చెన్నై చిన్నోడు మూవీ రివ్యూ

జి.వి ప్రకాష్‌ కుమార్ హీరోగా న‌టిస్తూ సంగీతాన్ని స‌మ‌కూర్చిన కడవల్ ఇరుక్కాన్ కుమారు అనే త‌మిళ చిత్రాన్ని `చెన్నై చిన్నోడు` (వీడి ల‌వ్‌లో అన్నీ చిక్కులే ట్యాగ్‌లైన్‌) పేరుతో శూలిని దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెలుగులోకి అనువ‌దించారు వి.జ‌యంత్ కుమార్‌. ఇందులో నిక్కీ గల్రానీ, ర‌క్షిత హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రానికి ఎం.రాజేష్ ద‌ర్శ‌కుడు. ట్రైలర్స్ తో మంచి బజ్ సంపాదించుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే:

సరదాగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు కుమార్ (జివి.ప్రకాష్). ప్రియ (నిక్కీ గల్రాని) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. కానీ అదే సమయంలో తన మాజీ ప్రియురాలు నాన్సీ (ఆనంది) మళ్లీ ఎంటర్ అవుతుంది. ఇతని జీవితంలోకి నాన్సీ ఎలా వచ్చింది. ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు. పోలీస్ ఆఫీసర్ మణిమారన్ (ప్రకాష్ రాజ్ )ఎలా ఇబ్బంది పెట్టాడు. ఆ సమస్యల నుంచి కుమార్ ఎలా బయటపడ్డాడు. చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేదే ఆసక్తికరమైన కథ.

జీవి. ప్రకాష్ నటుడిగా పరిణితి చెందాడు. కుమార్ క్యారెక్టర్లో ఈజీగా మౌల్డ్ అయ్యాడు. డైలాగ్ డెలివరీ చాలా ఈజీగా చేశాడు. తన ఏజ్ గ్రూప్ క్యారెక్టర్ కావడంతో ఆడియెన్స్ కి బాగా కనెక్ట అయ్యాడు. సింపుల్ స్టోరీలో ఎన్నో ట్విస్టులతో సాగుతుంది. ఇద్దరు హీరోయిన్లతో మంచి కెమిస్ట్రీ కుదిరింది. హీరోయిన్ రక్షిత మంచి పెర్ ఫార్మెన్స్ చూపించింది. తనకు మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. నిక్కీ గర్లానీ కీ రోల్ పోషించింది. తనదైన బాడీ లాంగ్వేజ్ తో పాత్రకు న్యాయం చేసింది. ఇక హీరో ఫ్రెండ్ గా బాలాజీది కీలక పాత్ర. ప్రతీ ట్విస్టుకు కారకుడౌతాడు. ప్రకాష్ రాజ్ ని చాలా రోజుల తర్వాత కొత్త తరహా పాత్రలో చూస్తాం. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్, టీవీ స్టూడియోలో ఫన్నీ డిస్కషన్, హీరోయిన్ ఫాదర్ తో హీరో ఇంట్రడక్షన్ సీన్ హైలైట్ గా నిలిచాయి. దర్శకుడు చాలా బాగా ప్లాన్ చేశాడు. రెండో భాగంలోనూ చాలా సీన్స్ లో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. డబ్బింగ్ సినిమా అనిపించకుండా చాలా వరకు మేనేజ్ చేశారు. ట్విస్టులు ఎక్కువగా ఉండడంతో రాబోయే సీన్స్ ని గెస్ చేయలేం. పాటలు కూడా బాగున్నాయి. ఐటమ్ సాంగ్ లో కౌష తన అందచందాలతో అలరించింది. జీవా గెస్ట్ రోల్ లో తళుక్కున మెరిశాడు.

దర్శకుడు ఎం.రాజేష్ తాను అనుకున్న కథకు బాగా న్యాయం చేశాడు. మెయిన్ గా కన్ఫ్యూజన్ కామెడీని బాగా వర్కవుట్ చేయగలిగాడు. వివేక్ హర్షన్ ఎడిటింగ్ పర్వాలేదు. శక్తి శరవణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. జివి.ప్రకాష్ అందించిన సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ఉపయోగపడింది. పూర్ణ‌చారి పాట‌ల‌న్నింటికీ అర్ధ‌వంత‌మైన సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి చెన్నై చిన్నోడులో కామెడీ, లవ్, కన్ఫ్జూజన్ తో ముందుకు వెళ్తుంది. టైంపాస్ చేయాలనుకునే ప్రేక్షకులకు చెన్నై చిన్నోడు మంచి ఆప్షన్. కామిక్ సెన్స్ తో తీసిన సినిమా కావడంతో టైంపాస్ చేయ్యెచ్చు. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చక్కని కామెడీ ఎంటర్‌ టైనర్‌ ఇది.

చివరి మాట : ఈ వారం మంచి సినిమా చూడ దగ్గ చిత్రం

సిని మిర్చి .కామ్ రేటింగ్ 3/5