రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సోడ గోలీసోడ’

ఎస్.బి క్రియేషన్స్ పతాకంపై చక్రసీద్ సమర్పించు చిత్రం ‘సోడా గోలీ సోడా’. మొత్తం గ్యాస్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న చిత్రానికి నిర్మాత భువనగిరి సత్య సింధూజ, దర్శకుడు మల్లూరి హరిబాబు. మానస్,

సినిమా కథ: శీను అలియాస్ దొంగ శీను(మానస్) తన తోటి స్నేహితులతో కలిసి సొంతూర్లో చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ సారి అదే గ్రామానికి చెందిన ప్రెసిడెంట్ కూతురు రూప(నిత్య నరేష్) బ్యాగును కొట్టేసి.. తన మిత్రుడు(షకలక శంకర్)కి ఇస్తాడు. అయితే అందులో రూపా రాయబోయే పరీక్షల హాల్ టికెట్ వుంటుంది. హాల్ టిక్కెట్ లేకపోతే పరీక్ష రాయలేనని బాధపడుతుండటంతో ఆమెకు హాల్ టిక్కెట్టును పరీక్ష టైంకి తెచ్చిస్తాడు. దాంతో రూప.. శీను ఇష్టపడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలకు కూడా చెబుతారు. అందుకు పెద్దల అంగీకరిస్తారు. అయితే… తాను చేసుకోబోయే భర్త దొంగగా ముద్రవేసుకోవడానికి వీలు లేదని.. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలని శీనుకు చెబుతుంది రూప. అందుకోసం శీను ఏమి చేశాడు? తన ప్రియురాలి కోసం తన మీద వున్న దొంగ అనే ముద్రను చెరిపేసుకున్నాడా? అందుకోసం అతను ఏమి చేశాడు? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే మిగతా కథ.

సినిమా విశ్లేషణ: కొన్ని సినిమాలకు టైటిల్స్ గమ్మత్తుగా వుంటాయి. టైటిల్ ను బట్టి.. సినిమాను ఊహించడం కష్టమే. సోడ గోలీసోడ కూడా అలాంటిదే. సినిమా ప్రారంభలో దర్శకుడు ఒక విషయం చెబుతాడు.. చినుకు ముత్యపు చిప్పలో పడితే.. ముత్యంలాగా కనిపిస్తుందని, మంచినీటి సరస్సులో పడితే మంచినీటిగా మారుతుందని, అదే చినుకు బురద నీటిలో పడితే బురదనీరుగా మారుతుందని హీరో క్యారెక్టర్ గురించి టైటిల్స్ లోనే చెప్పేస్తాడు. తన చుట్టూ వున్న చిల్లర గ్యాంగ్ జతపట్టి.. హీరో దొంగగా మారాడు కానీ.. అతను కూడా మంచి తెలివి తేటలతో నలుగురూ మెచ్చే మంచి వ్యక్తి అని చూపించడమే ఈ చిత్రం వుద్దేశం అని ముందే తెలిసిపోతుంది. అయితే అందుకోసం దర్శకుడు రాసుకున్న కథ, కథనాలు చాలా ఎంటర్టైనింగ్ గా వున్నాయి. ఫస్ట్ హాఫ్ లో తను సినిమాల్లో హీరోగా గుర్తింపు పొందడానికి అతను వేసే ఎత్తుగడలు, పాట్లు చాలా బాగా నవ్విస్తాయి. అందుకు హైపర్ ఆది, కృష్ణ భగవాన్, దువ్వాసి మోహన్, గౌతంరాజు, చమ్మక్ చంద్రలాంటి హాస్య నటులు తోడు కావడంతో ఫస్ట్ హాప్ త్వరగానే కంప్లీట్ అవుతుంది. ఇక ద్వితీయార్థంలో మానస్, నిత్య నరేష్ ల మధ్య గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ప్రేమకథ కూడా చాలా కూల్ గా సాగిపోతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే బ్రహ్మానందం ఎపిసోడ్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో కూడా యూత్ కు మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నించడం బాగుంది. యూత్ అనుకుంటే సాధించలేనిది లేదు అనే కోణంలో దర్శకుడు క్లైమాక్స్ ను రాసుకోవడం బాగుంది. ఓవరాల్ గా సోడ.. గోలీసోడ అనేది రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.
మానస్ ఫస్ట్ హాఫ్ కి, సెకెండాఫ్ కి మంచి వేరియేషన్ చూపించాడు. హీరో వేషాలకోసం తాను పడే పాట్లు.. సెకెండాఫ్ లో తన ప్రేమను దక్కించుకోవడం కోసం పడే తపన అన్నీ బాగున్నాయి. హీరోయిన్లుగా నటించిన కారుణ్య, నిత్య నరేష్ కూడా చాలా క్యూట్ గా వున్నారు. ఫస్ట్ హాఫ్ లో కారుణ్య అలరిస్తే.. సెకెండాఫ్ లో నిత్య నరేష్ గ్రామీణ అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది. అలానే ఫస్ట్ హాఫ్ లో హైపర్ ఆది పంచులు బాగున్నాయి. చమ్మక్ చంద్ర పళ్లీలు అమ్మే వాడిగా నటించి కాసేపైనా నవ్వించాడు. చాలా కాలం తరువాత కృష్ణ భగవాన్ ఇందులోకనిపించి మెప్పించాడు. అతనిక తోడు ఆలీ, గౌతమ్ రాజు, దువ్వాసి మోహన్ లు తోడు కావడంతో నవ్వులే నవ్వులు. ఇక ద్వితీయార్థంలో వచ్చే షకలక శంకర్, బ్రహ్మానందం, ఫిష్ వెంకట్, గబ్బర్ సింగ్ బ్యాచ్ అంతా తమకు ఇచ్చిన పాత్రలతో నవ్వించడానికి ట్రై చేశారు.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్షన్
కామెడీ
డైలాగ్స్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ అక్కడ అక్కడ బోర్

చివరిగా : ఈ చిత్రానికి అన్నీ తానైన దర్శకుడు మల్లూరి హరిబాబు మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. ఫస్ట్ హాఫ్ ను ఎంటర్టైనింగ్ గా నడిపించేసి.. ద్వితీయార్థంలో రొమాంటిక్ లవ్ స్టోరీపై దృష్టి సారించాడు. దాంతో రెండు భాగాలు చాలా ఎంటర్టైనింగ్ గా వుంటాయి. అయితే ఈ చిత్రానికి సంగీతం మైనస్. పాటలేవీ పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుండాల్సింది. నిర్మాత భువనగిరి సత్య సింధూజ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

చివరి మాట : ఈ వారం సోడ.. గోలీసోడతో ఎంజాయ్ చేసేయొచ్చు. గో అండ్ వాచ్ ఇట్!

సినిమిర్చి.కామ్ రేటింగ్: 3.25/5