నటీనటులు: కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, కామ్నా జెఠ్మలానీ తదితరులు రచన, దర్శకత్వం: జైన్స్ నాని నిర్మాతలు: రాజేష్ దండా, శివ బొమ్మకు కో ప్రొడ్యూసర్: బాలాజీ గుట్ట ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి ఫైట్స్: పృథ్వీ ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ సినిమాటోగ్రఫి: సతీష్ రెడ్డి మాసం మ్యూజిక్: చేతన్ భరద్వాజ్ బ్యానర్‌: హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ రిలీజ్ డేట్: 2025-10-18

కృష్ణ (సాయికుమార్) రిచ్ బిజినెస్ మ్యాన్ కుమారుడు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. సంపన్న కుటుంబంలో పుట్టిన చీప్ అలవాట్లతో కాలక్షేపం చేస్తుంటాడు. చదువు, సంధ్య లేకుండా చిల్లర వేషాలు వేస్తుంటాడు. అయితే ప్లేస్ మారిస్తే సెట్ అవుతాడని కేరళలోని తన బావమరిది (నరేష్) వద్దకు పంపుతాడు. అక్కడ కాలేజీలో చేరిన కుమార్‌కు మెర్సి (యుక్తి తరేజా) పరిచయం అవుతుంది. ఆమెతో పరిచయం ప్రేమగా మారుతుంది. తీరా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన తర్వాత ఆమెకు అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందని తెలుస్తుంది. ఆ వ్యాధి కారణంగా సూసైడ్‌కు ప్రయత్నిస్తుంటుంది. దాంతో ఆమెతో లవ్‌కు బ్రేకప్ చెప్పాలని డిసైడ్ అవుతాడు.

కుమార్ ఏ విధంగా జల్సాలు చేశాడు? తన కుమారుడు దారి తప్పుతున్నాడనే బాధతో తండ్రి కృష్ణ ఏం చేశాడు? కేరళలోని కాలేజీలో చేరిన తర్వాత కుమార్ జీవితం ఎలా సాగింది? కేరళలో మెర్సీ తో పరిచయం, ప్రేమాయణం ఎలా సాగింది? అయితే మెర్సీకి ఉన్న అరుదైన వ్యాధి ఎలాంటి కష్టాలను కుమార్‌కు తెచ్చిపెట్టింది? మెర్సీకి ఉన్న వ్యాధి నయం అయిందా? బ్రేకప్ చెప్పాలనుకొన్న కుమార్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మెర్సీ ప్రవర్తన వల్ల కుమార్‌ ఎలాంటి నరకాన్ని అనుభవించాడు? చివరకు కుమార్, మెర్సీ ప్రేమ కథకు ముగింపు ఏమిటి? తండ్రి ఆవేదనను కుమార్ అర్దం చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కే ర్యాంప్ సినిమా కథ.

నూతన దర్శకుడు జైన్స్ నాని రాసుకొన్న కథ అల్లుకొన్న కథలో కొత్తదనం ఏమీ ఉండదు. కానీ మాస్, ఫన్ ఎలిమెంట్స్ కలిపి కేవలం కామెడీ ప్రధానంగా రాసుకొన్న సీన్లతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌పై దృష్టి పెట్టి ఫస్టాఫ్‌ను పూర్తిగా వినోదంతో నింపేశాడు. అది కూడా ఊర మాస్ కామెడీ సీన్లు కొన్ని వర్కువుట్ అయ్యాయి. మరికొన్ని తేలిపోయాయి. ఫస్టాఫ్ చూస్తున్నంత సేపు చాలా రొటీన్, రెగ్యులర్, నాసిరకం కామెడీతో లాగించేస్తారా? అనే అనుమానం కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథ కీలక మలుపు తిరుగుతుంది. దాంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేస్తుంది.

ఇంటర్వెల్ ట్విస్టుతో ఏర్పడిన ట్విస్ట్‌కు అనుగుణంగానే దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు సెకండాఫ్‌లో పూర్తిస్థాయిలో వర్కువుట్ అయ్యాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా స్వరూపమే మారిపోయింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోతున్నదనే సమయంలో ఎమోషన్స్‌తో గట్టి ఝలక్ ఇచ్చేలా చేశాడు దర్శకుడు. వీకే నరేష్ ఎపిసోడ్స్‌కు ఎమోషనల్ టచ్ ఇవ్వడంతో సినిమా గ్రాఫ్ పెరిగిందనిపిస్తుంది. ఇక సాయి కుమార్, కిరణ్ అబ్బవరం మధ్య ఉండే సన్నివేశాలు మరింత భావోద్వేనికి గురి చేసేలా ఉంటాయి. ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద కిరణ్ అబ్బవరం మెచ్యుర్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఈ సినిమాకు సెకండాఫ్‌లో వచ్చే కథ, కథనాలు హైలెట్ మాత్రమే కాకుండా మూవీని హిట్ దారి పట్టించేలా చేశాయి.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాలో బీజీఎం హైలెట్‌‌గా నిలిచింది. ఫస్టాఫ్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవసరం లేకున్నా చాలా లౌడ్‌గా డిస్ట్రబింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో సన్నివేశాలను హైలెట్ చేస్తూ.. ఎమోషనల్ సీన్లను చేతన్ భరద్వాజ్ ఎలివేట్ చేసిన విధానం బాగుంది. డైలాగ్స్ చాలా వరకు అదిరిపోయాయి. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. ఫస్టాఫ్‌లో కొంత ల్యాగ్‌ను కట్ చేసి ఉంటే.. ఇంకా బెటర్‌మెంట్ ఎక్కువగా ఉండేది. అలాగే ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. కేరళ అందాలను బాగా చిత్రీకరించారు. రాజేశ్ దండా అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి.

కే ర్యాంప్ సినిమా విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఫాదర్ సెంటిమెంట్ ఈ కథలో భాగమయ్యాయి. కిరణ్ అబ్బవరం హృదయాన్ని భారంగా మార్చే నటనను ప్రదర్శించాడు. దీపావళీ పండుగ సీజన్‌లో కుటంబ సమేతంగా చూసే చిత్రమే కాకుండా మంచి వినోదాన్ని ఆస్వాదించేలా మూవీని రూపొందించారు. ఈ పండుగ సెలవుల్లో ఈ సినిమాను మీ లిస్టులో ఎలాంటి సందేహాలు లేకుండా చేర్చుకోవచ్చు. మీరు పెట్టే టికెట్‌కు ఫుల్ పైసా వసూల్ మూవీ K Ramp.Movie Rating 3/5