రుణం మూవీ రివ్యూ రుణం మూవీ రివ్యూ
విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై భీమినేని సురేష్‌, జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం. ఎస్‌.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. గోపికృష్ణ, మహేంద్ర, షిల్పా, ప్రియా అగస్థ్యన్లు నటీనటులుగా నటించారు. సినిమా కథ : ... రుణం మూవీ రివ్యూ

విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై భీమినేని సురేష్‌, జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం. ఎస్‌.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. గోపికృష్ణ, మహేంద్ర, షిల్పా, ప్రియా అగస్థ్యన్లు నటీనటులుగా నటించారు.

సినిమా కథ :  సుధీర్ లతను బాగా ఇష్టపడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. సుధీర్ లతను పెళ్లి చేసుకుందామనుకుంటాడు. కానీ తనను వాడుకొని వదిలేసిందని లేటుగా తెలుసుకుంటాడు. సుధీర్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీను. సుధీర్, శ్రీను కలిసి ఒకే రూమ్ లో ఉంటారు. శ్రీను ఆర్థిక పరిస్థితి బాగుండదు. సుధీర్ కూడా చాలీ చాలని జీతంతో బతుకుతుంటాడు. శ్రీను, సరళ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవితంపై విరక్తి కలుగుతుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో సుధీర్ శ్రీనుకు ఓ ప్లాన్ చెబుతాడు. శ్రీను వ్యతిరేకిస్తాడు. కానీ సుధీర్ ఒప్పిస్తాడు. వారి చేసిన పనికి వెట్రీ వీరిని వెతికి పట్టుకుంటాడు. ఆ తర్వాత సుధీర్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంతకూ సుధీర్, శ్రీను చేసిన పనేంటి. వెట్రి వారిని ఏం చేశాడు. వెట్రికి సుధీర్, శ్రీనుకు ఏంటి సంబంధం. సుధీర్, శ్రీను అనుకున్న పని చేశారా… డబ్బు సంపాదించారా. ఎవరు ఎవరికి రుణ పడ్డారు. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం మీరు సినిమా చూడాల్సిందే.

సినిమా సమీక్ష :

ఈ చిత్రం ఇద్దరి స్నేహితుల కథ. డబ్బు వారి జీవితాల్ని ఎలా మార్చిందనేది అసలు కథ. వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మానవ సంబంధాలపై రాసిన కథ. ప్రతి ఇంటిలోనూ రుణానుబంధాలు ఉంటాయి. ఈ కథ ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో కూడిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం. సినిమా ప్రారంభంలో వచ్చే ఫైట్ బాగా కంపోజ్ చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది. ఆ తర్వాత వచ్చే పబ్ సాంగ్ ట్రెండీగా ఉంది. హీరో డ్యాన్సులు ఇరగదీశాడు. ఈ పాటకు కొరియోగ్రఫీ బాగుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్య వచ్చే ట్విస్ట్ బాగుంది. శ్రీను గర్ల్ ఫ్రెండ్ సరళ ఎంట్రీ సాంగ్ బాగుంది. సరళ ఎంట్రీని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. రోడ్ దాటించే సీన్ కొత్తగా ఉంది. వీరిద్దరి మధ్య మెలోడీ సాంగ్ బాగుంది. లొకేషన్స్ బాగున్నాయి. ఆ తర్వాత స్క్రీన్ ప్లే పరంగా చిన్న ట్విస్ట్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది. ఈ చిత్రానికి డైలాగులు బాగా కుదిరాయి. డైరెక్టర్‌ ప్రతి పాత్రని చాలా చక్కగా చిత్రీకరించారు.
మరో హీరోయిన్ సీత పరిచయం సన్నివేశం కూడా బాగుంది. హీరోయిన్ ఆక్టివ్ గా ఉంది.
ముసలామెతో వచ్చే 50 రూపాయల సీన్ బాగుంది. ఎమోషనల్ గా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రుణం టైటిల్ కి దర్శకుడు జస్టిఫికేషన్ బాగా ఇచ్చాడు. సుధీర్, సీత మధ్య లవ్ స్టొరీ బాగుంది. చిత్రంలో నటించిన నటీనటులందరూ వారి వారి పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు. ముఖ్యంగా కళ్లు కనిపించని పాత్రలోనటించిన తల్లితండ్రులు మంచి మార్కులు కొట్టేశారు.

ప్లస్ పాయింట్స్ :
మ్యూజిక్
పాటలు
ఎడిటింగ్
హీరో హీరోయిన్స్
నిర్మాణ విలువలు
కెమెరా పనితనం
డైరెక్టర్

మైనస్ పాయింట్స్ :

రెండవభాగం నెమ్మదిగా సాగడం
కామెడీ పెద్దగా లేకపోవటం

చివరగా :   రుణం  ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా ఇష్టపడేవారికి రుణం బాగా నచ్చుతుంది.

సినిమిర్చి .కాం రేటింగ్: 3/5

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *