Select Page
అత్యుత్తమ సేవలకు ‘ ఉత్తమ సేవా పతకం ‘

అత్యుత్తమ సేవలకు ‘ ఉత్తమ సేవా పతకం ‘

పోలీసు అధికారులను ఆయ విభాగాల్లో తమ తమ సేవలను గుర్తించి ప్రభుత్వం సత్కరించడం వల్ల వారు మరింత వుత్సాహంతో సేవలు అందిస్తారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ విభాగంలో విశిష్ఠ సేవలను అందించినందుకు గాను ఇంటెలిజన్స్ విభాగం (వెస్ట్ జోన్) హైదరాబాద్ లో పనిచేస్తున్న సి.ఐ.కట్టా హరిప్రసాద్ ని ‘ ఉత్తమ సేవా పతకం ‘తో సత్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనకి ఈ పురస్కారం ఇచ్చి అభినందిచారు. ఆయన 1996వ బ్యాచ్ కి చెందిన వారు. కరీంనగర్ జిల్లాలోని ప్రధాన పోలీస్ స్టేషన్లలో పనిచేసి అనేక ఉత్తమ సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన విధి నిర్వహణలో చూపిన ప్రతిభను గుర్తించి… ఆయన్ని హైదరాబాద్ మహానరంలోని వెస్ట్ జోన్ లో ఇంటెలిజన్స్ విభాగంలో సి. ఐ.గా నియమించారు. ఆయన రెండేళ్లుగా నగరంలో పనిచేస్తూ గుర్తింపు పొందారు.

Pin It on Pinterest