• చేతన్ కృష్ణ (Hero)
  • చేతన్ మద్దినేని (Heroine)
  • వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు.. (Cast)
  • సాయి కిషోర్ మచ్చా (Director)
  • ఎంఎస్ రామ్ కుమార్ (Producer)
  • గోపీ సుందర్ (Music)
  • సిద్ధార్థ్ రామస్వామి (Cinematography)
  • Release Date : నవంబర్ 08, 2024

చేతన్ మద్దినేని, హెబ్బ పటేల్ ప్రధాన పాత్రల్లో సాయికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ “ధూం ధాం” (Dhoom Dhaam) . ఈవారం విడుదలైన ఆరు సినిమాల్లో ఇదొకటి. ఇన్ని సినిమాల నడుమ ఇది నిలవడం అనేది పెద్ద విషయం, మరి విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

 

కథ: తండ్రి మీద విపరీతమైన ప్రేమాభిమానాలతో పెరుగుతాడు కార్తీక్ (చేతన్ మద్దినేని), అతడి వ్యవహారశైలి నచ్చి అతడ్ని ఇష్టపడుతుంది సుహానా (హెబ్బా పటేల్). ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఏమిటా సమస్యలు? కార్తీక్ ఆ సమస్యలను ఎలా ఎదిరించాడు? చివరికి సుహానాను పెళ్లాడగలిగాడా? అనేది “ధూం ధాం” కథాంశం.

నటీనటుల పనితీరు: ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా హైలైట్ అయ్యింది వెన్నెల కిషోర్. ముఖ్యంగా మందు సిట్టింగ్ సీన్ లో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి సీనియర్ యాక్టర్ల డైలాగులు “ఎక్స్ ప్రెషన్స్”తో చెప్పి విశేషంగా ఆకట్టుకున్నాడు. హెబ్బా పటేల్ ఈ తరహా పాత్రలు ఇప్పటికే బోలెడన్ని చేసేసింది కాబట్టి, తన కంఫర్ట్ జోన్ లో సింపుల్ గా నటించేసింది. చేతన్ జు రమణ, వినయ్ వర్మ, బెనర్జీ, నవీన్ నేని, ప్రవీణ్ తదితరులు పర్వాలేదనిపించుకున్నారు.సినిమాలో వెన్నెల కిషోర్ “ఎక్స్ ప్రెషన్” అనే డైలాగ్ చెప్పినప్పుడల్లా స్క్రీన్ మీద చేతన్ కనిపించినప్పుడు బాగుంటుంది  అనిపిస్తుంది. సన్నివేశంతో సంబంధం లేని భావంతో తెరపై కనిపించే చేతన్ నటుడిగా ఈ సినిమా తో  చాలా ఇంప్రూవ్ అయ్యాడు నటన పరంగా ..

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు గోపీసుందర్ పాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలోనే ఉంది. సిద్ధార్థ రామస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ముందుగా ఇంతమంది ఆర్టిస్టులను పోలాండ్ తీసుకెళ్లిన ప్రొడ్యూసర్ ను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదని సినిమాలో ప్రతి ఫ్రేమ్ చెబుతూనే ఉంటుంది. ఈమధ్యకాలంలో ఇంతమంది ఆర్టిస్టులను ఒకే ఫ్రేమ్ లో చూడలేదనే చెప్పాలి.

గోపీమోహన్ అందించిన కథ చాలా సాదాసీదాగా ఉంది. ఈ తరహా కాన్సెప్ట్ లు ఇదివరకే కోకొల్లలుగా వచ్చాయి. అయితే.. ఈ కథను దర్శకుడు సాయికిషోర్ మచ్చా హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా  బాగా ఉంది . సినిమా మొత్తంలో ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశం చాలా ఉన్నాయి. ఇంతమంది ఆర్టిస్టులని హ్యాండిల్ చేయడం కూడా దర్శకుడు గొప్పతనం.

విశ్లేషణ: ప్రేక్షకులు అన్నిరకాల సినిమాలకు ఎక్స్ పోజ్ అవుతూ వస్తున్న ఈ తరుణంలో.. ఇలాంటి రొటీన్ కమర్షియల్ సినిమాలతో వారిని ఆకట్టుకోవడం అనేది కొంచెం అత్యాశ రొటీన్ కథలను కూడా కొత్తగా చూపించొచ్చు. ఆ విషయాన్ని దర్శకుడు సీరియస్ గా తీసుకున్నాడు. అందువల్ల.. భారీ క్యాస్టింగ్, మంచి టెక్నికాలిటీస్ ఉన్నప్పటికీ “ధూం ధాం” (Dhoom Dhaam) ప్రేక్షకుల్ని మంచి ఎంటర్టైన్మెంట్ స్థాయిలో  ఆకట్టుకుంది.అని ఇంతమంది ఆర్టిస్టులు చూసి చాలా కాలం అయింది ఇలాంటి మంచి సినిమాలు తీస్తూ ఫ్యామిలీ సినిమాలు తీయగలడు. డైరెక్టర్ ..

సినిమిర్చి పాయింట్ . అస్సలు సినిమాలో నవ్వులు నో స్టాప్ .. ఈ వారం తప్పక చూడాలి సినిమ

సినీమిర్చి రేటింగ్ : 3/5