Select Page
పెళ్ళికూతురు పార్టీలో… నవ్వులే నవ్వులు

పెళ్ళికూతురు పార్టీలో… నవ్వులే నవ్వులు

ఇప్పటి దాకా పెళ్లికి ముందు అబ్బాయిలే చేసుకునే బ్యాచ్ లర్ పార్టీలను… అమ్మాయిలు కూడా చేసుకుంటే ఎలా వుంటుంది అనేదాన్ని ఎంతో ఫన్నీ గా… థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లేడీ డైెక్టర్ మల్లాది అపర్ణ పెల్లికుతురు పార్టీ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రిన్స్. అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.వి.ఆర్. స్వామి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్స్ తో యూత్ లో మంచి బజ్ వున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: అక్క పెళ్లి చేసుకోబోయే వాడిని ముద్దు పెట్టుకున్న చెల్లి (హీరోయిన్ అనీషా ధామా) అది తప్పని గ్రహించి… అక్క పెళ్లిని తను ముద్దు పెట్టిన వ్యక్తితో తప్పించి వేరే వ్యక్తి (ప్రిన్స్)తో చేయడానికి వేసిన ప్లాన్… ఆ ప్లాన్ ని అమలుచేసే క్రమంలో వచ్చే కామెడీ.. ఆ తరువాత ట్విస్ట్ లే ఈ చిత్రం ప్రధాన కథ.

కథనం విశ్లేషణ: పెళ్లికి ముందు ఇప్పటి వరకు అబ్బాయిలే బ్యాచ్ లర్ పార్టీలు చేసుకోవడం చూశాం. అదే అమ్మాయిలు కూడా బ్యాచ్ లర్ పార్టీ చేసుకుంటే… ఆ కిక్కే వేరు. పురుషులతో పాటు… మహిళలకి కూడా సమాన హక్కులు… హోదాలు… స్వేచ్చ ఉండాలనుకునే నేటి సమాజంలో ఇప్పటికీ కొన్ని సంప్రదాయాల విషయంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు వుండలేక పోతున్నారు. అందులో ఇదిగో పెళ్లికి ముందు అబ్బాయిలు చేసుకునే బ్యాచ్ లర్ పార్టీ ఒకటి. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి… అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా ఇలాంటి పార్టీని ఏ గోవా బీచ్ లాంటి ప్లేసులో చేసుకుంటే వాళ్ళ ఆనందానికి హద్దులు వుండవు. మహిళ దర్శకురాలు మల్లాది అపర్ణ… బ్యాచ్ లర్ అమ్మాయిల కోణంలో వారి మనోభావాలను చక్కగా పెళ్ళికూతురు పార్టీలో ఆవిష్కరించారు. ఇందులో సరదాగా నలుగురు అమ్మాయిలు బ్యాచ్లర్ పార్టీ చేసుకుందామని ఇంట్లో చెబితే బామ్మను కూడా తీసుకెళ్ళమంటారు. ఇలా బామ్మతో పాటు వెళ్లిన ఆ నలుగురు అమ్మాయిలు కొంచెం ఫన్నీగా.. మరికొంచెం సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగే రోడ్ జర్నీ కథ చాలా ఆసక్తికరంగా వుటుంది. యూత్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమా ఆద్యంతం సరదాగ సాగిపోతుంది.

ఇటీవల విడుదలైన DJ టిల్లు సినిమాతో మాంచి కామెడీని పంచిన ప్రిన్స్….ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. గీతా గోవిందం చిత్రంలో మాంచి బోల్డ్ సీన్ తో యూత్ ని ఆకట్టుకున్న అనీషా ధామా ఇందులో లీడ్ రోల్ పోషించి ఆకట్టుకుంది. బామ్మగ నటించిన అన్నపూర్ణమ్మ తన మార్క్ కామెడీతో అలరించింది. రోడ్ జర్నీలో… మిగతా అమ్మాయిలతో కలిసి చేసే కామెడీ, ఆమె ఫన్నీ సంభాషణలు అన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

మహిళా ద్శకురాలు మల్లాది అపర్ణ… వుమెన్ సెంట్రిక్ గా రాసుకున్న అంశాలను.. కామెడీ ప్రధాన అంశంగా మంచి ఇంట్రెస్టింగ్ మలుపులతో సినిమాని నడిపించారు. ముఖ్యంగా అమ్మాయిల కోణంలో ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. శ్రీకర్ అగస్తీ అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి రిచ్ గా వుంది. గోవా అందాలను చక్కగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. యూత్ ఫుల్ కామెడీ ఎంట్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

Pin It on Pinterest