లవ్  ఎంటర్ టైనర్ ‘మసక్కలి’ లవ్  ఎంటర్ టైనర్ ‘మసక్కలి’
తారాగణం: సాయి రోనక్, శ్రావ్య, శిరీష, నవీన్, కాశీ విశ్వనాథ్, దేవ్ దాస్ కనకాల, రాం జగన్, రవివర్మ, లక్ష్మీ వాసుదేవన్, భావన విజయ్ తదితరులు సంగీతం: మిహిరామ్స్ నిర్మాత: నమిత్ సింగ్... లవ్  ఎంటర్ టైనర్ ‘మసక్కలి’

తారాగణం: సాయి రోనక్, శ్రావ్య, శిరీష, నవీన్, కాశీ విశ్వనాథ్, దేవ్ దాస్ కనకాల, రాం జగన్, రవివర్మ, లక్ష్మీ వాసుదేవన్, భావన విజయ్ తదితరులు
సంగీతం: మిహిరామ్స్
నిర్మాత: నమిత్ సింగ్
దర్శకత్వం: నబి
రేటింగ్: 3

సైకలాజికల్ లవ్ స్టోరీలతో తెలుగులో తెరకెక్కిన చిత్రాలు తక్కవే అని చెప్పొచ్చు. అయితే వాటిని ప్రేక్షకులు మెచ్చేలా తెరమీద చూపగలిగితే.. నటీనటులు కొత్తవారైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. తాజాగా ‘మసక్కలి’ అనే చిత్రం ఇలాంటి కథ, కథనాలతో తెరకెక్కిందే. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నబి దర్శకత్వంలో నమిత్ సింగ్ నిర్మించిన ఈ చిత్రంలో సాయి రోనక్, శ్రావ్య, శిరీష ప్రధాన పాత్రలను పోషించారు. మరి ఈ సైకలాజికల్ లవ్ స్టోరీ యూత్ కి ఏమాత్రం ఎక్కిందే చూద్దాం పదండి.

కథ: రచయిత(కాశీశిశ్వనాథ్) కుమారుడైన సూర్య(సాయి రోనక్) సైకియాట్రిస్ట్ గా కెరీర్ ను ప్రారంభిస్తాడు. అయితే శృతి(శ్రావ్య) అనే అమ్మాయి ఒక్కోసారి ఒక్కోరకంగా బిహేవ్ చేస్తోందంటూ… అమె తల్లిదండ్రులు సూర్యను ఆమెకు ట్రీట్ మెంట్ ఇచ్చి సాధారణ యువతిని చేయాలని వేడుకుంటారు. దాంతో సూర్య ఆమెకు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించగా… ఆమె తన మనసులో మాట బయటపెడుతుంది. తమ కంపెనీ టాప్ రేంజ్ లో వుండాలనేది ఆమె కోరిక. అదే సమయంలో సూర్య ఎంజిల్(శిరీష)ను ప్రేమిస్తుంటాడు. ఆమెను ఆరాధిస్తుంటారు. అయితే ఆమె మాత్ర ఎక్కడుందో తెలుసుకోలేక సతమతమవుతున్న తరుణంలో… శృతి ద్వారా ఏంజిల్ ఆచూకి తెలుసుకుంటాడు. అయితే.. శృతి చెప్పిన అడ్రసుకు వెళ్లి చూడగా ఆమె చనిపోయిన ఫొటో వుంటుంది. అది చూసి హతాషుడవుతాడు సూర్య. అసలు శృతికి.. ఏంజిల్ వున్న అడ్రస్ ఎలా తెలిసింది? సూర్య.. ఏంజిల్ ను లవ్ చేశాడని ఎలా తెలుసుకుంది? ఏంజిల్ ఎలా చనిపోయింది? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: సైకలాజికల్ లవ్ స్టోరీ అనగానే అందులో ఏదో ఒక కొత్త పాయింట్ వుండాలి. కథలో ప్రధానమైన క్యారెక్టర్ వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ… ప్రేక్షకుల్లో ఆసక్తిని గొలిపిస్తేనే.. ఇలాంటి కథ, కథనాలు వెండితెరమీద సక్సెస్ అవుతాయి. గతంలో వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ చిత్రం ఇలానే అలరించి.. ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇలాంటి కాంప్లికేటెడ్ కథలు డీల్ చేయాలంటే.. దర్శకులకు కత్తిమీద సామే. అలాంటి కథనే దర్శకుడు నబి ఎంచుకుని.. తెరమీద చూపించి సక్సెస్ అయ్యారు. తొలి చిత్రమైనప్పటికీ అనుభవమున్న దర్శకుడిలా ఎమోషన్స్ ని పండించగలిగాడు. ఇప్పటి వరకూ చూడని విధంగా పాత్రలు డిజైన్ చేశాడు. ఒకట్రెండు సినిమాలు ఈ తరహాలో వచ్చినప్పటికీ… సన్నివేశాలు, సందర్భాలు వేరుగా ఉన్నాయి. యూత్ పుల్ లవ్ లో కొత్త డైమన్షన్ ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు నబి యేనుగుబాల సక్సెస్ అయ్యారు. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో పాటు ఒక కొత్త పాయింట్ ని డిస్కస్ చేశారు.
సాయి రోనక్ గతంలో చేసిన సినిమాలకు ఈ చిత్రం భిన్నంగా ఉంది. సైకియాట్రిస్ట్ గా, ప్రేమికుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ఎమోషన్స్ తో కూడిన పాత్రని సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగాడు. ఈ క్యారెక్టర్ సాయికి మంచి పేరు తీసుకొస్తుంది. హీరోయిన్ గా శ్రావ్యకి డిఫరెంట్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ దొరికింది. డిఫరెంట్ డైమన్షన్స్ ఉంటాయిందులో. డబ్బున్న వ్యాపారవేత్తగా, తన లోని ప్రేమను తనలోనే దాచుకునే ప్రేమికురాలిగా… రకరకాల షేడ్స్ చూపించింది. శిరీష సైతం ఆకాంక్ష పాత్రలో మెప్పించింది. తనదైన హావ భావాలతో ఆకట్టుకుంది. కాశీ విశ్వనాథ్, నవీన్ నేని, దేవదాస్ కనకాల, రాం జగన్, రవివర్మ, లక్ష్మీ వాసుదేవన్, భావన విజయ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మనకు సైకలాజికల్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ. అలాంటిది తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాలిటీగా మసక్కలి చిత్రాన్ని రూపొందించారు. ఒక కొత్తరకమైన అనుభూతిని ఈ చిత్రం ద్వారా అందించారు. ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా కామెడీతో నవ్వించారు. మిహిరామ్స్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాకు పాటలు బాగా ప్లస్ అయ్యాయి. ప్రతీ పాట విభిన్నంగా ఉండి ఆకట్టుకుంది. రీ రికార్డింగ్ తో ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేయగలిగాడు. సుభాష్ దొంతి కెమెరా వర్క్ బాగుంది. నటీనటుల్ని బ్యూటిఫుల్ గా చూపించాడు. నిర్మాత నమిత్ సింగ్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. దర్శకుడు నబి కొత్త రకం ప్రేమ కథను ట్రై చేశాడు. దర్శకుడి కథ, కథనం డిఫరెంట్ గా ఉన్నాయి. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. మంచి పాటలు, కామెడీ రిఫ్రెషింగ్ గా ఉంటాయి. ఫైనల్ గా ‘మసక్కలి’ ఓ సైకలాజికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. గో అండ్ వాచ్!

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *