ప్రాణం ఖరీదు మూవీ రివ్యూ ప్రాణం ఖరీదు మూవీ రివ్యూ
సినిమిర్చి.కామ్ రేటింగ్ 3/5 ప్రశాంత్, అవంతిక, తారకరత్న కీలక పాత్రలు పోషించారు. పి.ఎల్.కె.రెడ్డి దర్శకత్వం వహించారు. నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాత. సంగీతం వందేమాతరం శ్రీనివాస్. కథ : డాక్టర్, ఓ బ్రోకర్ ఓ... ప్రాణం ఖరీదు మూవీ రివ్యూ

సినిమిర్చి.కామ్ రేటింగ్ 3/5

ప్రశాంత్, అవంతిక, తారకరత్న కీలక పాత్రలు పోషించారు. పి.ఎల్.కె.రెడ్డి దర్శకత్వం వహించారు. నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాత. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

కథ : డాక్టర్, ఓ బ్రోకర్ ఓ క్యాబ్ ఎక్కుతారు. ఈ క్యాబ్ డ్రైవర్ ఫస్ట్ మంచిగానే ఉంటాడు. కానీ సడ న్ గా డ్రైవర్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఒక గేమ్ అడుదాం అని భయపెడతాడు. ఇద్దర్ని లాక్ చేస్తాడు. వాళ్ళు భయపడట్లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేని కార్ లో నుంచే గన్ తో షూట్ చేసి చంపుతాడు. ఈ మర్డర్ మిస్టరీ ని ఛేదించేందుకు స్పెషల్ ఆఫీసర్ గా అలెగ్జాండర్ (తారకరత్న) ని నియమిస్తారు. అతనికి సహాయకుడిగా షఫీ ఉంటాడు. తనకు రెస్పెక్ట్ ఇవ్వలేదని… బ్రోకర్ భార్యను కూడా చంపేస్తాడు క్యాబ్ డ్రైవర్. అసలు ఇంతకూ క్యాబ్ డ్రైవర్ ఎవరు. డ్రైవర్ ను, బ్రోకర్ ను ఎందుకు తన కార్ లో లాక్ చేశాడు. ఎందుకు మనీ గేమ్ అడుతుంటాడు. అలెగ్జాండర్ క్యాబ్ డ్రైవర్ ను పట్టుకున్నాడా లేదా. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం థియేటర్లో సినిమా చూడాల్సిందే.

సినిమా సమీక్ష :
హీరో ప్రశాంత్ ఈ సినిమాకు ప్రధాన పిల్లర్ గా నిలిచాడు. విలన్ షేడ్స్ తో వెళ్లే ఈ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. క్యాబ్ డ్రైవర్ గా… డాక్టర్ ను, బ్రోకర్ ను ఆడుకునే సీన్స్ లో అదరగొట్టాడు. లుక్స్ పరంగా, ఫిజిక్ పరంగా, పెర్ ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ తన యాక్టింగ్ తో మెప్పించాడు. హీరోయిన్ అవంతిక మంచి క్యారెక్టర్లో నటించింది. ముఖ్యంగా హాస్పిటల్ సీన్ లో బాగా నటించింది. పోలీసాఫీసర్ గా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా తారకరత్న మరో ప్లస్ పాయింట్ గా నిలిచాడు. యాక్షన్ పార్టులోనూ, క్యాబ్ ను ఛేదించే సీన్స్ లోనూ అదరగొట్టాడు. జెమిని సురేష్, చిత్రం శ్రీను, షఫి సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించాడు. మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు. ఐటమ్ సాంగ్ కూడా పెట్టాడు. డైరెక్టర్ పీఎల్ కే రెడ్డి వైద్య రంగంలో ఉన్న అవయవాల మాఫియాను తెరపై పెట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎడిటింగ్ బాగుంది. మురళీ మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం బాగుంది. రీ రికార్డింగ్ తో సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మెడికల్ ఇండస్ట్రీ లో వుండే చీకటి కోణాలను ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కిన ఈ ప్రాణం ఖరీదు మంచి రివెంజ్ డ్రామాగా నిలిచింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

చివరిగా : నిజంగా టిక్కెట్ ఖరీదు చేసి చూడలిసిన సినిమా ఇది..

 

 

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *