హైదరాబాద్ లవ్ స్టోరీ మూవీ రివ్యూ

రాహుల్ రవీంద్రన్ , రేష్మీ మీనన్ మరియు జియ హీరో హీరోయిన్లు గా రాజ్ సత్య దర్శకత్వం లో ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ సంయుక్తం గా ‘సినిమా పీపుల్’ పతాకం పై నిర్మిస్తున్న సినిమా “హైదరాబాద్ లవ్ స్టొరీ” ఏ రోజు రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది.

సినిమా కథ

భాగ్యలక్ష్మి (రేష్మీ మీనన్) తొలి చూపులోనే కార్తీక్ (రాహుల్ రవిచంద్రన్) ని చూసి ప్రేమలో పడుతుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ ఉంటారు. అంతా బాగానే నడుస్తోంది అనుకున్న టైంలో కార్తీక్ యొక్క పాత గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ అతని జీవితం లోకి వచ్చి కార్తీక్ నీ భాగ్య లక్ష్మి నీ విడదీస్తుంది. ఆమె చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకున్న భాగ్య లక్ష్మి గుండె పగిలి కార్తిక్ కి దూరమై పోతుంది. ఇంతకీ ఆమె చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటి , వైష్ణవి (అతని మాజీ ప్రేయసి) కీ కార్తీక్ కీ మధ్య లవ్ స్టోరీ ఎందుకు బ్రేక్ అయ్యింది .. ఫ్లాష్ బ్యాక్ లో వారిద్దరూ ఎలా ఉండేవారు .. ఇవన్నీ తెరమీద చూడాల్సిందే .

సమీక్ష : హైదరాబాద్ లవ్ స్టోరీ అనే టైటిల్ కి తగ్గట్టుగా సినిమా అంతా రిఫ్రెషింగ్ గా సాగుతుంది. రాహుల్ రవీంద్రన్ చాలా చక్కటి పాత్ర చేసాడు. అతని పాత్రలో అనేక షేడ్స్ ఉన్నా కూడా అన్నింటినీ మంచిగా డీల్ చేసాడు రాహుల్. హిందూ గా ముస్లిం గా రెండు రకాలుగా గెటప్ లలో కనిపించే రాహుల్ ఆసక్తి నీ, ఆలోచన నీ రేకెత్తించే రీతి లో నటించాడు. చాలా కాలం తరవాత అతనికి తగ్గట్టుగా మంచి రోల్ వచ్చింది అని చెప్పచ్చు. అతను ఫైట్ లలో ఇంత బాగా చెయ్యగలడా అనిపించేలా రాహుల్ అదరగొట్టాడు. ఈ సినిమాకి హీరోయిన్ ల కంటే అందంగా కనిపించాడు రాహుల్. రశ్మీ మీనన్ అందాలు , లోకేషన్స్ అన్నీ హై బడ్జెట్ సినిమాలాగానే ఉన్నాయి. ఒక మంచి లవ్ స్టోరీ తో సందేశం ఇస్తూ మానవీయ విలువల కి పట్టం కట్టాడు డైరెక్టర్ రాజ్ సత్య. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు చాలా బాగా క్యారీ అయ్యాయి. ఫామిలీ ఎమోషన్ లు అందరూ బాగా పండించారు.

ప్లస్ పాయింట్స్ :
దర్శకత్వం
నిర్మాణ విలువలు
ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ కొంచం లాగ్స్ సన్నివేశాలు
ఎడిటింగ్

తెలుగు సినిమాలో లవ్ స్టోరీలు సర్వసాధారణం కానీ ఈ లవ్ స్టోరీ కి ఓ ప్రత్యేకత ఉంది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ అందాలతో రొమాంటిక్ సన్నివేశాలతో స్నేహానికి ప్రేమకి మంచి అర్ధం చెప్పే సినిమా ఈ హైదరాబాద్ లవ్ స్టొరీ. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ అందాలతో మంచి ఫీల్ గుడ్ సన్నివేశాలతో ప్రేమ కి స్నేహానికి మంచి అర్ధం చెప్పే సినిమా. యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ తప్పక చూడదగ్గ చిత్రం హైదరాబాద్ లవ్ స్టొరీ.

చివరి మాట : మనసుని హత్తుకునే సీన్ లూ , ఎమోషన్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఫ్రెండ్స్ ఫ్యామిలీ తో చక్కగా ఈ వారాంతం చూడదగ్గ సినిమా.

సినిమిర్చి రేటింగ్ :3.25./5