Select Page

5 వ స్నాతకోత్సవానికి సన్నాహాలు!!

అగ్రనిర్మాతలు
అల్లు అరవింద్-దిల్ రాజు”గార్ల
సహాయసహకారాలు మరువలేనివి!!

-ప్రఖ్యాత దర్శకులు-
ఫిల్మ్ స్కూల్ సారధి
అంకురం ఉమామహేశ్వరరావు!! జాతీయ స్థాయి ఉత్రమ నటి రేవతితో ముప్పై ఏళ్ల క్రితం "అంకురం" రూపొందించి.. రివార్డులతోపాటు... లెక్కకు మిక్కిలి అవార్డులు కొల్లగొట్టిన ప్రముఖ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు తాజాగా మళ్లీ రేవతితోనే "ఇట్లు అమ్మ" రూపొందించి... మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. నిర్మాతకు కనకవర్షం కురిపించిన "ఇట్లు అమ్మ" జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో 76 అవార్డులు గెలుచుకుని.. "సోని లివ్"లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటూ.. తెలుగు సినిమా సత్తాను మరోసారి సగర్వంగా చాటి చెబుతోంది. మమ్ముట్టి-సుమన్-నగ్మా-మాలాశ్రీలతో "సూర్యపుత్రులు", అరవింద్ సామి-నగ్మాలతో "మౌనం", జగపతిబాబు-హీరాలతో "శ్రీకారం" వంటి రివార్డ్స్ అండ్ అవార్డ్స్ విన్నింగ్ ఫిల్మ్స్ రూపొందించి... దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం కలిగిన విశిష్ట దర్శకులు సి.ఉమామహేశ్వరరావు.... సినిమా లతో బిజీగా ఉంటూనే గత ఐదేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా "దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" నిర్వహిస్తున్నారు!! దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కె.విశ్వనాధ్ చేతుల మీదుగా మొదలైన "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్"... అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి చిత్ర ప్రముఖుల ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమకు గత ఐదేళ్లుగా ఎందరో ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో... దిగువ మధ్య తరగతివారికి సైతం అందుబాటులో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లేని లోటును తీర్చుతోంది!! "అంతర్జాతీయ ప్రమాణాలు... అందరికీ అందుబాటులో ఫీజులు" అనే సిద్ధాంతంతో ప్రగతిపథంలో దూసుకుపోతున్న "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" మరికొద్ది రోజుల్లో 5 వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ఫిల్మ్ స్కూల్ సారధి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ... "యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ"లకు మాత్రమే పరిమితం కాకుండా... ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఆడియోగ్రఫి, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్ వంటి సౌండ్ కి సంబంధించిన కోర్సులు సైతం ఉండడం మా ఫిల్మ్ స్కూల్ ప్రత్యేకత. ఇప్పటివరకు మా స్కూల్ లో కోర్సులు చేసినవారంతా... ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో విశేషంగా రాణిస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజినల్ సినిమాలపై సమగ్ర అవగాహన కలిగేలా సిలబస్ డిజైన్ చేశాం. మన దేశంలో ఉన్న బెస్ట్ ఫిల్మ్ స్కూల్స్ అనుసరించే సిలబస్ బాగా స్టడీ చేసి... వాటన్నిటిలో ఉన్న ఉత్తమ అంశాలు మేళవించి...మా ఫిల్మ్ స్కూల్ సిలబస్ రూపొందించాం" అని వివరించారు!! ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, నీలకంఠ, ప్రముఖ నటులు నాజర్, రేవతి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి వంటి నిష్ణాతులు గెస్ట్ ఫ్యాకల్టీగా కలిగిన *"దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్"* ను మన దేశంలోనే నంబర్ 1 ఫిల్మ్ స్కూల్ గా తీర్చిదిద్దాలనే వజ్ర సంకల్పం కలిగిన ఉమామహేశ్వరరావు ఇంకా మాట్లాడుతూ... "ఫిల్మ్ స్కూల్ కు సంబంధించి అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతల సలహాలు-సూచనలు, సహాయ సహకారాలు మరువలేనివి. నా తదుపరి చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటిస్తాం" అన్నారు!! విద్యాధికుడు, విజువల్ ఆర్ట్స్ లో ప్రతిభాశాలి *నందన్ బాబు* ప్రిన్సిపాల్ గా... ప్రముఖ సినిమాటోగ్రాఫర్ & డైరెక్టర్ *మధు మహంకాళి* "డీన్"గా.. సినిమాటోగ్రాఫర్ *వరప్రసాద్*, స్క్రిప్ట్ రైటర్ & డైరెక్టర్ *రాము* ల నిర్దేశకత్వలో.. అత్యంత నిష్ణాతులైన ఫ్యాకల్టీ కలిగిన *దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్* లో చేరి... సినిమా రంగంలో తమ ప్రతిభకు పట్టాభిషేకం చేయించుకోవాలని ఉవ్విళ్ళూరేవారు

7780196227 నంబర్ లో నేరుగా సంప్రదించవచ్చు.
పూర్తి వివరాల కోసం www.dpsfs.edu.in
వెబ్సైట్ సందర్శించవచ్చు!!

Pin It on Pinterest