Select Page
మనసుకు హత్తుకునే లాట్స్ ఆఫ్ లవ్ మూవీ రివ్యూ

మనసుకు హత్తుకునే లాట్స్ ఆఫ్ లవ్ మూవీ రివ్యూ

 

ప్రేమపై ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అనంతమైనది ప్రేమ. ప్రేమలోని సరికొత్త కోణాన్ని… లాట్స్ ఆఫ్ లవ్ లో ప్రజంట్ చేశామని చిత్ర బృందం చెబుతోంది. మరి ఆ తరహాలో ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఈ సినిమాలో ఉందో? లేదో? లాట్స్ ఆఫ్ లవ్ చూద్దాం ఈవారం

సినిమా కథ: ఇందులో ప్రధానంగా అయిదు కథలున్నాయి. అందులో ఏ ఏ కథలు వున్నాయి అంటే….

కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్. బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, మందులు దొరకక జనాలు అల్లాడిపోతుంటే చూసి తట్టుకోలేక వారి కోసం ఏమైనా చేయాలని తపించే డాక్టర్.. మనోహర్ (విశ్వానంద్ పటార్). కానీ తను అనుకున్న పనిని చేయడానికి ఆయన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. నామమాత్రపు ఫీజుతో చికిత్స చేస్తూ.. జనాలకు సేవ చేసే మనోహర్ అప్పులలో కూరుకుపోతాడు. మరి అతని తపన ఎలా తీరింది? అతనికి, స్కూల్ టీచర్ సరిత (ఆద్య)కు మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్లింది?. కాలేజ్‌కు బస్సులో వెళుతున్న రాకేష్ (నిహాంత్).. అదే బస్సులో నిలబడి ఉన్న మనోజ(దివ్య)కు సీటిచ్చి.. ఆ అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. కానీ వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరు. అందుకు కారణం ఏమిటి? ఒక అనాథ అయిన రాజు (రాజేష్) ఎంతో కష్టపడి.. పెద్ద పేరున్న కంపెనీలో ఉద్యోగం పొందుతాడు. అతని సక్సెస్‌కు కారణమైన రజిని (భావన)ను ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ రజినీ ఫ్యామిలీ రాజు అనాథ అని పెళ్లికి ఒప్పుకోరు. మరి వారి పెళ్లి ఎలా జరిగింది? అసలతను అనాథ ఎలా అయ్యాడు? ప్రస్తుత ప్రపంచ తీరు గురించి, దేవుడి గురించి తత్వం బోధించే స్వామిజీ (కిరణ్)కి, ఎవరు కష్టంలో ఉన్నా.. నేనున్నానంటూ చేయూతనందించే ఎన్‌జిఓ సంయుక్త (మాధవి)కి ఉన్న సంబంధం ఏమిటి? డబ్బుతో, రౌడీయిజంతో.. పిల్లికి కూడా బిచ్చం పెట్టని పొగరబోతు జమీందారు యాదగిరి (తెనాలి పంతులు), అతని కొడుకులు చేసే అరాచకం… పుత్ర వాత్సల్యంతో తండ్రి వారిని సరైన మార్గంలో పెట్టక పోవడంవల్ల కలిగే అనర్థాలు… ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ: ఇలా కొన్ని కథల సమాహారం ఈ చిత్రం. ఈ సినిమాకి కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలన్నింటినీ ఈ చిత్ర హీరో విశ్వానంద్ పటార్ ఒక్కడే నిర్వర్తించడం అనేది నిజంగా అభినందనీయం. క్యాస్టింగ్‌ని ఆయన సమకూర్చుకున్న తీరు, పైన చెప్పుకున్న కథలను మిక్స్ చేసిన తీరు అందరినీ మెప్పిస్తుంది. జమీందారు ఫ్యామిలీకి పై కథలను లింక్ చేసిన విధానం, చివరికి ఆ జమీందార్ మారిపోయిన విధానంతో ఒక మంచి మెసేజ్‌ను కూడా ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. వాస్తవానికి అది నేటి ప్రపంచంలో జరుగుతున్నదే. సాటి వారికి సాయం చేయని వాడు, దేవుడిని కూడా లెక్క చేయకుండా ధూషించేవాడు.. చివరికి అన్నీ పోగొట్టుకుంటాడనే మెసేజ్.. డబ్బున్న ధనవంతులకు ఇచ్చినట్లుగా ఉంది. స్వామిజీతో చెప్పించిన ‘పైకి ఎన్ని కారణాలు ఉన్నా.. చివరికి గమ్యస్థానం చేరుకోవడమే ముఖ్యం. మన జీవితంలో ఎప్పుడూ మన గమ్యాన్ని, గమ్యస్థానాన్ని గుర్తించుకుంటూనే ఉండాలి’, ‘వృత్తి ధర్మంతో పాటు స్వధర్మం కూడా పాటించాలి’, ‘యవ్వనం వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండి.. వారి అభిప్రాయాల్సి మన్నించాలి. అప్పుడే పిల్లలు గౌరవిస్తారు. వారిని లాలించాలి తప్ప.. శాసించకూడదు’ వంటి డైలాగులు ఆలోచనను రేకెత్తిస్తాయి. అలాగే డాక్టర్‌గా మనోహర్ ‘విద్య, వైద్యం సరైన దిశలో అందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకు టీచర్, డాక్టర్ మార్గదర్శనం చేయాలి’ అంటూ సమాజం బాగుండాలంటే ఏం చేయాలో చెప్పిన తీరు.. ‘సెల్ఫ్ లవ్, ఫ్యామిలీ లవ్, రొమాంటిక్ లవ్, ఫ్రెండ్షిప్ లవ్, డివైన్ లవ్, ప్రొఫెషనల్ లవ్’ అంటూ.. వాటి అర్థాన్ని వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా మెడికల్ మాఫియా బయట ఎలా ఉందో కూడా ఈ సినిమాలో చూపించారు. ఇంకా జమీందార్ యాదగిరి మారిన తీరు కూడా ఒక గుణపాఠంలా అనిపిస్తుంది. అయితే అక్కడక్కడా లాజిక్ లేని కొన్ని సీన్లు, ఫస్టాఫ్‌లో కథ నడిచిన విధానం, అలాగే నటీనటులంతా కొత్తవారు కావడం కూడా.. ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్‌కి గురి చేస్తాయి. ఎమోషన్స్ పండించే సీన్లను ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించాల్సింది.
ప్లస్ పాయింట్స్ :

డైరెక్షన్
మ్యూజిక్
నటీనటుల పాత్రల మేరకు

మైనస్ పాయింట్స్ :

కాస్త ఎడిటింగ్

సినిమా నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో మెయిన్ పాత్రను చేయడమే కాకుండా.. సినిమాకు సంబంధించి పలు బాధ్యతలను దర్శకుడు విశ్వానంద్ పటార్ పోషించారు. కరోనా రోగులకు సేవ చేయాలనే తపన కలిగిన డాక్టర్‌గా, తల్లి కోరికను తీర్చాలనుకునే కొడుకుగా, ప్రేమికుడిగా.. ఇలా వైవిధ్యభరితంగా ఉండే మనోహర్ పాత్రలో విశ్వానంద్ ఆకట్టుకుంటాడు. ఆయన ప్రియురాలిగా చేసిన సరిత.. కాలేజ్ స్టూడెంట్స్‌గా చేసిన నిహాంత్, దివ్య.. అనాథగా చేసిన రాజేష్, అతనికి సపోర్ట్‌గా చేసిన భావన వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. వీరితో పాటు NGOగా చేసిన మాధవి, స్వామిజీ పాత్రలో కిరణ్ హుందాగా కనిపించారు. ఇక విలన్‌గా జమీందార్ పాత్రలో చేసిన తెనాలి పంతులు, ఆయన కొడుకులుగా చేసిన ప్రవీణ్, శ్రీను, రాఘవేంద్రలు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. మంచి పాత్రలు పడితే.. విలన్లుగా వారు కొంతకాలం అలరించే అవకాశం ఉంది. ఇంకా మిగతా పాత్రలలో నటించిన వారు కూడా ఓకే. సాంకేతికంగా.. సినిమాకు తగినట్లుగా సంగీతం, ఎడిటింగ్, కెమెరా వర్క్ ఉంది. డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. రెండు పాటలు బాగున్నాయి. దర్శకుడు విశ్వానంద్ పటార్.. ఆయన నటించడమే కాకుండా.. భారీ తారాగణంతో.. ఓ నాలుగైదు కథలను మిక్స్ చేసి.. అందులోనూ ఓ మెసేజ్‌ని చొప్పించి.. తన మల్టీ టాలెంట్‌ను ప్రదర్శించాడు. ఓవరాల్‌గా అయితే.. ప్రేమ పేరుతో ఓ మంచి మెసేజ్ అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు ఇస్తుంది.

సినిమిర్చి రేటింగ్: 3/5

ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి పక్కా చూడవలసిన చిత్రం

ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి పక్కా చూడవలసిన చిత్రం

బిగ్ బాస్ ఫేం వి.జె సన్నీ, అసిమా, శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ. చమ్మక్ చంద్ర, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం… సకల గుణాభి రామ. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మాత సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఆడియెన్స్ లో మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియెన్స్ ను ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

సినిమా కథ: అభి రామ్(వి.జే. సన్నీ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో తక్కువ జీతంతో జీవనం సాగిస్తూ వుండే ఓ బిలో మిడిల్ క్లాస్ అబ్బాయి. స్వాతి (అషిమా)ని ప్రేమించి పెళ్లాడుతాడు. అయితే వచ్చే జీతం చాలక వడ్డీ వ్యాపారం చేసే ప్రదీప్ (శ్రీ తేజ్) అప్పు తీసుకుని… వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతుంటాడు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా… రామ్ భార్య స్వాతి పిల్లలను సంతానం వొద్దని… సేఫ్టీ వాడుదాం అని చెబుతూ పిల్లలని కనడం వాయిదా వేస్తూ వుంటుంది. ఈ క్రమంలో ఓ సారి భార్య మీద అఘాయిత్యం చేస్తాడు. దాంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. మరి అలా వెళ్లిన స్వాతి తిరిగి వచ్చిందా? ఆమె పుట్టింటికి వెళ్లిపోయిన తరువాత రామ్ ఏమి చేశాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ. కథనం విశ్లేషణ : ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి… చాలీ చాలని జీతం. అలాంటి యువకుని జీవితంలో జరిగే ఫన్… ఇలాంటి కథలు నేటి యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే రచయిత… ఈచిత్రం డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ మంచి ఫన్ ఎలిమెంట్స్ తో కథ.. కథనాలను రాసుకుని ఎంటర్ టైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా… హీరో పనిచేసే కంపెనీలో సహా ఉద్యోగులతోనూ, యజమానితోను సరదా సరదా సన్నివేశాలతో టైం పాస్ మూవీగా సాగి… ఇంటర్వెల్ తరువాత పరాయి స్త్రీతో పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది… దాని వల్ల నేర్చుకునే గుణపాఠం.. తదితర విషయాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే కాదు… ఏవైనా పొరపాట్లు జరిగితే… వాటిని క్షమించే క్షమాగుణం కూడా భార్యా భర్తలకు వుండాలి. అప్పుడే అలాంటి బంధాలు సొసైటీలో చాలా బలంగా వుంటాయి అనే ఓ మెసేజ్ ని కూడా ఇచ్చాడు దర్శకుడు.

ఈ చిత్ర హీరో వి.జె.సన్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగి గా… ఓ చిలిపి భర్తగా చక్కగా నటించాడు. కామెడీ, ఎమోషన్ సీన్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. పాటల్లో డ్యాన్స్ కూడా ఎంతో ఈజ్ చూపించాడు. హీరోయిన్ అషిమ పాత్రకి తగ్గట్టుగా నటించింది. విలన్ భార్య గా దీపిక… పాత్రలో నటించిన తరుణీ సింగ్ తన బబ్లీ నటనతో ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఆమెతో హీరో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వడ్డీ వ్యాపారి ప్రదీప్ పాత్రలో శ్రీతేజ్ విలక్షణంగా కనిపించి మెప్పించాడు. సెవెన్ ఆర్ట్స్ సరయు బోల్డ్ పాత్రలో యుత్ ని ఆకట్టుకుంటుంది, విట్టా మహేష్ కామెడీ ట్రాక్ పర్వాలేదు.

దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మంచి కథ.. కథనాలను రాసుకున్నాడు. అయితే మరింత బాగా దాన్ని తెరమీద ఆవిష్కరించి వుంటే మంచి సినిమా అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాణ విలువలు క్వాలిటీగా వున్నాయి. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాని రిచ్ గా తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్..!

సినిమిర్చి.కాం మూవీ రేటింగ్: 3/5

పెళ్ళికూతురు పార్టీలో… నవ్వులే నవ్వులు

పెళ్ళికూతురు పార్టీలో… నవ్వులే నవ్వులు

ఇప్పటి దాకా పెళ్లికి ముందు అబ్బాయిలే చేసుకునే బ్యాచ్ లర్ పార్టీలను… అమ్మాయిలు కూడా చేసుకుంటే ఎలా వుంటుంది అనేదాన్ని ఎంతో ఫన్నీ గా… థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లేడీ డైెక్టర్ మల్లాది అపర్ణ పెల్లికుతురు పార్టీ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రిన్స్. అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.వి.ఆర్. స్వామి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్స్ తో యూత్ లో మంచి బజ్ వున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: అక్క పెళ్లి చేసుకోబోయే వాడిని ముద్దు పెట్టుకున్న చెల్లి (హీరోయిన్ అనీషా ధామా) అది తప్పని గ్రహించి… అక్క పెళ్లిని తను ముద్దు పెట్టిన వ్యక్తితో తప్పించి వేరే వ్యక్తి (ప్రిన్స్)తో చేయడానికి వేసిన ప్లాన్… ఆ ప్లాన్ ని అమలుచేసే క్రమంలో వచ్చే కామెడీ.. ఆ తరువాత ట్విస్ట్ లే ఈ చిత్రం ప్రధాన కథ.

కథనం విశ్లేషణ: పెళ్లికి ముందు ఇప్పటి వరకు అబ్బాయిలే బ్యాచ్ లర్ పార్టీలు చేసుకోవడం చూశాం. అదే అమ్మాయిలు కూడా బ్యాచ్ లర్ పార్టీ చేసుకుంటే… ఆ కిక్కే వేరు. పురుషులతో పాటు… మహిళలకి కూడా సమాన హక్కులు… హోదాలు… స్వేచ్చ ఉండాలనుకునే నేటి సమాజంలో ఇప్పటికీ కొన్ని సంప్రదాయాల విషయంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు వుండలేక పోతున్నారు. అందులో ఇదిగో పెళ్లికి ముందు అబ్బాయిలు చేసుకునే బ్యాచ్ లర్ పార్టీ ఒకటి. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి… అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా ఇలాంటి పార్టీని ఏ గోవా బీచ్ లాంటి ప్లేసులో చేసుకుంటే వాళ్ళ ఆనందానికి హద్దులు వుండవు. మహిళ దర్శకురాలు మల్లాది అపర్ణ… బ్యాచ్ లర్ అమ్మాయిల కోణంలో వారి మనోభావాలను చక్కగా పెళ్ళికూతురు పార్టీలో ఆవిష్కరించారు. ఇందులో సరదాగా నలుగురు అమ్మాయిలు బ్యాచ్లర్ పార్టీ చేసుకుందామని ఇంట్లో చెబితే బామ్మను కూడా తీసుకెళ్ళమంటారు. ఇలా బామ్మతో పాటు వెళ్లిన ఆ నలుగురు అమ్మాయిలు కొంచెం ఫన్నీగా.. మరికొంచెం సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగే రోడ్ జర్నీ కథ చాలా ఆసక్తికరంగా వుటుంది. యూత్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమా ఆద్యంతం సరదాగ సాగిపోతుంది.

ఇటీవల విడుదలైన DJ టిల్లు సినిమాతో మాంచి కామెడీని పంచిన ప్రిన్స్….ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. గీతా గోవిందం చిత్రంలో మాంచి బోల్డ్ సీన్ తో యూత్ ని ఆకట్టుకున్న అనీషా ధామా ఇందులో లీడ్ రోల్ పోషించి ఆకట్టుకుంది. బామ్మగ నటించిన అన్నపూర్ణమ్మ తన మార్క్ కామెడీతో అలరించింది. రోడ్ జర్నీలో… మిగతా అమ్మాయిలతో కలిసి చేసే కామెడీ, ఆమె ఫన్నీ సంభాషణలు అన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

మహిళా ద్శకురాలు మల్లాది అపర్ణ… వుమెన్ సెంట్రిక్ గా రాసుకున్న అంశాలను.. కామెడీ ప్రధాన అంశంగా మంచి ఇంట్రెస్టింగ్ మలుపులతో సినిమాని నడిపించారు. ముఖ్యంగా అమ్మాయిల కోణంలో ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. శ్రీకర్ అగస్తీ అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి రిచ్ గా వుంది. గోవా అందాలను చక్కగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. యూత్ ఫుల్ కామెడీ ఎంట్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

చోర్‌ బజార్‌’ సినిమా రివ్యూ..

చోర్‌ బజార్‌’ సినిమా రివ్యూ..


ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరి నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ‘రొమాంటిక్’ మూవీతో నటనపరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు ‘చోర్‌ బజార్‌’ సినిమాతో మరోసారి సందడి చేశాడు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి ‘జార్జ్ రెడ్డి’ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్‌) అమితాబ్‌ బచ్చన్‌ అభిమానిగా నటించింది.

సినిమా కథ:
హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ. 200 కోట్లు విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రం అపహరణకు గురవుతుంది. దొంగలను పట్టుకునే క్రమంలో ఆ వజ్రం చోర్ బజార్‌ అనే ఏరియాలో పడుతుంది. మరోవైపు చోర్‌ బజార్‌ను అన్ని తానై నడిపిస్తుంటాడు బచ్చన్‌ సాబ్ (ఆకాష్‌ పూరి). దీంతో ఎలాగైన ఆ వజ్రాన్ని పట్టుకునేందుకు చోర్‌ బజార్‌లో కాపు కాస్తారు పోలీసులు. మరి ఆ వజ్రాన్ని పోలీసులు పట్టుకున్నారా ? చివరిగా అది ఎక్కడికి చేరింది ? బచ్చన్‌ సాబ్‌ ప్రేమించిన మూగ అమ్మాయి సిమ్రాన్‌ (గెహనా సిప్పీ)ని దక్కించుకున్నాడా? చోర్‌ బజార్‌ను శాశ్వతంగా మూయించాలనుకున్నా గబ్బర్‌ సింగ్ (సుబ్బరాజు) ఏం చేశాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే ‘చోర్‌ బజార్‌’ చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ:
డైరెక్టర్‌ జీవన్‌ రెడ్డి ‘జార్జ్‌ రెడ్డి’తో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతకుముందు ఆయన ‘దళం’ సినిమాకు ఒక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాల అనుభవం ‘చోర్‌ బజార్‌’ మూవీని తెరకెక్కించడంలో కనిపించలేదనే చెప్పవచ్చు. వజ్రాన్ని దొంగతనం చేసే సన్నివేశంతో ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు తర్వాత పూర్తిగా తడబడ్డారు. డైమండ్‌ చోరి తర్వాత వచ్చే సీన్లన్ని చప్పగా సాగుతాయి. డైమండ్‌ చోరీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో లవ్‌, చోర్‌ బజార్‌ మనుషుల కథ, ఉమెన్‌ ట్రాఫికింగ్, అమితాబ్‌ బచ్చన్‌ మీద అభిమానంతో ఇళ్లు వదిలేసి వచ్చిన యువతి కథ వంటి పలు ఉప కథలు గందరగోళానికి గురిచేస్తాయి. మరీ స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, గజిబిజి సీన్లతో నిండిన ఎడిటింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. రెండు పాటలు, సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించింది. నటీనటులు మాట్లాడే తెలంగాణ యాస కొంత ఇబ్బందిపెడుతుంది.


నటీనటులు పని తీరు :
ఆకాష్‌ పూరి నటన ఇంతకుముందు చిత్రాల్లానే ఇందులో ఉంది. అలాగే పూరీ స్టైల్‌ హీరోగా కనిపిస్తాడు. ప్రతి సినిమాలో అలాగే కనిపించేసరికి రొటీన్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్స్‌ పర్వాలేదనిపిస్తుంది. ఇక మూగ అమ్మాయిగా గెహనా సిప్పీ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. మూగ అమ్మాయిగా హీరోయిన్‌ ఎలివేట్‌ అయ్యే సన్నివేశాలు అంతగా లేకున్నా ఉన్నంతలో బాగానే నెట్టుకొచ్చింది. సీనియర్‌ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్‌) బాగుంది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ అంతగా వర్కౌట్‌ కాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ ‘చోర్‌ బజార్‌’ను వీక్షించాలంటే మాత్రం ఎంతో ఓపిక కావాలి.

చివరగా : మంచి మాస్ చిత్రంగా చోరు బజారు నిలిచిపోతుంది
సినిమిర్చి.కాం రేటింగ్ : 3/5

ఎమోషనల్ లవ్ స్టోరీ సదా నన్ను నడిపే  మూవీ రివ్యూ

ఎమోషనల్ లవ్ స్టోరీ సదా నన్ను నడిపే మూవీ రివ్యూ

‘ వాన‌విల్లు ‘ చిత్రం త‌ర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్ న‌టించిన చిత్రం ‘ సదా నన్ను నడిపే ‘. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ఇతర ప్ర‌ధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ సినిమాకి చిత్ర హీరోనే ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించారు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: MJ అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా(వైష్ణవి పట్వర్దన్) ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్ గా లవ్ చేస్తూ వుంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా MJ ప్రేమని అంగీకరించడు. అయితే MJ మాత్రం ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ వుంటాడు. ఈ కార్యక్రమంలో MJ ప్రేమని…. సాహా అంగీకరించి వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్ళైన మొదటి రోజు నుంచే MJ ని దూరం పెడుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని కూడా సాహా… MJ ని ఎందుకు దూరం పెడుతూ ఉంటుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరకి కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!

కథ… కథనం విశ్లేషణ: చిత్ర హీరో చెప్పినట్టు ఇంతకు మునుపు స్వచ్చమైన, నిశ్వర్థమైన ప్రేమకథలతో గీతాంజలి, కలిసుందాం రా లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ని కళకళ లాడించాయి. ఇప్పుడీ చిత్రాన్ని కుడా హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్… ఎంతో ఎమోషనల్ గా… ప్యూర్ లవ్ ట్రాక్ తో ఎంతో ఎంటర్టైనింగ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మ‌న‌కు బాగా తెలిసిన వ్య‌క్తి చ‌నిపోతున్నారని తెలిశాక వారితో వున్న కొద్దిక్ష‌ణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటామో అనేది ఇందులో చూపించారు. ప్రేమించిన వ్యక్తికోసం ఎలాంటి త్యాగాన్ని ఆయినా చెయ్యొచ్చు అని… ఇందులో ఎంతో ఎమోష‌నల్ గా తెరకెక్కించారు. దానికీ ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు. క‌ర్నాట‌క‌లో జ‌రిగిన ఓ వాస్తవ సంఘటన అంశాన్ని తీసుకుని సినిమాటిక్‌గా మార్చిన తీరు బాగుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా వుంది

హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ చాలా బాగా చేశాడు. తను నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యలను చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలీ వున్నంత సేపు బాగా నవ్వులు పుయించాడు. నాగబాబు, రాజీవ్ కనకాల తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌, కొడైకెనాల్‌, కులుమ‌నాలిలో చిత్రీకరించిన లోకేషన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3.25

క‌ర‌ణ్ అర్జున్‌  మూవీ రివ్యూ

క‌ర‌ణ్ అర్జున్‌ మూవీ రివ్యూ

క‌ర‌ణ్ అర్జున్‌ మూవీ రివ్యూ

సినిమా కథ: కరణ్ (నిఖిల్ కుమార్) తనకి కాబోయే భార్య వృషాలి (షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్ లో వున్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు. అక్కడ అర్జున్ (అభిమన్యు) వీళ్ళని ఇద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో వీల్లిద్దరినీ వెంబడిస్తూ షూట్ చేసి చంపాలనుకుంటాడు అర్జున్. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో నానా పాట్లు పడతారు కరణ్, వృషాలి. ఈ క్రమంలో అక్కడ స్థానికంగా ఉండే లారీ డ్రైవర్ అతనితో పాటు వుండే క్లీనర్ వృషాలిని ఎత్తుకుపోతారు. వారి బారి నుంచి వృశాలిని, అర్జున్ కాపాడుతాడు.

ప్లస్ పాయింట్స్ :
డైరెక్షన్
సాంగ్
లొకేషన్స్ చాలా కొత్తగా ఉన్నవి
సినిమా ప్రథమార్ధం
హీరోయిన్
లాస్ట్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్ :
రెండవ భాగం అక్కడ అక్కడ కొన్ని సన్నివేశాలు ..
రెగ్యులర్ సినిమా కాకపోవటం

కథనం విశ్లేషణ: గుప్పెడంత మనసుకి సముద్రమంత గాయం అయితే…. చివరకు ప్రాణాలు తీసే అంత క్రూరత్వం పనికి రాదు అని దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పిన నీతి సూత్రం బాగుంది. ఒకరు అమ్మ మీద వున్న అమితమైన ప్రేమతో…. మరొకరు అమ్మాయి మీద వున్న ఘాడ ప్రేమతో… ప్రాణాలు తీసేదాకా వెళ్ళడం మంచిది కాదని దర్శకుడు చాలా థ్రిల్లంగ్ ఎలిమెంట్స్ తో చెప్పారు. ఇంటర్వల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ దాకా ఆసక్తికరమైన ట్విస్టులతో కథ… కథనాలను నడిపించాడు దర్శకుడు. కొంచం స్టార్ కాస్ట్ వుండి వుంటే సినిమాకి అదనపు బలం చేకూరేది.
నిఖిల్ కుమార్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో చక్కగా నటించాడు. తల్లిని అమితంగా ప్రేమించే కరణ్ పాత్రకు బాగా సూట్ అయ్యాడు. తల్లి పాత్రలో నటించిన సునీత చౌదరి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తన పాత్ర పరిధి మేరకు నటించింది.

చివరగా : కొత్త తరహా చిత్రం ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

సిని మిర్చి .కాం రేటింగ్: 3/5

Pin It on Pinterest