పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ” క్రేజీ కేజీ ఫీలింగ్ “ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ” క్రేజీ కేజీ ఫీలింగ్ “
విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ ” . సంజయ్ కార్తీక్ దర్శకుడు . విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు .... పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ” క్రేజీ కేజీ ఫీలింగ్ “

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ ” . సంజయ్ కార్తీక్ దర్శకుడు . విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు . షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది .
ఈ సందర్బంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ .. కేరింత , మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వoత్ హీరోగా , పల్లక్ లల్వాని హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది . ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం . వెన్నెల కిశోర్ పాత్ర ఆకట్టుకుంటుంది .
నిర్మాత మధు మాట్లాడుతూ .. ప్రేమ , ఫీల్ , వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ని రూపొందిస్తున్నారు . ప్రసాద్ లాబ్స్ , రామానాయుడు స్టూడియోల్లో నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . విడుదలయ్యేంత వరకే చిన్న సినిమా , విజయం సాధించి పెద్ద సినిమా అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు .
విష్వoత్ , పల్లక్ లల్వాని ,వెన్నెల కిశోర్ , ఫిదా ఫేమ్ శరణ్య , సుమన్ , పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో , సాహిత్యం సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ , కెమెరా సుభాష్ దొంతి , ఆర్ట్ నాగు , కొరియోగ్రఫీ రాజకిరణ్ , చార్లీ .

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *