మౌన‌మే ఇష్టం` మూవీ రివ్యూ మౌన‌మే ఇష్టం` మూవీ రివ్యూ
  ప్రేమ కథల్లో కొత్తదనంతో నిండిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా అద్భుతమైన వర్క్ తో పేరు సంపాదించుకున్న ఆశోక్ ఈ చిత్రానికి... మౌన‌మే ఇష్టం` మూవీ రివ్యూ

 

ప్రేమ కథల్లో కొత్తదనంతో నిండిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా అద్భుతమైన వర్క్ తో పేరు సంపాదించుకున్న ఆశోక్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

 

కథ:

రామ్ కార్తీక్… ఉద్యోగ రిత్యా హైదరాబాద్ వస్తాడు. అనుకోకుండా ఓ ఫంక్షన్ కు వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయి చేసే పనులు చూసి అవాక్కవుతాడు. ఆ తర్వాత ఫంక్షన్ లో మిగిలిన ఆహారాన్ని పేద వారికి పంచడం చూసి ఇంప్రెస్ అవుతాడు. అలా ఆమె గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమె ప్రేమ కోసం పరితపిస్తాడు. పార్వతి కూడా రామ్ ని ఇష్టపడుతుంది. అయితే ఎవరికి వారు ముందుగా ప్రపోజ్ చేయాలనుకుంటారు. కానీ ప్రపోజ్ చేసుకోరు. దానికి ఇద్దరికీ బలమైన కారణం ఉంటుంది. ఇంతకూ ఆ కారణం ఏంటి. ప్రపోజ్ చేసే విషయంలో ఎందుకు వెనకడుగు వేశారు. ఇంతకూ వీరి ప్రేమ ఎలా సుఖాంతం అయ్యింది. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సినిమా సమీక్ష :

హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. హీరోయిన్ పార్వతి చూడాటానికి చాలా బాగుంది. అభినయంతో ఆకట్టుకుంది. ల‌వ్ ఎక్స్‌ప్రెస్ చేయ‌డానికి ఒక జంట మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ చిత్ర‌క‌థ‌. సినిమాను పోయెటిక్ వేలో తీసుకెళ్లాడు దర్శకుడు. విజువ‌ల్స్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయి. సినిమా కలర్ ఫుల్ గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేశారు. ఈ సినిమాకు సంగీతం ప్ర‌త్యేక ఆకర్షణగా  నాజ‌ర్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.  సురేష్ గ‌డిప‌ర్తి మంచి కథ అందించారు. వివేక్ మ‌హాదేవ్‌ పాటలు సందర్భానుసారంగా బాగున్నాయి. రి రికార్డింగ్ సన్నివేశాల్ని బాగా హైలైట్ చేసింది. జె.డి. రామ తుల‌సి కెమెరా వర్క్ రిచ్ గా ఉంటుంది. ప్రతీ సీన్ కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ను అందంగా చూపించారు.

చివరిగా :  ఈ తరహా ప్రేమ కథ మనకు ఇంతవరకు రాలేదు. కథ, కథనం కొత్తగా అనిపిస్తుంది.

సినిమిర్చి. కాం రేటింగ్ :3/5

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *