సినిమాలైనా సీరియల్లైనా నో.. రేమ్యూనేరేషన్…! సినిమాలైనా సీరియల్లైనా నో.. రేమ్యూనేరేషన్…!
  బిగ్ బాస్ నూతన్ నాయడు ఒకే సారి 14 సినిమాల్లో బుక్ అయ్యాడంట, 3 మెగా సీరియల్స్ చేస్తున్నాడంట. అయ్యబాబోయ్ అన్ని సినిమాలే. ఇక నూతన్ నాయుడు ఏ రేంజ్ లో... సినిమాలైనా సీరియల్లైనా నో.. రేమ్యూనేరేషన్…!

 

బిగ్ బాస్ నూతన్ నాయడు ఒకే సారి 14 సినిమాల్లో బుక్ అయ్యాడంట, 3 మెగా సీరియల్స్ చేస్తున్నాడంట. అయ్యబాబోయ్ అన్ని సినిమాలే. ఇక నూతన్ నాయుడు ఏ రేంజ్ లో సంపాదిస్తున్నాడో అనుకుంటున్నారా? సినిమాల్లో నటించినా,సీరియల్స్ లో కనిపించినా ఆయా నిర్మాతలు, దర్శకుల దగ్గరనుండి నూతన్ నాయుడు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదంట. మీరు విన్నది నిజమే.

బిగ్ బాస్ షో లో రెమ్యునేరేషన్ లేకుండా పాల్గొన్న నూతన్ నాయుడు సినిమాలు, సీరియల్స్ లో కూడా అదే రూల్ ఫాలో అవుతున్నాడట. వరుసగా 14 పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా ఎవరిదగ్గర ఇప్పటివరకూ ఒక పైసాకూడా పారితోషికం తీసుకోలేదంట. తన అసిస్టెంట్ ఫీజు, ట్రావెల్ టిక్కెట్లు, బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులు తానే పెట్టుకుని షూటింగ్ కి అటెండ్ అవుతున్నాడంట. సీరియల్ నిర్మాతల దగ్గరనుండి కూడా నూతన్ నాయుడు ఒక్క పైసా తీసుకోవడం లేదంట.

యాక్టింగ్ అంటే తనకు ఇష్టమని, తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకులకు ఆర్దికభారం కలిగించడం తనకు ఇష్టం లేదని, కధ నచ్చితే భవిష్యత్తులో కూడా ఫ్రీగా నటిస్తానని నూతన్ నాయుడు అంటున్నాడంట. కరెన్సీ కనపడక పోతే కాల్షీట్స్ ఇవ్వని ఈ రోజుల్లో ఫ్రీ గా డేట్స్ ఇస్తున్న నూతన్ నాయుడి కమిట్ మెంట్ కి చాలామంది నిర్మాతలు, దర్శకులు ఫిదా అయిపోతున్నారంట. ఒకవైపు ఆదరగొడుతూ ఎంటర్తైన్మెంట్ ఇవ్వడమే కాదు ఫ్రీగా డేట్స్ కూడా ఇస్తూవుంటే ఎవరికీ మాత్రం సంతోషంగా వుండదు చెప్పండి. అందుకే నిర్మాతలు, దర్శకులు అప్పుడే నూతన్ డేట్స్ కోసం ఎగబడుతున్నారట. ఇక 14 సినిమాలు 24 సినిమాలైనా 3 సీరియళ్ళు ౩౩ సీరియళ్ళు అయినా మనం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *