జూన్ 15న వస్తొన్న”దివ్యమణి” 

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్,  గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం “దివ్య మణి”.  ప్రముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా ,వైశాలి, కిమయా హీరొయిన్స్ గా “దివ్య మణి” చిత్రంలొ నటిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సురేష్ కమల్ మాట్లాడుతూ. నటుడుగా ఇది నా తొలి చిత్రం.  గిరిధర్ గారి కథే ఈ చిత్రానికి హైలెట్. యాక్షన్ అంతా నేను ఓరిజినల్ గా చెశాను.ఈ సినిమా చూసిన ఎందరికొ స్పూర్తిగా నిలుస్తుందన్నారు.
గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ..
దివ్యమణి సొషియో ఫాంటసీ చిత్రం.‌బ్యాంకాక్, పట్టాయా, నొమెన్స్ ఐలాండ్, హైదరబాద్, బెంగళూరు ఇలా చాలా లొకెషన్స్ లో తెరకెక్కించాము. ఈ సినిమాకు మాస్టర్ కమల్ స్టంట్స్ హైలెట్ గా నిలుస్తాయి. రకరకాల ఫైటింగ్ స్టయిల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. సినిమా ఔట్పుట్ ఎక్స్ ట్రార్డినరి గా వచ్చింది. దీనికి మా టీమ్ కారణం. జూన్ 15న సినిమాను విడుదల చెస్తామన్నారు.
ఈ చిత్రానికి మాటలు: బలభద్రపాత్రుని రమణి, సినిమాటోగ్రఫీ: రాజేష్ కాటా, పైట్స్: జైక (థాయ్ లాండ్), రామ్ లక్ష్మణ్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్, కధ- దర్శకత్వం : గిరిధర్ గోపాల్
press note