Select Page
అక్టోబర్14 న రిలీజ్ అవుతున్న కె జి ఎఫ్ రాక్ స్టార్ యాష్ నటించిన రారాజు

అక్టోబర్14 న రిలీజ్ అవుతున్న కె జి ఎఫ్ రాక్ స్టార్ యాష్ నటించిన రారాజు

 

పాన్ ఇండియా స్టార్ హీరో యాష్ కథానాయకుడిగా నటించిన చిత్రం రారాజు. కన్నడలో విడులై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో బారీ ఎత్తున అక్టోబర్ 14న రిలీజ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమంలో పద్మావతి ఫిలింస్ సుబ్బారావు, డైరెక్టర్ మల్లిడి గాంధీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ , లిరిక్ రైటర్ గురు చరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వి ఎస్. సుబ్బారావు మాట్లాడుతూ..రాక్ స్టార్ యశ్ అయన సతీమణి రాధిక పండిట్ హిరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కన్నడ లో పెద్ద సక్సెస్ అయ్యింది.ఈ చిత్రాన్ని తెలుగులో రారాజు పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబర్ 14న రిలీజ్ చేస్తున్నాము.ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ అందరినీ మెప్పిస్తుంది అని అన్నారు.

పాన్ ఇండియా స్టార్ హీరో యాష్ నటించిన రారాజు మంచి హిట్ కావాలని కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఆకాంక్షించారు.
.
యాష్, హీరోయిన్ రాధిక పండిట్, కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణం

పద్మావతి పిక్చర్స్ బ్యానర్
మ్యూజిక్ హరికృష్ణ
డీ ఓ పి.. ఆండ్రూ
నిర్మాత.. వి ఎస్. సుబ్బారావు
డైరెక్టర్ . మహేష్ రావు

వినోదంతో కూడిన విభిన్న చిత్రం స్వాతిముత్యం -నిర్మాత సూర్యదేవర నాగవంశీ

వినోదంతో కూడిన విభిన్న చిత్రం స్వాతిముత్యం -నిర్మాత సూర్యదేవర నాగవంశీ

 

ఈ ఏడాది ప్రారంభంలోనే ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘స్వాతిముత్యం’. యువ ప్రతిభను పరిచయం చేస్తూ సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ వినోదభరితమైన కుటుంబకథా చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా విలేకర్లతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

స్వాతిముత్యం ఎలా ఉండబోతోంది?
ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్ నుంచి నిస్సందేహంగా నవ్వుకుంటూ బయటకు వస్తారు. అద్భుతం తీశాం, అవార్డులు వచ్చే సినిమా తీశామని చెప్పను. పండగ రోజు థియేటర్ కి వస్తే మాత్రం గ్యారంటీగా నవ్వుకునే బయటకు వస్తారు. అయితే ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఇందులో టచ్ చేశాం. ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ని ఫన్ టోన్ లో చెప్పాం.

కొత్త డైరెక్టర్ కి మీరేమైనా సూచనలు చేశారా?
ఇప్పుడొస్తున్న కొత్త డైరెక్టర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. లక్ష్మణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా తాను అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు మాత్రమే ఇచ్చాం.

గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలతో పాటు విడుదల చేస్తున్నారు. కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అలాంటిదేం లేదండి. నేను మొన్న కూడా చెప్పాను. కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. పైగా దసరా సీజన్ కాబట్టి రెండు సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం.

చిరంజీవి గారు మీ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు కదా.. మీరెలా ఫీల్ అయ్యారు?
అందుకే ఆయన చిరంజీవి అయ్యారు. చిన్న సినిమాలను ఆదరించమని కోరతారు. చిన్న సినిమాలను అభినందిస్తారు. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారు.

ఈ టైటిల్ పెట్టడానికి కారణమేంటి? టైటిల్ పెట్టేముందు బాగా ఆలోచించారా?
హీరో క్యారెక్టర్ అమాయకంగా ఉంటుంది కాబట్టి స్వాతిముత్యం టైటిల్ సరిగ్గా సరిపోతుందని పెట్టాం. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే మా సినిమా ప్రేక్షకులలోకి త్వరగా వెళ్తుందన్న ఉద్దేశంతో పెట్టాం. అయితే సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్ అని అందరికీ అనిపిస్తుంది.

స్వాతిముత్యం అంటే అమాయకుడా? పిచ్చోడా?
పిచ్చోడు కాదు అమాయకుడు. ఈ జనరేషన్ లో ఉండాల్సిన వాడు కాదు. చాలా మంచోడు. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో హీరోలా ఉంటాడు.

కొంతకాలంగా ప్రేక్షకులు వైవిధ్యమైన చిత్రాలనే ఆదరిస్తున్నారు? మీ చిత్రం ఆదరణ పొందుతుంది అనుకుంటున్నారా?
బింబిసార, సీతారామం, కార్తికేయ -2 వేటికవే విభిన్న చిత్రాలు. అన్నీ ఆదరణ పొందాయి. అలాగే ఇటీవల ఎంటర్టైన్మెంట్ సినిమాలు పెద్దగా రాలేదు. డీజే టిల్లు తర్వాత ఇదే అనుకుంటున్నా. అలా అని కేవలం ఎంటర్టైనర్ మాత్రమే కాదు కొత్త కాన్సెప్ట్ కూడా ఉంటుంది.

వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా ఎంపిక చేయడానికి కారణం?
మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఆమె నటన చూసి ఎంపిక చేశాం. దీనిలో కూడా ఒక స్మాల్ టౌన్ అమ్మాయి క్యారెక్టర్. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుంది అని ఎంపిక చేయడం జరిగింది.

ఈ ఫిల్మ్ గణేష్ కి మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నారా?
బెల్లంకొండ సురేష్ గారు పెద్దబ్బాయిని సమంతను హీరోయిన్ గా పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది అలా కాదు. ఈ సినిమాతో మంచి కాన్సెప్ట్ తో వచ్చాడన్న పేరు వస్తుంది.

స్వాతిముత్యం నుంచి ఇక సితారలో ప్రయోగాత్మక చిత్రాలు ఆశించవచ్చా?
డీజే టిల్లు నుంచే చేశాం కదా. అన్ని రకాలు చిత్రాలు చేస్తాం. టిల్లు, వరుడు కావలెను, స్వాతిముత్యం ఇలా చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు, రవితేజ గారు, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాం. అలాగే ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో తారక్ గారు బావమరిదిని లాంచ్ చేస్తున్నాం.

చిరంజీవి గారితో ఎప్పుడు ఉండొచ్చు ప్రాజెక్ట్?
నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను ఆయనతో త్వరగా సినిమా చేయాలని.

మహేష్ బాబు గారి సినిమా గురించి చెప్తారా?
త్రివిక్రమ్, మహేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు థియేటర్స్ లో రావాల్సినంత ఆదరణ రాలేదు. కానీ టీవీల్లో పిచ్చి పిచ్చిగా చూసి ఆ కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకొని థియేటర్ కి వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది.

తొలి తెలుగు పాన్‌ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్

తొలి తెలుగు పాన్‌ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్

 

గోపురం స్టూడియోస్‌ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్‌కుమార్‌లు నిర్మించిన చిత్రానికి శివమ్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నేహ లీడ్‌రోల్‌లో వేదాంత్‌ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్‌వీర్‌ ముఖ్యప్రాతలో నటించారు. శనివారం హైదరాబాద్‌లో ‘లిల్లీ’ సినిమా ప్రమోషన్‌ను లాంచనంగా ప్రారంభించింది చిత్రయూనిట్‌. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి.వి వి నాయక్ ‘లిల్లీ’ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు సినిమాలోని ఎమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు శివమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్యాన్సర్ పై పోరాటం మీద వుంటుంది. పోస్టర్ చాలా క్రియేటివ్ గా… యూనిక్ గా వుంది.. దర్శకుడు శివమ్ పెద్ద దర్శకుడు అవ్వాలి. క్యాన్సర్ ని ఓ డైనోసార్ తో పోలుస్తూ… పోస్టర్ డిజైన్ చేసిన విధానం నచ్చించి. ఆయనకు మంచి అవకాశాలు రావాలి. అలాగే సీనియర్ నటుడు శివ కృష్ణ సినిమా మీద ఎంతో ప్యాసన్ వున్న నటుడు. ఆయనతో నేను చెన్న కేశవ రెడ్డి చేసా. ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి.. సినిమా రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతిస్టం ఆయనకి సినిమా అంటే. ఆయన మనవడు నటించిన ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇందులో నటించిన మిగతా పిల్లలకి మంచి భవిష్యత్తు వుండాలి. చిత్రానికి పని చేసిన మ్యూజిక్ డైరక్టర్ కి మంచి పేరు రాలని కోరుకుంటున్నా’ అన్నారు.

నటుడు శివ కృష్ణ మాట్లాడుతూ… ‘నా కెరీర్ లో చాలా మంది దర్శకులతో పని చేశా. కానీ వి.వి. వినాయక్ అంత కూల్ పర్సన్ ని నేను ఇంత వరకు చూడలేదు. ఆయనతో పనిచేయడం నా అదృష్టం. ఆయన ఈ కార్య్రమానికి రావడం ఎంతో అదృష్టం’ అన్నారు.

దర్శకుడు శివమ్‌ మాట్లాడుతూ–‘‘ లిల్లీ చిత్రంతో పాటు లిల్లీ పాత్రలో నటించిన నేహ నా జీవితానికి టర్నింగ్‌పాయింట్‌. 32ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అంజలి’ సినిమానే ఈ చిత్రానికి ఇన్స్‌పిరేషన్‌. ‘లిల్లీ’ చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత ఆ చిత్ర దర్శకుడు మణి సార్‌కి ఏకలవ్య శిష్యుణ్ని నేను అని గర్వంగా చెప్పుకుంటున్నా. ఈ రోజుల్లో ఒక బాలల చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేసే అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అన్నారు.

నిర్మాత బాబురెడ్డి మాట్లాడుతూ–‘‘దర్శకుడు శివమ్ కి నేను మొదట చెప్పింది… సినిమాలో మందు, సిగరెట్ , ఎటువంటి వల్గారిటీ లేకుండా వుంటే సినిమా చేస్తా అని చెప్పాను, అలాంటి కథనే చెప్పి నన్ను ఒప్పించాడు. అందుకే ఈ సినిమా తీశా. పిల్లల్ని దేవుళ్లంటారు కదా! ‘‘లిల్లీ’’ సినిమా చూస్తే అలా ఎందుకంటారో అర్ధమవుతుంది. ప్రస్తుత సమాజంలో పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్లాలంటే పేరెంట్స్‌ భయపడుతున్నారు. కానీ, మా ‘లిలీ’్ల సినిమాకి పెద్దవాళ్లే సినిమా చూడమని పిల్లల్ని పంపుతారు’’ అన్నారు.

నిర్మాత సతీశ్‌ మాట్లాడుతూ–‘‘ పిల్లలంటేనే ఎమోషన్‌. కూతురున్న ప్రతి తల్లితండ్రులు లిల్లీ లాంటి బంగారుతల్లి మా ఇంట్లోకూడా ఉంటే బావుండు అనుకుంటారు’’ అన్నారు. ప్రముఖ నటుడు శివకృష్ణ మాట్లాడుతూ‘‘ ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడో ఓ సారి మాత్రమే మన తలుపు తట్టుకుని మన దగ్గరికి వస్తాయి. ఈ చిత్రంలో నటించిన నేహ, దివ్యతో పాటు నా మనవడు వేదాంత్‌వర్మకూడా ఎంతో చక్కగా నటించారు. ఈ ముగ్గురు ‘లిలీ’్ల వంటి మంచి చిత్రంతో నటులుగా పరిచయం అయినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.

ముఖ్యపాత్రలో నటించిన రాజ్‌వీర్‌ మాట్లాడుతూ– ‘‘నా మొదటిచిత్రం ఇలాంటి టీమ్‌తో పనిచేయటం, సినిమాలోని పిల్లలతో కలిసి ముఖ్యపాత్రలో నటించటం మంచి అనుభూతి. ఒక నటునిగా చక్కని ప్రారంభం అనుకుంటున్నా’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో కీలకమైన రియల్‌లైఫ్‌ పాత్రలో నటించిన మలయాళం హీరో రాజీవ్‌పిళ్లై, బాలీవుడ్‌ నటి మిషెల్‌ షాలు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా– యస్‌. రాజ్‌కుమార్, సంగీతం– ఆంటో ఫ్రాన్సిస్, ఎడిటర్‌– లోకేశ్‌ కడలి, ఫైనల్‌మిక్సింగ్‌– సినోయ్‌ జోసెఫ్, సౌండ్‌– జుబిన్‌ రాజ్, వీఎఫ్‌ఎక్స్‌– ఆర్క్‌ వర్క్స్‌.

జిన్నా అక్టోబర్ 21న విడుదల

జిన్నా అక్టోబర్ 21న విడుదల

డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హీరోయిన్స్ గా నటించారు. జి. నాగేశ్వర్ రెడ్డి గారిది ముల కథ. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

దర్శకుడు సూర్య మాట్లాడుతూ “నేను మోహన్ బాబు గారి సంస్థ లో సినిమా చేస్తానని అనుకోలేదు. నాకు అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి విష్ణు గారికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, పెద్ద హిట్ అవుతుంది” అని తెలిపారు.

దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ “జిన్నా చిత్రం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21న విడుదల అవుతుంది. విష్ణు గారి కెరీర్ లో ఎంటర్టైన్మెంట్ చిత్రాలు అని బ్లాక్ బస్టర్ లే . ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. దర్శకుడు సూర్య చాలా బాగా చేశాడు. ఎంత పెద్ద కాస్టింగ్ తో సినిమా చేయడం చాలా కష్టం, కానీ ఫస్ట్ కాపీ చూసాక బ్లాక్ బస్టర్ సినిమా రెడీ అయింది అని అనుకున్నాను. నేను ఈ సినిమా దర్శకత్వం చేయడం లేదు అని బాధపడను. మోహన్ బాబు గారి బలమే మహిళా ప్రేక్షకులు మరియు మాస్ ప్రేక్షకులు. ఈ చిత్రం లో మహిళలకి సూపర్ గా నచ్చుతుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా అద్భుతంగా ఉంటుంది. కొత్త సన్నీ లియోన్ ని చూస్తారు. విష్ణు గారి పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుంది. చాలా రిస్కీ షాట్స్ చేశారు, డాన్స్ ఇరగదీసాడు, ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది” అని తెలిపారు.

మంచు విష్ణు గారు మాట్లాడుతూ “మా జిన్నా చిత్రం అక్టోబర్ 21న విడుదల అవుతుంది. చాలా కష్టపడి చిత్రాన్ని నిర్మించాము. జి నాగేశ్వర రెడ్డి గారి మొల్ల కథ అందించారు, కోన వెంకట్ గారు కథ అందించారు. ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 5 న విడుదల అవుతుంది. మా అందరికి ఇది ఒక అద్భుతమైన జర్నీ, సినిమా చాలా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుంది” అని తెలిపారు.

నటీ నటులు
విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాతలు : అవా ఎంటర్‌ టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
దర్శకత్వం ::ఈషన్ సూర్య హెల్మ్
సినిమాటోగ్రఫి : ఛోటా కె. నాయుడు
కథ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్

వరుణ్ సందేశ్ హీరో గా “ప్రొడక్షన్ నెంబర్ 1 ” చిత్రం ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరో గా “ప్రొడక్షన్ నెంబర్ 1 ” చిత్రం ప్రారంభం

 

బి. యం సినిమాస్ పతాకంపై వరుణ్ సందేశ్ , సీతల్ భట్ జంటగా ఆర్ . యన్ హర్ష వర్ధన్ దర్శకత్వంలో శేషు మారం రెడ్డి మరియు బోయపాటి భాగ్య లక్ష్మి సమర్పణలో “ప్రొడక్షన్ నెంబర్ 1 ” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ సాయిబాబా దేవాలయంలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదములు. దర్శకుడు హర్షవర్ధన్ చెప్పిన కథ విన్న తరువాత నాకు “ఈ కథ నాకు 100% సక్సెస్ ఫుల్ సినిమా అవుతుందని అనిపిస్తుంది. ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న “ఈ మూవీ” లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ రధాన్ మరియు జవహర్ రెడ్డి డి ఓ పి ని ఇస్తున్నారు.ఈ సినిమాతో శీతల భట్ హీరోయిన్ గా చేస్తుంది. నాకింత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేసి ఈ సంవత్సరం లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని నిర్మాతలు అన్నారు..

చిత్ర నిర్మాత శేషు మారం రెడ్డి , బోయపాటి భాగ్య లక్ష్మి మాట్లాడుతూ. ఇక్కడకు వచ్చిన హీరోలకు, పెద్దలకు ధన్య వాదములు.హర్షవర్ధన్ ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అని చెప్పాను. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి కథతో తీస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలకు, పెద్దలకు ధన్యవాదములు. ఈ మంత్ షూట్ కు వెళ్తున్నాము.మా సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేశాము. నిర్మాతకు ఈ కథ చెప్పగానే కథ బాగుందని ఈ సినిమాకు ఎం కావాలో ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదములు. ఈ సినిమాలో కాశి విశ్వనాథ్ గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శివాజీ రాజా , సునీల్ , ధన్ రాజ్ , , మీనా కుమారి
ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరితో పాటు మంచి టెక్నిషియన్స్ దొరికారు ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు

నటుడు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ..దర్శకుడు మంచి కథ రాసుకున్నాడు.హర్ష వర్ధన్ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది .ఈ సినిమాకు హిట్ కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ఈ కార్యక్రమానికి హీరో ధనరాజ్ గారు మరియు ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు

నటీ నటులు
హీరో : వరుణ్ సందేశ్
హీరోయిన్ : సీతల్ భట్
తనికెళ్ళ భరణి, శివాజీ రాజా , సునీల్ , ధన్ రాజ్ , కాశి విశ్వనాథ్ , మీనా కుమారి

సాంకేతిక నిపుణులు :
బ్యానర్: బి. యం సినిమాస్
నిర్మాత: శేషు మారం రెడ్డి , బోయపాటి భాగ్య లక్ష్మి
కథ , దర్శకుడు: ఆర్ . యన్ హర్ష వర్ధన్
కెమెరామెన్: జవహర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్ :రవి కుమార్ గుర్రం
సంగీతం: రధాన్
కో- ప్రొడ్యూసర్ : ధన తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్ : రవి తేజ పూదారి
పి. ఆర్. ఓ :శ్రీపాల్ చొల్లేటి

చివరి షెడ్యూల్ లో స్కై

చివరి షెడ్యూల్ లో స్కై

 

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో “వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్”పై నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “స్కై”. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. సుప్రసిద్ధ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఈ చిత్రానికి పని చేస్తుండడం గమనార్హం!!
“ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్టే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం తుంటరిగా పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా “స్కై” చిత్రం కథాంశమని… రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ “స్కై” చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు!!
చివరి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయనున్నామని, తెలుగువారంతా గర్వపడే చిత్రంగా “స్కై” చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని నిర్మాతలు నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు తెలిపారు!!
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సమాంతరంగా జరుపుకుంటున్న ఈ విభిన్న కథా చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: కృష్ణా డిజిటల్స్, మాటలు: మురళీ కృష్ణంరాజు – పృథ్వి పేరిచర్ల, సంగీతం: శివ, ఎడిటర్: సురేష్ అర్స్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, నిర్మాతలు: నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: పృథ్వి పేరిచర్ల!!

Pin It on Pinterest