‘లవర్స్‌ డే’ మూవీ రివ్యూ ‘లవర్స్‌ డే’ మూవీ రివ్యూ
  టైటిల్ : లవర్స్‌ డే జానర్ : లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తారాగణం : రోషన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, నూరీన్‌ షరీఫ్‌ సంగీతం : షాన్‌ రెహమాన్‌ దర్శకత్వం... ‘లవర్స్‌ డే’ మూవీ రివ్యూ

 

టైటిల్ : లవర్స్‌ డే
జానర్ : లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : రోషన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, నూరీన్‌ షరీఫ్‌
సంగీతం : షాన్‌ రెహమాన్‌
దర్శకత్వం : ఒమర్‌ లులు
నిర్మాత : ఎ.గురురాజ్, సి.హెచ్‌. వినోద్‌ రెడ్డి

కథ :

కాలేజ్.. స్నేహితులు.. ప్రేమ.. కుళ్లు జోకులు.. సింపుల్గా చెప్పాలంటే ఈ మూవీ కథ ఇదే. రోషన్.. ప్రియ.. గాధ.. ల మధ్య జరిగే కథే ఈ చిత్రంలో ప్రత్యేకం. రోషన్.. గాధ స్నేహితులుగా మొదలై ప్రేమికులుగా మారిపోతారు. అయితే వారి ప్రేమను వ్యక్త పరిచాలనుకునే సమయానికి అనుకోని సంఘటన జరుగుతుంది. అనుకోని ఆ సంఘటన ఏంటి.. అసలు ఈ కథ లో వింక్‌ గర్ల్ ప్రియ వారియర్‌ పాత్ర ఏంటి అనేది మిగతా కథ.

నటీనటులు :
కాలేజ్ కుర్రాడిగా రోషన్.. అతని స్నేహితులు బాగానే నటించారు. ముఖ్యంగా రోషన్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచేస్తాడు. ఇక ప్రియ తనకు బాగా పేరు తెచ్చిన.. కన్ను గీటే సీన్.. ముద్దు గన్ను సీన్స్‌తో థియేటర్లో విజిల్స్ కొట్టిస్తుంది. టీజర్, ట్రైలర్లను చూసి ప్రియానే మెయిన్ లీడ్ అనుకుంటే పొరపాటే. గాధ పాత్రలో నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అందం.. అభినయంతోనూ నూరీన్‌ ఆకట్టుకుంది. ఇక హీరో స్నేహితులు, ప్రిన్సిపాల్, లెక్చరర్, ప్యూన్ పాత్రలు నవ్విస్తాయి.

విశ్లేషణ :
ఇలాంటి కథలు మనం ఎప్పుడో చూసేసాం. గతంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, సొంతం లాంటి ఎన్నో సినిమాల్లో ఈ కాన్సెప్టే మనకు కనబడుతుంది. లెక్చరర్లు స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్లు జోకులు.. ప్రేమ.. ఆకర్షణ.. స్నేహితులు.. వీటి చుట్టే తిరిగే ఈ కథ.. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే సినిమా అంతా సరదాగా వెళ్తూ ఉంటే.. మరీ నాసిరకంగా ఉంటుందేమో అనో.. లేక ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక దర్శకుడు విషాదంతో సినిమాను ముగించేశాడు. ప్రేమకు ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుని తను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను చెప్పే సందర్భంలో ఆ పాత్రను ముగించి.. అసలు దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు. ఇక సంగీతం కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *