ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో 90 ఎం.ఎల్. ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో 90 ఎం.ఎల్.
ఇది చాలా తక్కువ చిత్రం రూపుదిద్దుకుందని నిర్మాత పఠాన్ చాంద్ పాషా తెలిపారు. తమిళంలో ఇదేటైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో ఓవియా ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ హీరో శింబు ప్రత్యేక... ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో 90 ఎం.ఎల్.

ఇది చాలా తక్కువ చిత్రం రూపుదిద్దుకుందని నిర్మాత పఠాన్ చాంద్ పాషా తెలిపారు. తమిళంలో ఇదేటైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో ఓవియా ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ హీరో శింబు ప్రత్యేక పాత్రలో నటించడంతో పాటు సంగీతాన్ని అందించారు. అనితా ఉదీప్ దర్శకత్తవం వహించిన ఈ చిత్రాన్ని కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పఠాన్ చాంద్ భాషా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్ ను ఆదివారం ఫిలించాంబర్ లో లాంచ్ చేశారు. దీనికి అతిథులుగా సాయి వెంకట్ తుమ్మల పల్లి రామసత్యనారాయణ విచ్చేసారు. ఈ సందర్భంగా

వారు మాట్లాడుతూ…. తమిళంలో మాదిరిగా తెలుగులో కూడా ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
నిర్మాత చాంద్ భాషా మాట్లాడుతూ… తమిళంలో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింబపడుతోందని చెప్పారు. అక్కడి ప్రేక్షకాదరణను చూసిన తర్వాత తెలుగు హక్కుల కోసం పోటీ అధికమైనప్పటికీ తాము సొంతం చేసుకున్నామని చెప్పారు. కామెడీ డ్రామాగా సాగే చిత్రమని అన్నారు. ఈనెలలోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

చిత్ర నిర్మాణ సారధి కృష్ణ కాకర్ల మూడి మాట్లాడుతూ…. ఐదుగురు అమ్మాయిల జీవితాల్లో ఎదురైన సమస్యల వల్ల వారంతా మద్యపానం ధూమపానానికి అలవాటు పడతారు. ఆ తర్వాత వాళ్ల తప్పు ఎలా తెలుసుకొని బయటపడ్డారన్న కథాంశంతో సాగే చిత్రమిది. ఇందులో ప్రముఖ కథానాయిక ఒవియా తన పాత్రలో చక్కటి అభినయాన్ని కనబరిచింది. ప్రముఖ హీరో శింబు ప్రేత్యేక పాత్రలో ఆకట్టుకుంటారు. ఆలాగే ఆయన అందించిన సంగీతం వీనుల విందుగా ఉంటుంది. తమిళంలో విడుదలైన మూడు వారాల్లో 16 కోట్ల రూపాయల షేర్ ను ఈ చిత్రం వసూలు చేసింది. ప్రస్తుతం ఆరో వారం ప్రదర్శన కొనసాగుతోంది. అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో డా.రంగనాయకులు, శ్రీధర్, వాసుదేవ్, వైజాగ్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఇంకా అస్ సన్ పాల్, మసూమ్ శంకర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణాన్ని అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ ను ఆంథోని అందించారు

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *