నాక‌థ‌లో నేను

నాక‌థ‌లో నేను` మూవీ రివ్యూ
రిలీజ్‌ తేదీ : 27-04-18
రేటింగ్ : 3 /5

న‌టీన‌టులు: సాంబ శివ‌, సంతోషి వ‌ర్మ‌, సుహాష్‌, అప్ప‌ల‌రాజు, భాను
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం-నిర్మాత‌: శివ‌ప్ర‌సాద్ గ్రందె
సంగీతం: న‌వ‌నీత్‌
కెమెరా: ల‌క్కీ ఎక్క‌రి
ఎడిటింగ్‌: గ‌ణేష్ కొమ్మార‌పు

 

కథ :
స్వ‌త‌హాగా మంచి వాడైన హీరో త‌న‌కు లైఫ్‌లో ఎదురైన ఛాలెంజ్‌లో చివ‌రికి ఏం చేశాడు? ఎంతో మంచిది, స‌హ‌కారి అనుకున్న భార్య వ‌ల్ల హీరో ఎలాంటి ప‌రిస్థితి ఎదుర్కోవాల్సి వ‌చ్చింది? అస‌లు ఈ క‌థ‌లో ట్విస్టేంటి? అన్న‌ది తెర‌పైనే చూడాలి. సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆద్యంతం `డ‌బ్బు-కుట్ర‌- మిస్ట‌రీ` అనే పాయింట్ చుట్టూ కీల‌కంగా ర‌న్ అవుతుంది.

క‌థా కథనం :
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సంజ‌య్ (సాంబ‌), కిషోర్ (భాను), రాహుల్ (సుహాస్‌), అభి వీళ్లంతా ఒక గ్యాంగ్‌. ఆఫీస్‌లో ర‌క‌ర‌కాల టాస్క్‌లు హ్యాండిల్ చేసే వీళ్ల‌కు అనుకోకుండా ఓ స‌వాల్ ఎదుర‌వుతుంది. కొలీగ్ చేసిన కుట్ర‌తో బాస్‌కి సబ్‌మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ వ‌ర్క్ డిలీట్ అవుతుంది. దాంతో అనుకున్న స‌మ‌యానికి ప్రాజెక్ట్‌ ఇవ్వ‌లేని స‌న్నివేశం ఎదుర‌వుతుంది. ఆ క్ర‌మంలోనే అమాయ‌కురాలు అనుకున్న ప్రియ (సంతోషి శ‌ర్మ‌) ఆ స‌మ‌స్య‌ను సాల్వ్ చేసి, ప్రాజెక్ట్ ఇన్‌టైమ్‌లో సబ్‌మిట్ చేసేందుకు భ‌ర్త సంజ‌య్‌కి సాయ‌ప‌డుతుంది. ఓ సంద‌ర్భంలో చావుమీదికి వ‌చ్చిన సంజ‌య్ స్కూల్‌ మాష్టార్‌ని 5ల‌క్ష‌లు సాయం చేసి బ‌తికిస్తుంది. వేరొక సంద‌ర్భంలో యాక్సిడెంట్‌కి గురై తీవ్ర గాయాల‌తో వ‌చ్చిన భ‌ర్త‌కు ప‌రిచ‌ర్య‌లు చేస్తుంది. ఈ క‌థ ఇలా ర‌న్ అవుతుండ‌గానే సంజ‌య్ ఊహించ‌ని ఓ పెద్ద చిక్కుల్లో ప‌డ‌తాడు. ఆఫీస్ హెచ్ఆర్ త‌న‌ని న‌మ్మి ఇచ్చిన కోటి రూపాయ‌లు పోగొట్టుకోవాల్సొస్తుంది. తాను ఎంత‌గానో ప్రేమించే భార్య ప్రియ‌ను కిడ్నాప్ చేసి దుండ‌గులు బెదిరించ‌డంతో ఆ డ‌బ్బును ఇచ్చేస్తాడు సంజ‌య్‌. ఆ క్ర‌మంలోనే పోగొట్టుకున్న డ‌బ్బును వెతుక్కుంటూ వెళ్లిన అత‌డికి చివ‌రికి ఎలాంటి షాకింగ్ నిజం తెలిసింది? ఈ క‌థ‌లో భార్య ప్రియ‌ పాత్ర ఏంటి? అస‌లు ఆ డ‌బ్బు కొట్టేసింది ఎవ‌రు? అన్న‌ది స‌స్పెన్స్‌. 8 కోట్ల ఇన్స్యూరెన్స్ డ‌బ్బు కోసం హీరో స్నేహితుడితో క‌లిసి ఎవ‌రు ఎలాంటి నాట‌కం ఆడారు అన్న‌ది తెర‌పైనే చూడాలి.

 

ప్ల‌స్ పాయింట్స్ :

మ్యూజిక్
డైరెక్షన్
హీరో
హీరోయిన్
చివరి 20 నిమిషాలు

 

మైనస్ పాయింట్స్ :

ఎడిటింగ్
కామెడీ లేకపోవటం
అందరూ కొత్తవారు అవటం

సాంకేతిక విభాగం :
సినిమా క‌థ‌నం స్లో అయినా రీరికార్డింగ్ తో న‌డిపించిన తీరు ప్ల‌స్. ఫారిన్ లొకేష‌న్లు, రిచ్ సాంగ్స్‌ లేక‌పోయినా అర్థ‌వంత‌మైన పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నం ప‌రిమిత బడ్జెట్లో ఓకే అనిపిస్తుంది.

ముగింపు: అంతా కొత్త వాళ్ల‌తో ఫ‌ర్వాలేద‌నిపించే ఎంట‌ర్‌టైన‌ర్‌…

సిని మిర్చి.కామ్ రేటింగ్‌: 3 / 5