అనగనగా ఒక ఊళ్ళో మూవీ రివ్యూ

సినిమిర్చి.కామ్ రేటింగ్ 3/5

అనగనగా ఒక ఊళ్ళో పల్లెటూరికి వినోద యాత్ర అనే కాప్షన్ తో ఈ నెల మార్చ్ 23న విడుదలైయింది . అశోక్ కుమార్, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లు గా కె వి సాయి కృష్ణ దర్శకత్వం లో కె చంద్ర రావు నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి ఆనందాలతో , రొమాంటిక్ సన్నివేశాలతో, యాక్షన్ ఫైట్స్ తో ప్రేక్షకులని అలరిస్తుంది. ఎస్ ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన సాయి కృష్ణ ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

సుమన్, బనెర్జీ, పృథ్వి, కృష్ణుడు, పార్వతి, మహేష్ వర్మ, కాల్వలత, రమాదేవి ముఖ్య పాత్రలు పోషించారు.

సినిమా సమీక్ష : ఇది ఒక్క ప్రేమ కథ చిత్రం, అద్భుతమైన పల్లెటూరి అందాలతో దర్శకుడు మంచి ప్రేమకథను ప్రేక్షకులకు అందించాడు. మంచి కామెడీ సన్నివేశాలు, రెండో వర్గాల మధ్య గొడవలు , ఈ చిత్రం ఓ మంచి కుటుంబ కథ చిత్రం గా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను అలరిస్తుంది.

విశ్లేషణ : నటీనటులైన అశోక్ కుమార్, ప్రియాంక శర్మ మంచి నటనతో అందరిని అలరిస్తారు. సీనియర్ నటులు సుమన్, బనెర్జీ , పృథ్వి చేసిన పాత్ర అద్భుతంగా ఉంది.

యాజమాన్య అందించిన సంగీతం ఈ చిత్రానికి ఒక హైలైట్. పాటలను చాల బాగా చిత్రీకరించారు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ఊపిరి పోసాయి . దేవరాజ్ అందించిన యాక్షన్ ఫైట్లు ఈ చిత్రానికి మరో హైలైట్. ఈ ఫైట్లు మాస్ ప్రేక్షకులని అలరిస్తుంది. పల్లెటూరి వాతావరణం మరియు లొకేషన్స్ అని సహజంగా ఉన్నాయ్. నిర్మాత కె చంద్రరావు ఖర్చుకి వెనుకడకుండా ఈ చిత్రానికి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్ :

సినిమా ఎడిటింగ్
ఫైట్స్
క్లైమాక్స్
కుటుంబ కథా సన్నీవేశాలు
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్
అంత గా కామెడీ లేకపోవటం

 

చివరి మాట : అనగనగా ఒక ఊళ్ళో, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తుంది. తప్పక చూడండి . తెలుగు ప్రేక్షకులందరూ కుటుంబ సమేతంగా సినిమా చుడ దగ్గ చిత్రం