Fear Movie Review In Telugu: బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక నటించిన తెలుగు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్. డైరెక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఫియర్ మూవీ డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. హారర్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ తెలుగు సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందో ఫియర్ రివ్యూలో చూద్దాం.

టైటిల్: ఫియర్

నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, పవిత్ర లోకేష్, జయప్రకాష్, అనీష్ కురువిల్ల, సాయాజీ షిండే, సాహితి దాసరి, సత్యకృష్ణ, బిగ్ బాస్ షాని తదితరులు.

కథ, దర్శకత్వం: హరిత గోగినేని

 

సంగీతం: అనూప్ రూబెన్స్

 

సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్య్రూ

 

నిర్మాతలు: వంకి పెంచలయ్య, ఏఆర్ అభి

 

విడుదల తేది: డిసెంబర్ 13, 2024

 

Fear Review Telugu: గ్లామర్ బ్యూటి వేదిక మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన తెలుగు సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఫియర్. డైరెక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఫియర్ మూవీకి వివిధ ఇంటర్నేషనల్ ఫిలీం ఫెస్టివల్స్‌లో 70కిపైగా అవార్డ్స్ రావడంతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అలాగే, ఫియర్ టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

 

కొంచెం గ్యాప్ తర్వాత అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ తెలుగు సస్పెన్స్ సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో ఫియర్ రివ్యూ లో తెలుసుకుందాం.

 

కథ:

సింధు (వేదిక) తన క్లాస్‌మేట్ సంపత్ (అరవింద్ కృష్ణ)ను ప్రేమిస్తుంది. అయితే, కొద్దిరోజులకు తన బాయ్‌ఫ్రెండ్ మిస్ అయ్యాడని అతని కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు ఎవరికీ కనిపించని ఓ వ్యక్తి సింధుకు మాత్రమే కనిపిస్తూ తనను వెంటాడుతుంటాడు. దాంతో భయపడిపోతూ మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతుంది సింధు. తరచు సింధు అనవసరమైన విషయాలకు భయపడటంతో ఆమెను మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు.

మెంటల్ ఆసుపత్రిలో సింధు చేరిన తర్వాత ఏం జరిగింది? అసలు సింధుకు మాత్రమే కనిపించే వ్యక్తి ఎవరు? సింధుకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు? సింధు తరచుగా భయపడటానికి కారణం ఏంటీ? ఇందు ఎవరు? సింధుకు ఇందుకు మధ్య ఉన్న సంబంధం ఏంటీ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఫియర్ మూవీ చూడాల్సిందే.

 

విశ్లేషణ:

తెలుగులో స్ల్ర్స్సి సైక్లోజకల్ చాలా అరుదు. ఒకవేళ వచ్చిన వాటిని సరైన గ్రిప్పింగ్ నెరేషన్‌తో థ్రిల్లింగ్ సీన్స్‌తో చివరి వరకు ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడం కత్తి మీద సాములాంటిది. అందుకే ఇలాంటి జోనర్‌లో వచ్చిన సినిమాలు చాలావరకు డీలా పడుతుంటాయి. కానీ, ఫియర్ మూవీ మాత్రం దాని నుంచి బయటపడిందని చెప్పుకోవాలి.

 

ఎంగేజ్ చేసే సీన్స్

కొద్దిపాటి మైనస్‌లు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఫియర్ ఎంగేజ్ చేసే సినిమా. నిజానికి ఫియర్ స్టోరీ లైన్, కాన్సెప్ట్ యూనిక్‌గా ఉంటుంది. అయితే, దాన్ని ప్రజంట్ చేసే విషయంలో కాస్తా తడబడినట్లు తెలుస్తోంది. సినిమాలో ఎంగేజ్ అయ్యే సీన్స్, థ్రిల్లింగ్స్ విజువల్స్ చాలా వరకు బాగున్నాయి. ముఖ్యంగా సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు తెప్పించాల్సిన మూడ్, ఫీల్‌ను బీజీఎమ్‌తో చాలా బాగా తీసుకొచ్చారు.

ఊహించని ట్విస్టులు

కొన్ని విజువల్స్ అయితే భయపెట్టెలా చాలా బాగున్నాయి. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అయినప్పటికీ పలుచోట్ల హారర్ ఛాయలు కనిపిస్తాయి. అయితే, అవి రొటీన్‌గా ఉండే జంప్ స్కేర్స్‌లా ఉంటాయి. టెక్నికల్‌గా చూసినప్పుడు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. చాలా వరకు సీన్స్ గెస్ చేస్తామని అనిపించినా ఊహించని ట్విస్టులు ఎదురవడం మంచి థ్రిల్ ఇస్తుంది.

 

ఆకట్టుకున్న వేదిక

ఇక నటీనటుల విషయానికొస్తే వేదిక చాలా బాగా చేసింది. డ్యుయల్ రోల్‌లో తనదైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. మిగతా పాత్రలు కూడా డీసెంట్‌గా చేశాయి. ఇక డైరెక్టర్ టేకింగ్ బాగుంది. సీన్స్‌, దానికి అనుగుణంగా సాగే కథనం ఆకట్టుకుంటుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ వంటి సాంకేతికపరమైన అంశాలు బాగున్నాయి.

 

ఎక్స్‌పోజింగ్ మినహా

ఓవరాల్‌గా చెప్పాలంటే అక్కడక్కడ కొద్దిపాటిస్పోసింగ్ పూర్తిగా  ఫామిలీ మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఫియర్. గంట 55 నిమిషాల రన్‌టైమ్‌తో సాగే ఫియర్ మూవీ ఎంగేజ్ చేసేలా ఉంటుంది.

 

రేటింగ్: 3/5