Select Page
క‌ర‌ణ్ అర్జున్‌  మూవీ రివ్యూ

క‌ర‌ణ్ అర్జున్‌ మూవీ రివ్యూ

క‌ర‌ణ్ అర్జున్‌ మూవీ రివ్యూ

సినిమా కథ: కరణ్ (నిఖిల్ కుమార్) తనకి కాబోయే భార్య వృషాలి (షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్ లో వున్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు. అక్కడ అర్జున్ (అభిమన్యు) వీళ్ళని ఇద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో వీల్లిద్దరినీ వెంబడిస్తూ షూట్ చేసి చంపాలనుకుంటాడు అర్జున్. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో నానా పాట్లు పడతారు కరణ్, వృషాలి. ఈ క్రమంలో అక్కడ స్థానికంగా ఉండే లారీ డ్రైవర్ అతనితో పాటు వుండే క్లీనర్ వృషాలిని ఎత్తుకుపోతారు. వారి బారి నుంచి వృశాలిని, అర్జున్ కాపాడుతాడు.

ప్లస్ పాయింట్స్ :
డైరెక్షన్
సాంగ్
లొకేషన్స్ చాలా కొత్తగా ఉన్నవి
సినిమా ప్రథమార్ధం
హీరోయిన్
లాస్ట్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్ :
రెండవ భాగం అక్కడ అక్కడ కొన్ని సన్నివేశాలు ..
రెగ్యులర్ సినిమా కాకపోవటం

కథనం విశ్లేషణ: గుప్పెడంత మనసుకి సముద్రమంత గాయం అయితే…. చివరకు ప్రాణాలు తీసే అంత క్రూరత్వం పనికి రాదు అని దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పిన నీతి సూత్రం బాగుంది. ఒకరు అమ్మ మీద వున్న అమితమైన ప్రేమతో…. మరొకరు అమ్మాయి మీద వున్న ఘాడ ప్రేమతో… ప్రాణాలు తీసేదాకా వెళ్ళడం మంచిది కాదని దర్శకుడు చాలా థ్రిల్లంగ్ ఎలిమెంట్స్ తో చెప్పారు. ఇంటర్వల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ దాకా ఆసక్తికరమైన ట్విస్టులతో కథ… కథనాలను నడిపించాడు దర్శకుడు. కొంచం స్టార్ కాస్ట్ వుండి వుంటే సినిమాకి అదనపు బలం చేకూరేది.
నిఖిల్ కుమార్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో చక్కగా నటించాడు. తల్లిని అమితంగా ప్రేమించే కరణ్ పాత్రకు బాగా సూట్ అయ్యాడు. తల్లి పాత్రలో నటించిన సునీత చౌదరి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తన పాత్ర పరిధి మేరకు నటించింది.

చివరగా : కొత్త తరహా చిత్రం ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

సిని మిర్చి .కాం రేటింగ్: 3/5

సరికొత్త కథాంశంతో ఈ నెల 24 న వస్తున్న క‌ర‌ణ్ అర్జున్‌

సరికొత్త కథాంశంతో ఈ నెల 24 న వస్తున్న క‌ర‌ణ్ అర్జున్‌

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో డా.సోమేశ్వ‌ర‌ రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌ర‌ణ్ అర్జున్‌.ఈ  చిత్రానికి ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న గ్రాండ్ గా 186 థియేటర్స్ లలో విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రి రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంతరం

చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ…” మహాభారతం లోని కర్ణుడు , అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టు మలుస్తూ తెరకేక్కించిన ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఎంటర్ టైన్ చేస్తుంది. మంచి లొకేషన్స్ కొరకు పాకిస్థాన్ బార్డర్ లో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ షూట్ చేశాము.ప్ర‌తి స‌న్నివేశం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటుంది.ఈ సినిమాలో ఆర్టిస్టులు కొత్తవారని చూడకుండా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలని కంటెంట్ ని న‌మ్ముకుని చేసిన సినిమా ఇది“.మా సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఎంట‌ర్ టైన్ చేస్తుంది. నచ్చుతుంది.నిర్మాతలు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. న్యూ ట్యాలెంట్ ఉన్న వారు బయట చాలా మంది వున్నారు. వారందరికీ ఇలాంటి కొత్త నిర్మాతలు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను మూడు పాత్ర‌ల‌తో రోడ్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కించాం. మొదట ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రిలీజ్ చెయ్యాలి అనుకున్నాము. కానీ సౌత్, రాష్టాలలో తో పాటు నార్త్ లో కూడా మా సినిమాను ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన బాల‌కృష్ణ ఆకుల మాట్లాడుతూ…’ఈ సినిమా బాగా వచ్చింది. సుకుమార్, అనిల్ రావిపూడి, పరుశురాం తదితరులు మా సినిమాకు సపోర్ట్ చేశారు. వారికి మా ధాన్యవాదాలు. మేము విడుదల చేసిన ట్రైల‌ర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24 న తెలుగు రాష్టాల తో పాటు సౌత్, నార్త్, రాష్టాలలో విడుదల చేస్తున్న మా సినిమా అంద‌రికీ తప్పకుండా న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్, కోరియోగ్రాఫర్ రవిమేకల మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రీ రిలీజ్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. ఈ చిత్ర ట్రైలర్ ఎంతో ఎగ్జ‌యిట్మెంట్ గా ఉందని చూసిన వారంతా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.ఈ సినిమాకు టెక్నిషియన్స్, నటులు అందరూ చాలా కష్టపడ్డారు.మీ అందరి ఆదరణతో ఈ నెల 24 న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

హీరో నిఖిల్ కుమార్ మాట్లాడుతూ…”ఇది మా నాన్న డ్రీమ్. నన్ను హీరోగా తెరపై సినిమా చూడాలనుకున్నారు.మా నాన్న అనుకున్నట్లే సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ఎటువంటి వల్గారిటీ ఉండకుండా ఫుల్ లవ్ & యాక్షన్ ఉంటుంది. చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది అన్నారు.

హీరో అభిమన్యు మాట్లాడుతూ.. ఆర్టిస్ట్ గా నాకిది మెదటి చిత్రమైనా ఆర్టిస్ట్ గా నటనలో నేను ద బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నా. ఇందులో హీరో, హీరోయిన్స్ ఉన్నా కంటెంటే హీరో. మాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

వివారెడ్డి (పబ్లిసిటీ డిజైనర్) మాట్లాడుతూ…ఈ సినిమా చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను ఎన్నో సినిమాలకు డిజైన్ చేశాను సినిమాలు చూశాను. ఈ సినిమా చాలా బాగుంది. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

హీరోయిన్ షిఫ మాట్లాడుతూ.. నాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.

నటీ నటులు
అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా  , మాస్ట‌ర్ సునీత్ , అనితా చౌదరి, రఘు . జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్స్ : డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల,సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్;
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి మేకల;
కథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం : మోహన్ శ్రీవత్స.
ఫైట్స్ : రామ్ సుంకర;
ఎడిటర్ : కిషోర్ బాబు;
కాస్ట్యూమ్ డిజైనర్ : లతా మోహన్;
మ్యూజిక్ : రోషన్ సాలూర్;
పాట‌లుః సురేష్ గంగుల‌;
కొరియోగ్రఫీ : రవి మేకల;
డి .ఓ .పి : మురళి కృష్ణ వర్మన్;
పిఆర్. ఓ : చందు ర‌మేష్ (బాక్సాఫీస్);
డిజైనర్: వీవా పోస్టర్స్,

సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ చేతుల మీదుగా క‌ర‌ణ్ అర్జున్‌ ఫ‌స్ట్ లుక్ లాంచ్‌

సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ చేతుల మీదుగా క‌ర‌ణ్ అర్జున్‌ ఫ‌స్ట్ లుక్ లాంచ్‌

ఇటీవ‌ల కాలంలో కంటెంట్ న‌చ్చితే చాలు కొత్త‌వారా, పాతవారా అని చూడ‌కుండా సినిమాలు స‌క్సెస్ చేస్తున్నారు ఆడియ‌న్స్ . ఆ కోవ‌లో కంటెంట్ ని మాత్ర‌మే న‌మ్ముకుని వస్తోన్న రోడ్ థ్రిల్ల‌ర్ క‌ర‌ణ్ అర్జున్‌. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించ‌గా ఈ చిత్రానికి మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ లాంచ్ ఈ రోజు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చేతుల మీదుగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ మాట్లాడుతూ…క‌ర‌ణ్ అర్జున్‌` టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు స్టోరి లైన్ కూడా చెప్పారు...ప్ర‌జంట్ ట్రెండ్ కి క‌నెక్ట‌య్యే స్టోరి. టీమ్ అంద‌రూ కూడా ఎంతో ప్యాష‌న్ తో సినిమా తీసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స మాట్లాడుతూ….మా సినిమా ఫ‌స్ట్ లుక్ ప‌ర‌శురామ్ గారు లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధ‌న్య‌వాదాలు. ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని లొకేష‌న్స్ లో పాకిస్థాన్ బార్డ‌ర్ లో ఎంతో రిస్క్ తీసుకుని మా సినిమా షూటింగ్ చేశాం. మూడు పాత్ర‌ల‌తో ఊహించని మ‌లుపుల‌తో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఉత్కంఠ‌భ‌రితంగా సాగే రోడ్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే ఎమోష‌న్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావ‌డానికి మా నిర్మాత‌లే కార‌ణం. వారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నాకు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో అనుకున్న‌ట్లు గా తీయ‌గ‌లిగాను. మా నిర్మాత‌లంద‌రికీ పేరు పేరునా నా ధ‌న్య‌వాదాలు. సినిమా ఫ‌స్ట్ కాపీ రెడీ అయింది. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ర‌వి మేక‌ల మాట్లాడుతూ…ఎంతో బిజీగా ఉన్నా డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ గారు టైమ్ ఇచ్చి మా సినిమా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసినందుకు వారికి కృత‌జ్ఞ‌త‌లు. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ బేన‌ర్ పై రూపొందిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`. డైర‌క్ట‌ర్ మోహ‌న్ గారు డిఫ‌రెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నేను ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ తో పాటు కొరియోగ్రఫీ కూడా చేశాను. ఇందులో రెండు పాట‌లున్నాయి. ఒక పాట కశ్మీర్ లో చేశాం. మ‌రో పాటు రాజ‌స్థాన్ లో చేశాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా ఎంతో రిచ్ గా రావడానికి స‌హ‌క‌రించిన మా నిర్మాత‌ల‌కు థ్యాంక్స్ అన్నారు.

అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా , మాస్ట‌ర్ సునీత్ , అనిత చౌదరి, రఘు . జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఫైట్స్ : రామ్ సుంకర;
ఎడిటర్ : కిషోర్ బాబు; కాస్ట్యూమ్ డిజైనర్ : లతా మోహన్; మ్యూజిక్ : రోషన్ సాలూరి; పాట‌లుః సురేష్ గంగుల‌; కొరియోగ్రఫీ : రవి మేకల; డి .ఓ .పి : మురళి కృష్ణ వర్మన్; పిఆర్వోః చందు ర‌మేష్ (బాక్సాఫీస్);
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి మేకల; ప్రొడ్యూసర్స్ : డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల,
సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్; కథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం : మోహన్ శ్రీవత్స.

Pin It on Pinterest