనంలో చాలా తేడాలుంటాయి. ప్రేక్షకుల హృదయాల్ని తాకేలా కథను రాసుకున్నాడు. రకరకాల వేరియేషన్స్ కథలో వస్తుంటాయి. సబ్ లవ్ స్టోరీస్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. కథకు తగ్గట్టుగా లొకేషన్స్ కూడా ఎంచుకోవడంతో ప్లెజెంట్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురిచేస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో డైలాగ్స్ పెద్ద పీట వేశాయి. ప్రతీ సీన్ లో దర్శకుడు పంచ్ డైలాగ్స్ వేశాడు. దర్శకుడు రమేష్ గోపి స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చూపించాడు. హీరోగా తరుణ్ సినిమాను నిలబెట్టాడు. మధ్యలో వచ్చే పాటలు రిఫ్రెషిగ్ గా ఉంటాయి. దర్శకుడు రమేష్ గోపి తీసుకున్నది రొటీన్ స్టోరీనే అయినా కొత్తగా, ఆసక్తికరంగా అనిపించే స్క్రీన్ ప్లే, అర్థవంతమైన సన్నివేశాలను, చక్కనైన సంభాషణలను రాసుకుని తరుణ్ నటనను సక్రమంగా వినిపియోగించుకున్నాడు. శంకర్ స్మూత్ ఎడిటింగ్ బాగుంది. శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. క్రిస్టోఫర్ జోసెఫ్ మంచి విజువల్స్ లో కలర్ ఫుల్ గా చూపించాడు. నిర్మాతలు కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టి నిర్మాణాత్మక విలువల్ని పాటించారు.

ప్లస్ పాయింట్స్ :

తరుణ్ నటన
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

కామెడీ లేకపోవటం

సినిమా అంత 2 క్యారెక్టర్

బోరింగ్ సన్నివేశాలు కొన్ని

చివరిగా మాట : లవ్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చే సినిమా

సినిమిర్చి రేటింగ్ : 3/5