స్వచ్ఛమైన ప్రేమకథగా వస్తోన్న ‘మసక్కలి’ స్వచ్ఛమైన ప్రేమకథగా వస్తోన్న ‘మసక్కలి’
సమాజాన్ని తన కోణంలో చూసే అమ్మాయి కథగా వస్తోన్న సినిమా మసక్కలి. ఒక అమ్మ కోణంలో అర్జున్ రెడ్డి సినిమాను చూస్తే ఎలా ఉంటుందో మా సినిమా అలా ఉంటుంది. మసక్కలి అంటే... స్వచ్ఛమైన ప్రేమకథగా వస్తోన్న ‘మసక్కలి’

సమాజాన్ని తన కోణంలో చూసే అమ్మాయి కథగా వస్తోన్న సినిమా మసక్కలి. ఒక అమ్మ కోణంలో అర్జున్ రెడ్డి సినిమాను చూస్తే ఎలా ఉంటుందో మా సినిమా అలా ఉంటుంది. మసక్కలి అంటే స్వచ్ఛమైనది అని అర్థం. ఒక అమ్మాయిని, సమాజాన్ని అంత స్వచ్ఛంగా ప్రేమించిన అబ్బాయి ఆ అమ్మాయిల మధ్య సాగే కథ ఇది. కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి.. అలాంటిదే నా ఈ కథ అంటున్నాడు ఈ 13 న విడుదల కానున్న మసక్కలి దర్శకుడు నబి యేనుగుబాల.. మసక్కలి సినిమా గురించి ఆయన మాటల్లోనే చూద్దాం.. ‘‘అంతర్లీనంగా సందేశం ఉన్నా.. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. మంచి కామెడీతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది. కానీ ఏదీ కథను దాటి వెళ్లదు. అబ్బాయి మాత్రమే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అమ్మాయి అతన్ని ప్రేమించదు. ఆ కుర్రాడు సైకాలజీ స్టూడెంట్ గా ఓ డాక్టర్ వద్ద అసిస్టెంట్ గా ఉంటాడు. ఆ డాక్టర్ ఇచ్చిన ఓ కేస్ ను ఛేదించే క్రమంలో అతనికి ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది. ఈ అమ్మాయి ద్వారా తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది కథ. మా నిర్మాతకు సామాజిక బాధ్యత ఎక్కువ. అందుకే అలాంటి కథలే కావాలన్న ఆయన కోరిక మేరకు అన్ని అంశాలున్న ఈ కథ సిద్ధమైంది. అందమైన విజువల్స్ తో పాటు మంచి సంగీతం ఉంటుంది. ఇప్పటికే కొందరికి ఈ సినిమా చూపించాను. వాళ్లంతా హార్ట్ టచింగ్ మూవీగా చెప్పారు. తక్కువ బడ్జెట్ లోనే పెద్ద సినిమా స్థాయిలో క్వాలిటీ ఉంటుంది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. స్టోరీకి అనుగుణమైన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అంటూ ముగించాడు.

డూ గూడ్ ఫాలో రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ‘మసక్కలి’లో.. సాయి రోనక్, శ్రావ్య, శిరీషా వంకా, కాశీ విశ్వనాథ్, నవీన్, రవివర్మ, రామ్ జగన్, దేవదాస్ కనకాల, నరసింహరాజు, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక నిపుణులు.. సంగీతం : మిహిరామ్స్, డి.వో.పి : సుభాష్ దొంతి, ఎడిటర్ : శివ శర్వాణి, పాటలు : అలరాజు, ఆర్ట్స్ : హరివర్మ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ :అరుణ్ చిలువేరు, పిఆర్వో : జి.ఎస్.కే మీడియా, నిర్మాత : సుమిత్ సింగ్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్వకత్వం : నబి యెనుగుబాల(మల్యాల).

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *