జాతి రత్నం బాబా సాహెబ్ అంబెడ్కర్’ డాక్యుమెంటరీ ఆవిష్కరణ

భారత రత్న డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ 127 వ జయంతిని పురస్కరించుకుని ఇంటర్నేషనల్ దాసన్న ఫౌండేషన్ వారు హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఒక సభలో ‘జాతి రత్నం బాబా సాహెబ్ అంబెడ్కర్’ డాక్యుమెంటరీని ఆవిష్కరించి ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీని దాసన్న ఫౌండేషన్, ఇంటర్నేషనల్ భీంసేన వారు నిర్మించారు. డైరెక్టర్ మొహమ్మద్ షరీఫ్ ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చెయ్యగా… కథని వీరేంద్ర కాపర్తి అందించారు. అలాగే ABK  రాజు సంగీతమందించగా.. శ్రీకాంత్, మోహిని గీతాలాపన చేశారు.
‘జాతి రత్నం బాబా సాహెబ్ అంబెడ్కర్’ డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ దాసన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్ దాసన్న, కార్యదర్శి ప్రొఫెసర్ వ్. ప్రకాష్, దర్శకులు మొహమ్మద్ షరీఫ్, రచయితా వీరేంద్ర కాపర్తి, సంగీత దర్శకుడు ార్క్ రాజు తదితరులు హాజరయ్యారు.
ఈ డాక్యుమెంటరీ ని చూసిన తర్వాత నిర్మాత దాసన్న మాట్లాడుతూ… ఈ డాక్యుమెంటరీ అందరిని ఆకట్టుకుంటుందని… అంబెడ్కర్ దళిత జన సముద్ధరణకు అందించిన సేవలను కొనియాడారు. అలాగే మానవ హక్కుల కోసం అంబెడ్కర్ అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పిన ఆయన ఈ డాక్యమెంటరీ ఈ జాతికి, భవిష్యత్ భారతీయ సమాజానికి అంబేత్కర్ అందిస్తున్న సందేశం అందరికి అందించామని అన్నారు. ఇక ఈ డాక్యుమెంటరీని అందరికి  అర్దమయ్యేలా తెరకెక్కించిన మొహమ్మద్ షరీఫ్ ని దాసన్న ప్రశంసించారు.
ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరణలో పాల్గొన్న పలువురు దాసన్న ఫౌండేషన్ ని డాక్యుమెంటరీ డైరెక్ట్ చేసిన మహమ్మద్ షరీఫ్ ని కొనియాడారు.