సత్య గ్యాంగ్ మూవీ రివ్యూ

సినిమిర్చి.కామ్ రేటింగ్ 3/5

సాత్విక్‌ ఈశ్వర్‌ను హీరోగా పరిచయం చేస్తూ సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు మహేశ్‌ ఖన్నా నిర్మించిన చిత్రం సత్య గ్యాంగ్‌. ఈ చిత్రానికి ప్రభాస్‌ దర్శకత్వంతోపాటు సంగీతం అందించగా, మహేశ్‌ఖన్నా దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ మధ్య కాలంలో సత్య గ్యాంగ్ గురించి బాగా బజ్ క్రియేట్ అయ్యింది. కారణం చిత్రంలోని పాటలు, ట్రైలర్. ఇవి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో సత్య గ్యాంగ్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇదే ఊపులో సత్య గ్యాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సత్య గ్యాంగ్ ఎవరో చూద్దాం.

కథేంటంటే…

మహేష్ ఖన్నా (మహేష్ ఖన్నా) మంత్రి పదవిలో ఉండి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఎంతోమంది అనాథల్ని చేరదీసి మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే నగరంలో జరిగే వరుస హత్యలపై చాలా సీరియస్ గా ఉంటాడు. అంతే కాదు చావు బతుకుల్లో ఉన్న రిపోర్టర్ ఎలాగైనా బతకాలనుకుంటాడు. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు సిన్సియర్ పోలీసాఫీసర్ (సుమన్)ను రంగంలోకి దింపుతాడు. అతని ఎంక్వైరీలో కీలకమైన విషయాలు బయటికి వస్తాయి. మరో వైపు ముగ్గురు స్నేహితులు అనాథలు. వీరు మెకానిక్ లుగా పనిచేస్తుంటారు. వీరు ఆ హత్యలకు సంబంధించిన విషయంలో చిక్కుకుంటారు. అసలు ఆ హత్యలకు వీరికి సంబంధం ఏంటి. మెకానిక్ లుగా ఉన్న వీరు ఆ చిక్కుల్లోంచి బయటికి ఎలా వచ్చారు. అనాథాలకు మంత్రి ఎలాంటి సేవలు చేస్తుంటారు. కమిషనర్ జర్నలిస్ట్ పై జరిగిన ఎటాక్ ను ఎలా ఛేందించాడు. వరుస హత్యల్ని ఎలా ఆపాడన్నది అసలు కథ.

సమీక్ష

అనాథ పిల్లల్ని బేస్ చేసుకొని రాసుకున్న కథ ఇది. డైరెక్ఠర్ విజన్ కొత్తగా ఉంటుంది. నిర్మాత మహేష్ ఖన్నా కొత్త పాయింట్ ను తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి. అనాథ పిల్లల తల్లితండ్రుల్ని గుర్తించాలంటే డిఎన్ ఏ టెస్టులు చేయించాలనే కొత్త పాయింట్ ను లేవనెత్తారు. కమర్షియల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా సినిమా తీశారు. క్రైమ్స్ చుట్టూ తిరిగే కథను చాలా బాగా చెప్పారు. దానికి అనాథ పిల్లల పరిస్థితిని… తల్లి తండ్రులు లేకపోతే ఎన్ని కష్టాలుంటాయో బాగా ఎస్టాబ్లిష్ చూశారు. ముఖ్యంగా ఓ పాటలో అనాథ పిల్లల స్థితిగతుల్ని చెప్పిని విధానం కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మరో వైపు హీరో సాత్విక్ చాలా బాగా చేశాడు. మంచి ఫ్యూచర్ ఉంది. మొదటి సినిమాలా ఆనిపించదు. హీరో స్నిహితులంతా చాలా బాగా నటించారు. ముఖ్యంగా నిర్మాత మహేష్ ఖన్నా కీలక పాత్రలో నటించి మెప్పించారు. మంత్రి గానే కాకుండా షాక్ ఇచ్చే క్యారెక్టర్ చేశారు. ఐటమ్ సాంగ్ లో డ్యాన్స్ కూడా ఇరగదీశారు. సుమన్ పాత్ర చాలా కీలకం. ఇది ఆయన చెప్పుకునే పాత్ర. షఫికి ఇంపార్టెంట్ రోల్ దక్కింది. హీరోయిన్స్ కి మంచి పేరొస్తుంది. అందం అభినయంతో మెప్పించారు.

గ్యాంగ్‌ వార్స్‌ ని బాగా చూపించారు. లవ్‌ ట్రాక్‌ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. భవిష్యత్తులో అనాధలు ఉండకూడదు అనే విషయాన్ని హైలైట్ చేశారు. ఈ చిత్రానికి కథ, మాటలు నిర్మాత మహేష్ ఖన్నానే రాయడం విశేషం. అలాగే దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసి సక్సెస్ అయ్యారు. తల్లీ, తండ్రి లేని పిల్లలకు ఆ లోటు వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనే కాన్సెప్ట్ ని సినిమాటిక్ గా బాగా చెప్పారు. చిపర్లో సుహాసని గెస్ట్ రోల్ ప్లే చేసిన సీన్స్ అలోచింపచేసే విధంగా ఉంటాయి. ఈ సినిమాకి కథే మెయిన్‌ హీరో. పాటలు, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ హైలైట్ గా ఉంటాయి. హీరో సాత్విక్ డ్యాన్సులు కూడా బాగా చేశాడు.

ఓవరాల్ గా ఓ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం సత్య గ్యాంగ్. మాస్ టైటిల్ పెట్టినప్పటికీ అన్ని రకాల ఎలిమెంట్స్ ని టక్ చేశారు. కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా తీసినప్పటికీ.. ఆలోచింపజేసే విధంగా చిత్రీకరించారు. లవ్, కామెడీ, ఎమోషన్, మెసేజ్ తో తెరకెక్కిన సత్య గ్యాంగ్ చూసి ఎంజాయ్ చేయ్యెచ్చు.