కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయని ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల గురించే చర్చ నడుస్తుంటుంది. ఈ స్టార్ హీరో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న లియోకు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. లియో నుంచి లాంఛ్ చేసిన నా రెడీ సాంగ్‌ ఇప్పటికే నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. లియో అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రమోషనల్‌ఈవెంట్స్‌తో బిజీగా కానుంది దళపతి టీం. అభిమానులు సెకండ్‌ సింగిల్‌ కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. లియో సెకండ్‌ సింగిల్‌పై నేడు క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. కాగా లియో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 30న కానీ, అక్టోబర్‌ 1న కానీ నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారన్న అప్‌డేట్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. అనిరుధ్‌ సంభవం లోడింగ్‌.. అంటూ నెట్టింట #LeoSecondSingle ట్రెండింగ్ అవుతోంది. లియో నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి

ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించేందుకు యూకేలో లియో అన్‌కట్‌ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్టు యూకే డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న అహింస ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇప్పటికే ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను షేర్ చేసింది. లియో విడుదలైన కొన్ని రోజుల తర్వాత 12A-rated version (అన్‌కట్‌ వెర్షన్‌/ కట్స్‌ లేకుండా‌) విడుదల చేయనున్నట్టు తెలియజేసింది.

లియోలో యాక్షన్‌ కింగ్ అర్జున్ హెరాల్డ్‌ దాస్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన హెరాల్డ్‌ దాస్‌ గ్లింప్స్ వీడియో (Glimpse of Harold Das) నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. సంజయ్‌ దత్‌ ఆంటోనీ దాస్‌ గ్లింప్స్ కూడా వైరల్ అవుతోంది. లియో చిత్రంలో ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.