యూ టర్న్ మూవీ రివ్యూ యూ టర్న్ మూవీ రివ్యూ
నటీనటులు: సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రవి ప్రకాష్, రాహుల్ రవీంద్రన్ తదితరులు సంగీతం : పూర్ణచంద్ర సినిమాటోగ్రఫర్ : నికెత్ బొమ్మి రెడ్డి ఎడిటర్ : సురేష్ ఆరుముగమ్ నిర్మాతలు :... యూ టర్న్ మూవీ రివ్యూ

నటీనటులు: సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రవి ప్రకాష్, రాహుల్ రవీంద్రన్ తదితరులు
సంగీతం : పూర్ణచంద్ర
సినిమాటోగ్రఫర్ : నికెత్ బొమ్మి రెడ్డి
ఎడిటర్ : సురేష్ ఆరుముగమ్
నిర్మాతలు : శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు
దర్శకత్వం : పవన్ కుమార్
సినిమిర్చి.కామ్ రేటింగ్ 3.25/5

కన్నడలో హిట్టయిన ‘యు టర్న్’ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతోనూ, అదే దర్శకుడితోనూ రీమేక్ చేశారు నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు. హీరోయిన్ సమంత ఇందులో ప్రధాన పాత్ర పోషించగా… ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ లు ఇతర పాత్రలు పోషించారు. సంగీతం పూర్ణ చంద్ర అందించారు. మరి కన్నడలో లానే తెలుగులోనూ ఈ చిత్రం ఎలాంటి థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: రచన (సమంత) టైమ్స్ ఆఫ్ ఇండియాలో అప్రెంటీస్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంటుంది. దాంతో ఆమె కొన్ని స్టోరీలు ఫైల్ చేయాలనకుంటుంది. ఈ క్రమంలో ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై ఓ చోట డివైడర్ సిమెంటు దిమ్మెలు తీసేసి.. యు టర్న్ తీసుకునే ప్రయాణికుల మానసిక పరిస్థతి మీద ఇంటర్వూ చేసి స్టోరీ రాయలనుకుంటుంది. ఇలా ఓ పది మందివి అక్కడే వున్న ఓ బిచ్చగాడి ద్వారా వెహికిల్ నంబర్లను సేకరించి… వారి అడ్రస్సులు కనుక్కొని ఒక్కక్కరిని ఇంటర్వూ చేయడానికి రెడీ అవుతుంది. ఇందులో భాగంగా సుందరం అనే ఓ చార్టెట్ అకౌంటెంట్ ను ఇంటర్వ్యూ చేయడానికి వెళితే.. అతను అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. అయితే అతనిని రచననే చంపిందని.. పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి ఇంటరాగేట్ చేస్తారు. అయితే.. చివరకు అతనిది ఆత్మ హత్య అని తేలుతుంది. ఈ విషయంలో ఎస్.ఐ.నాయక్(ఆది పినిశెట్టి) ఆమె నిర్ధోశని గ్రహించి ఆమె చెప్పింది సాంతం విని… అక్కడ యుటర్న్ తీసుకుంటున్న వ్యక్తుల లిస్ట్ తీసుకుని విచారించగా అందరూ ఆత్మ హత్య చేసుకునే చనిపోయి వుంటారు. అలా యుటర్న్ తీసుకున్న ఎస్.ఐ.నాయక్ ముందే ఓ లాయర్(ఛత్రపతి శేఖర్) మేడమీద నుంచి తన వెహికిల్ పై పడి చనిపోతాడు. అప్పుడు ఇదేదో సీరియల్ మర్డర్ మిస్టరీ అని తెలుసుకుని ఆ మిస్టరీని ఛేదించడానికి రచన, ఎస్.ఐ.నాయక్ ఇన్ వెస్టిగేషన్ మొదలు పెడతారు. మరి ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? యుటర్న్ తీసుకునే వ్యక్తులను చంపింది ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ.. కథనం విశ్లేషణం: యుటర్న్ సినిమా లైన్.. చాలా సింపుల్. కానీ అందులో ఓ మెసేజ్ వుంది. చేసిన చిన్న పొరపాటు వల్ల ఓ కుటుంబం ఎలా నాశనం అయిందో చెప్పడానికి తీసిన ఓ థ్రిల్లర్ మూవీ. సాధారణంగా సిటీస్ లో వృత్తి ఒత్తిడి వల్ల గానీ, సమయాభావం వల్ల.. ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా ఎక్కడంటే అక్కడ డివైడర్లను తొలగించి యుటర్న్ లు తీసుకొని వెళుతుంటాం. అలా డివైడర్లుగా వున్న సిమెంటు దిమ్మెలను తొలగించడం వల్ల మిగతా వాహనదారులు ప్రమాదాలకు గురై.. తమ నిండు ప్రాణాలను ఎలా పోగొట్టుకుంటున్నారనేది ఇందులో చూపించారు. అలాంటి వారిపై రివేంజ్ తీసుకునే మర్డర్ మిస్టరీతో తెరకెక్కిందే యుటర్న్. చాలా సింపుల్ కథే అయినా.. కథ.. కథనాలతో దర్శకుడు తెరకెక్కించిన తీసు ప్రతి క్షణం మనల్ని థ్రిల్ కు గురిచేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా.. ఎక్కడా బోరింగ్ అనే ఫీల్ అవ్వకుండా సినిమాను ఎంతో బిగితో తెరకెక్కించారు దర్శకుడు. దాంతో ప్రతి ఒక్కర్ ఈ థ్రిల్లర్ మూవీకి కనెక్ట్ అయిపోతారు.

ప్లస్‌ పాయింట్స్ :
సమంత నటన
నేపథ్య సంగీతం

మైన‌స్ పాయింట్స్ :
తొలి పది నిమిషాల

రచన అనే జర్నలిస్టు పాత్రలో నటించన సమంత తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఒక పక్క ఏం జరుగుతుందో, తాను డిటైల్స్ కలెక్ట్ చేసిన వ్యక్తులే ఎందుకు వరుసగా చనిపోయారో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఆమె చూపిన అభినయం ఆకట్టుకుంటుంది. వాళ్ళ చావుకి కారణం తెలిసాక, మిగిలిన వారిని కాపాడటానికి ప్రయత్నించే సన్నివేశాల్లో కూడా సమంత తన నటనతో మెప్పించింది. ఎస్ ఐ నాయక్ పాత్రలో అది పినిశెట్టి ఎప్పటిలాగే బాగా నటించారు. సినిమాకే చాలా కీలకమైన పాత్రలో కనిపించిన భూమిక చావ్లా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో ఆమె నటన సినిమాకి చాలా హెల్ప్ అయింది. అలాగే క్రైమ్ రిపోర్టర్ గా నటించిన రాహుల్ రవింద్రన్ కూడా ఉన్నంతలో తన నటనతో ఆకట్టుకుంటాడు.దర్శకుడు పవన్ ఈ సినిమాలో అంతర్లీనంగా చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కథనంలో కూడా ఆయన మెయింటైన్ చేసిన సప్సెన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ చాల క్రిస్ప్ గా వుంది. కచ్చితంగా థ్రిల్ కు గురిచేస్తుంది.ది. ఎడిటర్ సురేష్ పనితరం కూడా పర్వాలేదనిపిస్తోంది. నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

కచ్చితంగా థ్రిల్ కు గురిచేస్తుంది

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *