అక్కినేని ఫ్యాన్స్‌ను అత్యంత నిరాశకు గురిచేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ది ఘోస్ట్‌ సినిమా స్టైలిష్ యాక్షన్‌ ఫిల్మ్‌ అంటూ ప్రమోట్‌ చేసి తీరా థియేటర్‌లకు వచ్చిన ప్రేక్షకులకు ది రోస్ట్‌ను చూపించాడు. ఇక రిజల్ట్ సంగతి పక్కన పెట్టేస్తే.. ఎప్పుడూ విభిన్న కథాంశాలను ఎంచుకనే వరుణ్ సైతం గత రెండేళ్లుగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. ప్రత్యేకించి బాక్సింగ్‌ శిక్షణ తీసుకుని మరీ చేసిన గని.. ఫస్ట్ వీక్‌లోనే దుకాణం సర్దేసింది. ఈ సినిమా గాయాలు మానకముందే ఎఫ్‌-3 రూపంలో మరో ఫ్లాప్‌ మూటగట్టుకున్నాడు. ఇలా అటు ప్రవీణ్‌ సత్తారు, ఇటు వరుణ్‌ తేజ్‌ ఇద్దరూ మంచి మాస్‌ కంబ్యాక్‌ కోసం చేతులు కలిపారు. గాండీవధారి అర్జున అంటూ టైటిల్‌ నుంచి సినిమాపై యమ ఆసక్తిని క్రియేట్‌ చేశారు.ఆపై టీజర్‌, ట్రైలర్‌లు గట్రా రిలీజ్‌ చేసి హాలీవుడ్‌ స్లైల్‌ మేకింగ్‌తో వారెవ్వా అనే రేంజ్‌లో అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ సినిమాకు ప్రీమియర్లు పడిపోయాడు. సినిమా చూసిన వారు తమ తమ సమీక్షలను ట్విట్టర్‌ వేదికగా పంచుకుంటున్నారు. మరీ వీరిద్దరూ ఈ సినిమాతో కంబ్యాక్‌ ఇచ్చారా లేదా రివ్యూలో తెలుసుకుందాం. ఇంగ్లాడ్‌ను బేస్‌ చేసుకుని ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. కథ కొత్తగా అనిపించినా కథనం లోపించిందని అంటున్నారు. పోరాట ఘట్టాలు మాత్రం హాలీవుడ్‌ స్థాయిలో ఉన్నాయంటున్నారు.ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఎలాంటి హై మూమెంట్స్‌ లేకుండా కథ సాగుతుందని తెలుపుతున్నారు. యాక్షన్‌ సీన్లు పుష్కలంగా ఉన్నా.. మెప్పించే కథనం లేదని అంటున్నారు. ఎంత సేపు స్టంట్స్‌ మాత్రమే కనిపిస్తాయని వెల్లడిస్తున్నారు. కొన్ని సార్లు అవి కూడా బోర్‌ తెప్పించే స్థాయిలో ఉన్నాయట. వరుణ్ ఎంట్రీ మాత్రం అదిరిపోయిందని, ఆయన క్యారెక్టరైజేషన్‌ కూడా బాగుందని అంటున్నారు. ఫస్ట్‌ హాఫ్‌ మొత్తంలో ప్రేక్షకులను హూక్‌ చేసేది మాత్రం ఇంటర్వెల్ సీన్‌ అట. ఆ సీన్‌ను ప్రవీన్‌ సత్తారు చాలా కొత్తగా డిజైన్‌ చేశాడట. అంతేకాకుండా ఇంటర్వెల్ ఎపిసోడ్‌ వల్ల సెకండ్‌ హాఫ్‌పై తిరుగులేని హైప్ వచ్చిందని అంటున్నారు.అయితే సెకండ్‌ హాఫ్‌ కూడా ఫస్ట్ హాఫ్‌ రేంజ్‌లోనే ఎలాంటి హై మూమెంట్స్‌ లేకుండా సాగుతుందని అంటున్నారు. కొందరైతై సెకండ్ హాఫ్‌తో పోలిస్తే ఫస్ట్ హాఫే కాస్త బెటర్‌గా ఉందని అంటున్నారు. సెకండ్ ఆఫ్‌లో చాలా సీన్స్‌ బోర్ కొట్టించేలా ఉందని.. మాములుగా స్పై సినిమాలంటేనే సీడ్‌ ఎడ్జ్‌ రేంజ్‌లో ఉంటూ, ఓ ఎమోషన్‌ను క్యారీ చేస్తుంటుంది. కానీ అర్జున సినిమాలో అలాంటి ఎమోషనల్ కనెక్టివీటి మిస్సయిందని తెలుపుతున్నారు. థ్రిల్ అయ్యే సీన్స్‌ ఒక్కటి కూడా లేవని అంటున్నారు. మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం కూడా సీన్స్‌ను లేపలేదని అంటున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం, పాటలు ఒక్కటి కూడా ఆకట్టుకోలేదని అంటున్నారు. హీరోయిన్‌గా సాక్షీ వైద్య సైతం పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు.సినిమా మొత్తానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది ఒక్క సినిమాటోగ్రాఫర్‌ ముకేష్‌ అనే అంటున్నారు. విజువల్స్‌ను బాగా చూపించాడని, యాక్షన్‌ సన్నివేశాలను క్యా్ప్చర్ చేసిన విధానం బాగుందని అంటున్నారు. ఇక ఎస్‌వీసీసీ బ్యానర్‌ డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేసిందని అంటున్నారు. సినిమాను మాత్రం చాలా గ్రాండియర్‌గా చూపించారని అంటున్నారు. మొత్తానికైతై అర్జునుడు సో సో మార్కులతో సరిపెట్టుకున్నట్లు రివ్యూలు వస్తున్నాయి.అయితే ఇది కేవలం ప్రీమియర్‌ టాక్‌ మాత్రమే.. సినిమాపై ఓ క్లారిటీ రావాలంటే ఒరిజినల్ రివ్యూలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.