ఇటీవల విడుదలైన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో నవీన్‌ పొలిశెట్టి. స్టాండప్‌ కమెడియన్‌గా ఆయన నటన అందరిని ఆకట్టుకుంటున్నది. దీంతో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.తాజా సమాచారం ప్రకారం ‘జాతిరత్నాలు’ చిత్రం ద్వారా తన కెరీర్‌లోనే పెద్ద హిట్‌ను అందించిన దర్శకుడు అనుదీప్‌ కేవీతో నవీన్‌ పొలిశెట్టి ఓ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ‘జాతిరత్నాలు’ తరహాలోనే హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నదని, ఓ అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తుందని వార్తలొస్తున్నాయి.