ఎందుకో ఏమో మూవీ రివ్యూ ఎందుకో ఏమో మూవీ రివ్యూ
సినిమిర్చి. కామ్ రేటింగ్ 3/5 ప్రేమ కథలు ఎన్నో చూసుంటాం. కానీ ప్రేమ కథల్లోనే… ఛాలెంజింగ్ డ్రామాను మిళితం చేస్తే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎందుకో ఏమో దర్శకుడు అందరిలా... ఎందుకో ఏమో మూవీ రివ్యూ

సినిమిర్చి. కామ్ రేటింగ్ 3/5

ప్రేమ కథలు ఎన్నో చూసుంటాం. కానీ ప్రేమ కథల్లోనే… ఛాలెంజింగ్ డ్రామాను మిళితం చేస్తే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎందుకో ఏమో దర్శకుడు అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఆలోచించి… నేటి సమాజంలో జరుగుతున్న ఓ కోణాన్ని టచ్ చేశాడు. నందు, నోయల్, పునర్నవి ఇందులో ముఖ్య పాత్రధారులు. కోటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కార్తిక్ (నందు ) లైఫ్ లో మంచిగా సెటిలవ్వాాలనే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అలాంటిసాఫ్ట్ వేర్ కుర్రాడికి హారిక (పునర్నవి పరిచయమౌతుంది. కార్తీక్ ఉండే అపార్ట్ మెంట్ లోనే హారిక కూడా ఉంటుంది. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇంట్లో ఒప్పించి ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకుంటారు. కానీ ఇంతలోనే సీన్ రివర్స్ అవుతుంది.

నటీనటులు :
ప్రిన్స్ (నోయల్) అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం. ఎలాంటి అమ్మాయి అయినా లోబర్చుకొని, లేదా బెదిరించి వాడుకొని వదిలేస్తుంటాడు. అలాంటి ప్రిన్స్ స్నేహితుడు కార్తిక్. ప్రిన్స్ కూడా హారిక ను చూసి మోజు పడతాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకుంటాడు. అలా కార్తిక్ తో ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ విని స్నేహితులు సైతం షాక్ అవుతారు.

ఇంతకూ హారిక ఎవరు, హారికి పెళ్లికి వచ్చిన అడ్డంకులేంటి. ప్రిన్స్ కార్తిక్ తో చేసిన ఛాలెంజ్ ఏంటి. హారికను దక్కించుకోవాలని ప్రిన్స్ ఎందుకనుకున్నాడు. ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలిచారు. హారిక ప్రిన్స్ ఎలా ఒక్కటయ్యారు అనేది అసలు కథ….

సినిమా సమీక్ష :
నందు కి ఈ తరహా పాత్రలు చాలానే వచ్చాయి. కానీ ఇందులో కన్ ఫ్లిక్ట్ బాగుంది. సో నందు కి నటించేందుకు మంచి స్కోప్ ఉంది. డిఫరెంట్ ఛాలెంజ్ ను ఎదుర్కొనే లవర్ బాయ్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాకు నోయల్ బాగా ప్లస్ అయ్యాడు. నెగెటివ్ షేడ్ లో బాగా చేశాడు. హీరోతో టగ్ ఆఫ్ వార్ సీన్స్ లో బాగా చేశాడు. పునర్నవి చూడటానికి చిన్నమ్మాయిలా కనిపించినా బాగా చేసింది. ఎమోషనల్ సీన్స్ తో పాటు, క్లైమాక్స్ పార్ట్ లోనూ మెప్పించింది. ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకొస్తుంది. వీరితో పాటు నందు ఫ్రెండ్స్ కామెడీ తో నవ్వించారు. సుడిగాలి సుధీర్ కామెడీ బాగా పేలింది. ఈ సినిమాకు సుధీర్ కామెడీ బాగా ప్లస్ అవుతుంది. పోసాని, సుధీర్ కాంబినేషన్ కామెడీ అదిరింది. ఓవరాల్ గా నటీనటులందరూ దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా నటించి మెప్పించారు.
ప్లస్ పాయింట్స్ :
దర్సకత్వం
నిర్మాణ విలువలు
ఎడిటింగ్
హీరో
హీరోయిన్
మైనస్ పాయింట్స్ :

సినిమా కామెడీ లేకపోవటం
ఫస్ట్ హాఫ్

దర్శకుడు కోటి కొత్తవాడైనా… డిఫరెంట్ ఛాలెంజింగ్ డ్రామా రాసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే సన్నివేశాల్ని ఫ్రేమ్ చేసుకున్నాడు. ముఖ్యంగా నోయల్ క్యారెక్టర్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. కేవలం లవ్ మత్రమే కాకుండా అండర్ కరెంట్ గా సమాజంలో జరుగుతున్న కొన్ని ఆకృత్యాల గురించి డిస్కస్ చేశాడు. ప్రతీ సన్నివేశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తీసినట్టున్నాడు. క్లైమాక్స్ ని యాక్షన్ ఎమోషనల్ గా ముగించాడు. లవ్ సీన్స్ ని కూడాబాగా రాసుకున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి. పెద్ద సినిమా పాటలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాల్ని హైలైట్ చేసింది. సినిమాకు కెమెరా మెన్ రిచ్ లుక్ తీసుకొచ్చాడు. నిర్మాతలు క్వాలిటీ సినిమా అందించారు. మాలతీ వద్దినేని నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

చివరి మాట : ఈ సినిమాకు సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు ఇంట్రస్టింగ్ గ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. తాను అనుకున్న పాయింట్ ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. ఈ సినిమా తప్పక చూడలిసిన చిత్రం

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *