Select Page

ఇక మ‌హేశ్ కూడా బాలీవుడ్‌లోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల స‌తీమ‌ణులు కూడా తీరిక స‌మయం దొరికితే ఒక్క చోట క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. తాజాగా అలాంటి అరుదైన సంద‌ర్భం మ‌హేశ్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ (Namrata Shirodkar)కు, షారుక్ ఖాన్ స‌తీమ‌ణి గౌరీఖాన్ (Gauri Khan)కు వ‌చ్చింది. ఈ ఇద్ద‌రు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా లంఛ్ డేట్ (lunch date) ప్లాన్ చేశారు.ఇద్ద‌రూ మ‌ధుర‌ జ్ఞాప‌కాల‌ను షేర్ చేసుకున్నారు. గౌరీఖాన్‌తో లంఛ్ డేట్ వెళ్లిన స‌మ‌యంలో దిగిన ఫొటోను న‌మ్ర‌తా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గౌరీఖాన్ ఇంట్లో ఊహించ‌ని స‌ర‌దా భోజ‌నం..గౌరీఖాన్ హౌస్‌లో..అక్షరాలాగా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం..సమయం నిల‌క‌డ‌గా ఉంది..పూర్తి లంచ్ ఫ్లాష్‌బ్యాక్‌లు, గొప్ప జ్ఞాపకాలు, చాలా నవ్వులు మిగిల్చింది..అంటూ త‌న హ్యాపీనెస్‌ను షేర్ చేసుకుంది న‌మ్ర‌తా. స్టార్ హీరోల స‌తీమ‌ణుల లంఛ్ డేట్ ఫొటో ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

https://www.instagram.com/namratashirodkar/?utm_source=ig_embed&ig_rid=ea1bc6ab-de46-488b-8442-7e450ab2e00f

Pin It on Pinterest